S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఢ్రిల్లు మాస్టారి నీతి పాఠం!

నిజంగా బురఖా లేసుకుని వచ్చే వాళ్లంతా ఆడోల్లేనా? మా ‘పాండు’గాడి డౌటు.. మొత్తానికి, ఆడపిల్లలు అంటే నాకు ఎంత సిగ్గో వాళ్లకి అంత బెటర్ చనువు... మిత్రా నెల మొదటి మీటింగులో నో లెక్చర్ అన్నాను. అసలు సంగతి సిగ్గు. ఒక్కోరికి ఒక్కో రోజు వంతున పత్రిక ఇవ్వాలి. ఒక్కటేగా కాపీ.. ఆనక కావాలంటే మళ్లీ రొటేట్ చెయ్యాలి. కొత్తగా, మద్రాసు పత్రికల్లో ‘స్పోర్ట్స్ అండ్ పాస్ టైమ్’ని చేర్చాలి. ‘హిందు’ పత్రిక వాళ్ల స్పోర్ట్స్ మాగ్ అది. పెద్దయ్యాక రంజీ క్రికెట్ ఆనక ఆంధ్ర టెన్నిస్ ఆడిన రాధారమణ - నా బెంచ్‌మేట్ వాళ్ల తమ్ముడు చందూ కూడా రంజీకి ఆడేడు. అతని కోరిక అది.
హెచ్‌ఎం నాయుడు గారు పిలిచారు మర్నాడు పొద్దునే్న-
* * *
ఏది శాశ్వతం? ఈ క్షణం మాత్రమే శాశ్వతమ్. అంతవరకు గ్యారంటీ.. ఈ క్షణం మీద నిలబడి అటు/ మైనస్ ఇన్ఫినిటీ (గతం) నుంచి ఇటు/ ప్లస్ ఇన్ఫినిటీ (భవిష్యత్తు) దాకా మన మనసుని ఊపగల శక్తి, యుక్తి, మనిషికి ప్రత్యేకం. రేడియోలు వీడియోలు, ఆనక మీడియా.. అలా ఎన్ని వచ్చినా కాగితం ముక్క మీద అక్షరం పడ్డదీ అంటే ఆ ముక్కలే పవర్‌ఫుల్ - ఒక చిన్న కరపత్రమే అవుగాక, సంఘంలో దానికి గుర్తింపు ఇంతో అంతో ఉంటుంది. మన ఇతిహాసాలు, మహాకావ్యాలు అనాదిగా కాగితం లేని రోజుల్లో, కేవలం ఆకు మీదనే ‘శాశ్వతంగా’ నిలిచేయి. ‘ఆకు’ (తాళపత్రాలు, భోజ పత్రాలు)లే చదువుకుని మానవుడు మహనీయుడు కాగలిగాడు.
‘వాడు వీడికన్నా రెండాకులు ఎక్కువే చదివాడు అంటారు పెద్దలు - ఇవాళ ఇ-కాపీ దాకా వచ్చేము కాని - ‘పెన్ డ్రైవ్’లున్నా, ‘సీడీ’లున్నా - అవి కొబ్బరికాయలో నీళ్లే. ఓ పెద్ద కంప్యూటర్ సిస్టం వుండాలి, వుంటే కాని - (పవర్ సప్లైతో సహా) అవి ఓపెన్ కాదు. కాని, గూన కంపు కొడుతున్నా పాత కాగితం - గత చిత్రాన్ని చూపెడుతుంది. వార్త యందు ‘జగము - జగడము’ - రెండు వర్థిల్లుతాయి. అందుకనే రచయితలు, పత్రికా రచయితలూ - కాలర్ ఎగరేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మనకి లాయర్లు వున్నారు. డాక్టర్లు ఉన్నారు. వీళ్లని మించిన నిజాయితీ వుండాలి జర్నలిస్టులకి అంటారు పెద్దలు. అఫ్‌కోర్స్, అది ఒక సూక్తి అనుకోండి. అంటే.. జర్నలిస్టులు దిగి వచ్చారని - నా ఉద్దేశం కాదు - సంఘంలో పది మంది యోగక్షేమానికి సంబంధించిన వ్యవహారం కనుక పత్రికల వాళ్లు దిగజారకూడదనే ఉద్దేశం తప్ప.. అది అట్లు వుండనిండు...
మా స్కూలులో, ప్యూను కోటయ్య గంట కొడితేనే క్లాసులు నడుస్తాయి. మళ్లీ కోటయ్య గంట కొడితేనే మేమంతా పండ్లగంప వొలకపోస్తే - పండ్లు దొర్లినట్టు బయటకు దుముకుతాం. కోటయ్య తలపాగాలో బీడీ ముక్క వుండేది దాన్ని ‘పింఛం’ అనేవాళ్లం. కాని ఆ రోజు - కోటయ్యకి బదులు స్వీపర్ గంట కొట్టాడు. అయ్యో.. కోటయ్య ఏడీ? చనిపోయాడన్న వార్త తెలిసింది. 1951 నాటి సంగతి ఇది. మేము స్కూల్‌కి లాంగ్‌బెల్ కొట్టి సెలవు ఇస్తారనుకున్నాము. లేదు. ఇవ్వలేదు. మిత్ర సంఘం మీటింగులో - హెడ్‌మాస్టార్ని స్కూలు యాజమాన్యాన్ని ఖండించాము. మా పత్రికలో చిన్న ‘బాక్స్ ఐటెం’ రాశాము. యాజమాన్యం అన్న మాటకి అర్థం తెలియదు కాని పేపర్లో తరచూ చదివే మాట ఇది. మా మీటింగు ప్రభావం ఫీల్ అయినట్లున్నాడు హెచ్.ఎం. సారూ పిలిచాడు.
- మీటింగులు పెడుతున్నావ్? ప్యూను చనిపోతే స్కూలుకి సెలవు ఇవ్వమన్నావ్‌ట. నువ్వు డీఈవోవా?
-సార్! అది నా ఒక్కడి ఐడియా కాదు సార్!
-రాసింది నువ్వేగా.. కుడి చెయ్యి జాపు...
-ఎడమ చెయ్యి చూపేను. ‘హోంవర్క్ చెయ్యాలిగా సార్’ అన్నాను.
- ‘ఫట్’మని పేము బెత్తం దెబ్బ...
కనుల నిండా నీళ్లు నిండాయి.. కృష్ణమూర్తిని.. ఈ ఫస్ట్ మార్కుల కృష్ణమూర్తిని - ఇట్లా కొట్టడం ఘోరం అనుకున్నాను.. నాయుడు గారి కన్ను నా బుష్ కోటు జేబులోని పార్కర్ పెన్ను మీద పడ్డది. చటుక్కున లాక్కున్నాడు.. అది మా నాన్నగారు నాకు గిఫ్టుగా ఇచ్చారు.. కథో, గేయమో అది పత్రికలో దేనిలోనయినా పడితే - నాన్నగారు మురిసిపోయేవారు. చెయ్యి పొమ్మన్నట్టు ఊపారు నాయుడుగారు.
హెచ్‌ఎం రూమ్ ముందు మా గ్యాంగు గుంపుగా వుండి నా కోసం చూస్తున్నారు.
లాస్ట్ పిరియడ్ అది.. చెలరేగి తిడుతున్నారు మురళి, ప్రసాద్, అప్పారావు, పుచ్చా అందరూ.. అంతలో డ్రిల్ మాస్టారొచ్చాడు. ‘సైలెన్స్.. స్టాప్ నాయిస్.. స్టాండ్ అట్ ఈజ్’ అన్నాడు.
‘మిత్ర’ బుక్కు పట్టుకుని - నారాయణ గాడు తప్పుకున్నాడెప్పుడో - అది లాక్కుంటారని భయం.
‘ఇది గేమ్స్ పిరియడ్ కాదు సార్’
‘అయినా.. పదండి గ్రౌండ్‌లోకి’
అందరం పరుగుతీసి గ్రౌండ్‌లో లైను కట్టేము. డ్రిల్లు మాస్టారు - అందంగా సన్నగా నొక్కుల జుట్టుతో వున్నాడు. కొత్తగా వచ్చాడు. ఓ ‘నీతి’ లెక్చర్ ఇచ్చాడు.. మధ్యలో ఇంగ్లీషు మాట్లాడాడు.
‘ఇందవయ్యా నీ పెన్ను’సార్ ఇచ్చేశాడు’-అని నా పెన్ను అందించాడు. షాక్‌కి తేరుకొని అందరం కేరింతలు కొట్టాం.
- కాకపోతే, ఈసారి అస్మంటి మీటింగుల్ని పెట్టాలి అంటే సార్ని అడగాలి.. పెద్ద మాస్టారే ‘ప్రిసైడ్’ చెయ్యాలి.. అర్థం అయ్యిందా?
*
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com