S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

07/28/2018 - 18:14

స్వతంత్ర, వాహిని, జమీన్ పత్రిక - నెల్లూరు పత్రిక కూడా మా దాడి తప్పించుకోలేక పోయాయి. మా వూరి ‘బొమ్మల బస్తీ’ని కూడా వొగ్గలేదు మేము. గృహలక్ష్మికి ఆంధ్ర మహిళ పోటీ. నాకూ రెంటితో భేటీ. మాతృసేవ అనే దానిలో నెలనెలా వ్యాసం మస్టూ.. కానీ ఇది కాదు నా మొదటి ‘కాలం’. చెబుతా తర్వాత.

07/21/2018 - 21:09

‘రేపు వస్తుంది అబ్బాయ్.. గ్యారంటీ.. అన్నాడు జాలిగా ఇంకా అక్కడే నిలబడ్డామని - చూసి.

07/21/2018 - 21:08

మా చిన్న అమ్మమ్మ - ప్రక్క బిల్డింగేగా పరిగెట్టాను.
ఆ మాస్టారి పిలక తీసేసి అతని చేతిలోనే దిబ్బరొట్టెతో కలిపి పెడతానంటూ ఆవిడ నన్ను వెనుక వేసుకురావడం-

07/08/2018 - 00:11

ఇంచిపేట మొత్తానికి ఇస్మాయిల్ కిరాణా కొట్టు పెద్దది. అదో సూపర్ మార్కెట్టు. కానీ దుకాణంలో ఎప్పుడూ సుభాన్ భాయి మాత్రం ఉంటాడు. జనం అంతా నాలాంటి పిల్లకాయలే.. కిటకిటలాడేది షాపు. అమ్మ కాని మామ్మ కానీ - నన్ను చిన్న సామాన్లు - ముఖ్యంగా కొబ్బరికాయ - చక్కెర, బెల్లం, సగ్గుబియ్యం గట్రా తెమ్మంటే - జటకా మీద టకాటకా గుర్రాన్ని లొట్టలు వేసి అనుకరిస్తూ తోలుకుంటూ వెళ్లిపోవడమే. నడవడం లేదు..

07/01/2018 - 02:36

విఢీ విడని చిక్కులు నన్ను ఆంధ్రపత్రికలో ఉద్యోగానికి అక్షరాల తీసుకుపోయి చేర్పించాయి - విడీ విడని చిక్కుల కోరల్లో చిక్కిన సమాజంలాగే నేను చిక్కుల్లో ఇరుక్కుపోయాను అనే అనాలి. ఆ నవల రాసిన నాకు అది కెరీర్ ప్రదాయిని అవడం అదో తమాషా. దీని కారణంగా, ఆంధ్ర పత్రిక కొలువులో చేరిపోయిన నాకు జర్నలిస్టుగా మారిపొమ్మని రాసిపెట్టి ఉన్నందున, అది అడుగడుగునా ఛాలెంజ్ చేస్తూ వుండడం చేతా, సారీ..

06/24/2018 - 00:54

నిజంగా, సత్యాలే (ఆమె ముద్దు పేరు) నాకు మొదట హిందీ అక్షరాలూ - తెలుగు (మొరటు) సామెతలూ నేర్పిన గురువు. మేము ప్రొద్దుట్టే దొండపర్తి నుంచి ప్రస్థానం ప్రారంభించి - ఓ గంటకి ఊళ్లోకి ఆశీల్మెట్ట మీదుగా చేరేవాళ్లం. ఆశీల్మెట్ట ఇవాళ వైజాగ్‌లో సెంటర్ ఊరికి కాని - అప్పుడు పర్ర - చెట్టూ చేమాలేని గుట్ట.

06/17/2018 - 00:14

‘ఉదయమ్మాయేను.. స్వేచ్ఛా భారత ఉదయమ్మా యనహో.. తూరుపు కొండల వారల తపములు ధీరత.. గాంచెను జయహో.. అన్న టంగుటూరి సూర్యకుమారి పాటకు బంగాళాఖాతం సహా ఘార్ణిల్లి - కెరటాల హస్తాలతో హర్షధ్వానాలు చేస్తూ వుండగా - అర్ధరాత్రి ఆంధ్ర దేశం సహా - సూర్యోదయాన్ని ‘్ఫ’లైనప్పుడు - ఆ మువ్వనె్నల ‘ఎగురుడు’ తొలి పండుగని నేను ఎరుగను - చిన్నవాడ్ని.

06/12/2018 - 22:12

‘కాల సాగర గర్భమునందు.. గవ్వలు మణులున్ లేవా?
ఏది నీకై సమకూడినదో.. అనుభావ్యమదే కాదా?...
-జననమ్, బాల్యం, శైశవం, వనం, కౌవారం, వృద్ధాప్యం అట్లాగే - స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పత్రికలూ, రచన, సంసారం, పిల్లలు - వాళ్ల కోరికలు, వాళ్ల పెళ్లిళ్లు అంటూ రొటీన్‌కొత్త శీర్షిక ప్రారంభం

06/12/2018 - 22:08

ఇవాళ ఏధి రాయాలన్న అనుమానాలు - స్పీడు బ్రేకర్లు - భయం భీతి కాని నాడు పాలపళ్లు వూడుతున్నప్పుడు, ఆ బాలుడికి - గసడ దవలే కాని కచటతపలు ఉంటాయని తెలియదు- అలాంటి బాల మనసుల కోసమే కాబోలు ‘బాల’ పత్రిక తెలుగు నేల బాలలకు రారండోయ్ రారండోయ్ అంటూ - అవతరించింది. మా ఇంట్లో వున్న పెద్ద బాలశిక్షకి తోడూ కాశీమజిలీ కథల వంటి పొత్తాల సరసన ఈ బాలన్నయ్య (న్యాపతి రాఘవరావు దంపతులు) బాలక్కయ్య కామేశ్వరరావు గారు దొరికారు నాకు.

06/12/2018 - 21:57

నేను 1965లో మద్రాసు నుంచి ఆంధ్ర పత్రిక దినపత్రికతోపాటు మావూరు బెజవాడ వచ్చేశాను కదా! బోగి శెలవు ఈ రోజుల్లో పత్రికకి -బోగినాడు హౌరా మెయిలులో బెజవాడ వస్తూన్నాను. గుండ్లకమ్మల దగ్గిర రాత్రి రెండు గంటల మెయిలు వేళ సగం పెట్టెలు బోల్తా కొట్టిన ప్రమాదానికి గురి అయ్యింది.

Pages