S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

03/16/2019 - 18:04

1938 తెలుగు ఫత్రికా రంగంలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారు అస్తమించడం - రామనాథ గోయెంకా గారి ఆంధ్రప్రభ డైలీ ‘్ఢమ్మ’ని అవతరించడం జరిగాయి. దీంతో శంభు ప్రసాద్ గారి మీద చారిత్రాత్మకమైన గురుతర బాధ్యత - ఒక పర్వతశ్రేణి విరిగి మీద పడ్డట్లు పడ్డది.

03/09/2019 - 20:14

ఓ స్విఛ్ వేస్తే మరో లైటు వెలగడం - ఆ స్విచ్ ఆన్ చేస్తే ఈ దీపం ఆరిపోవడం - ఇది జీవితంలోనే జరుగుతుంది. ‘ఖేసరాసరా’ అన్నది నా ‘మోటో’ (నినాదం) అందరూ టాప్‌లో ‘శ్రీరామరామ’ అని రాస్తే, నువ్వేమిటయ్యా’ - అనేవాళ్లు.

03/02/2019 - 18:51

ఫరిచయాలు వ్యసనాలు కావు. జ్ఞాపకాలు ముండ్ల గులాబీల్లాంటివి; ముండ్లు, తొడిమలు, దళాలు వాడిపోయినా - వాడి’ పరిమళాలు శాశ్వతానుభూతులు! ఆశావాదులు ఎల్లవేళలా ఎదురుచూడటం - బలవంతంగానైనా అలవర్చుకుంటారు. నిరాశావాదులు ‘వర్రీ’ అవడం హాబీగా పెట్టుకుంటారు. లాటరీ టిక్కెట్ కొనడం, ఉద్యోగం కోసం అప్లికేషన్ పంపడం ఒక్కలాంటివే ననిపించింది. ఆ ప్రయత్నం చెయ్యలేదు.

02/23/2019 - 18:58

అఫ్పుడే ఏణ్ణర్ధం అయిపోతోంది - ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం వొదిలిపెట్టి. ఉద్యోగం లేదు. సంపాదనా లేదు. సంపాదకత్వమూ లేదు. కాకపోతే ఆనందవాణి నుంచి - అది వదిలి వచ్చేశాకా, బెజవాడలో సినిమాల పరిచయం, పత్రికల పరిచయం - మా వూరు జంక్షన్ కనుక - అటూ, ఇటూ తిరిగే రచయితలతో కబుర్లూ, కాలక్షేపం. ఒకప్రక్క రాస్తున్న, వెలువడిన నవలల సంఖ్య పది దాటింది. కథలు పడుతూనే వున్నాయ్.

02/16/2019 - 18:25

‘జీవితం ఒక ఫుట్‌బాల్ లాంటిది’ అనిపిస్తుంది. నీ ప్రత్యర్థి జట్టు - ‘సంఘం’ నువ్వు గోల్ కొట్టకుండా అది ఎదురు తంతూ ఉంటుంది. నువ్వు గానీ గోల్‌లోకి బంతి తన్నావా? నిన్నీ లోకం అప్పుడు గుర్తిస్తుంది. లేదా బంతికి తగిలిన కాళ్ల తన్నుల్లాంటి తాపులూ, తన్నులూ మిగుల్తాయి.

02/09/2019 - 18:31

భెజవాడలో యిలా దిగానా? - ఇంటికి పోతూ వుంటే అదే కోతుల కంపు. నేను మద్రాసు వెళ్లి యించుమించు ఏడాదయినా పెద్ద మార్పు లేదు. బెజవాడ పరిసరాలు, కొండపల్లి వగైరా అంతా దట్టమయిన అడవులు -వాటి నిండా కోతులు. వాటిని పట్టి తెచ్చి వెదురుబద్దల బోనుల్లో బంధిస్తారు. ఇందులో ‘రిసెస్’ జాతి ఎర్రపిర్ర కోతుల్ని నిపుణులు వచ్చి ఎంచుకుంటారు. అమెరికాలో జరిగే వైద్య పరిశోధనలకి, యివి ప్రయోగ జంతువులు.

02/02/2019 - 17:26

ఆనంధవాణి రెండు సంచికలు రెడీగా వున్నాయి. ‘నేను బెజవాడ పోతున్నాను’ అంటే కాళిదాసు సారేమీ అనుకోకపోవచ్చును. ‘పైగా ఇదేమీ ఉద్యోగం కాదుగా’ అన్నది నా మనసు, నాకు ధైర్యం పోస్తూ - ‘తప్పదుగా’ వెళ్లి చెప్పాను.

01/28/2019 - 22:47

ఒక్క తంబుచెట్టి వీధి మాత్రమే కాదు జార్జిటౌన్‌గా వాసికెక్కిన వ్యాపార కూడలి అంతటా ‘ ఫుట్‌పాత్ డ్వెల్లర్స్’ - కాలిబాట కాపురాలు మిక్కుటం. తంబుచెట్టి వీధిలో ప్రతీ దొంతర భవనం ముందు కాలిబాట మీద పసిపాపల దగ్గర నుంచీ పెళ్లీడు ఆడపిల్లల దాకా వీధి జీవితాల్లో ఆనందంగా నివసిస్తూ కనపడతారు.

01/19/2019 - 18:44

అరవైల్లో నేను మద్రాసులో అడుగుపెట్టాను. జార్జిటౌన్‌లో తంబుచెట్టి వీధిలో - నాన్నగారి బస ఆఫీసూ రెండూ వున్న ఆంధ్రా ఇన్‌స్యూరెన్స్ బిల్డింగ్‌లో, నెంబర్ 337 - దానికి కొంచెం ఐమూలగా, ఎదురుగా వున్న ఆంధ్రపత్రిక బిల్డింగు - ఆరు, ఏడు నెంబర్లు రెండూ కలిపిన భవనం - ఆనక నెంబరు పనె్నండు. ఆనందవాణి కాళిదాసుగారి కార్యాలయం, ప్రెస్సూ - ఆఫీసూ రెండూ అవే నాకు తెల్సు.

01/12/2019 - 18:37

మునగఛెట్టు పూల గుత్తుల ముసిముసి నవ్వులు నవ్వుతుంది అన్నది చూశాను - కాని దాని మీద కథ రాయడానికి ప్రేరణ మాత్రం వో చిన్ని సంఘటన - జరిగింది. అప్పటికే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ గారితో పరిచయం గాఢం కాసాగింది. పత్రికకి కథ పంపాలి అన్న కోరిక మొలకెత్తింది. మా పేట హిందువుల సందులో మునగచెట్టు జ్ఞాపకం వచ్చింది.

Pages