స్మృతి లయలు

టైఫాయిడ్‌తో ‘విశాఖ ట్రిప్పు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెఢ్డింగ్ ‘స్టిక్కు’లో కూర్చి పెట్టుకుని వచ్చి రెండు అక్షరాలు మించింది.. పీకి పడేస్తున్నా.. లెక్కపెట్టి హెడ్డింగు పెట్టుమీ అనేవాడు - గొప్ప ఇది చేసేవాళ్లం మేమంతా అతన్ని. అయ్యవారు మాత్రం ‘పోరా.. నాకు చూపెట్టకు.. పోరా.. అవతలికి విసిగించకు..’ అనేవాడు. ఆయన మాటల్లో ఎంత అనురాగమో? వాత్సల్యమో? అయ్యవారు అంటే శంభుప్రసాద్‌గారు.
నేను వీక్లీలోకి పోయాకా.. ఏదో రాసిరాసి - కలం నొక్కి పడేశాక - అది కంపోజ్ అయినాక.. ప్రూఫ్‌రీడరు ఒక పెద్దాయన ఉండేవారు - జియోగ్రఫీలో ఆనర్సుట. కాపీ తెచ్చి ‘ఈ మాట ఏమిటో సారూ’ అనేవాడు. చూసేవాణ్ణి. ‘నాకూ అదే డౌట్ - కాని నారాయణస్వామిని (వర్కర్) పిలిచి ‘ఇదేందో సూడుమీ’ అనేవాణ్ణి. ఎందుకు చెబుతున్నానంటే - నాటి వర్కర్ - జర్నలిస్టు అనుబంధం అది. ఇవాళ, నేరుగా సిస్టం మీద కూర్చుని వీర బాదుడు బాదే ఈ కాలం కుర్రాళ్లకి - వాళ్ల పూర్వీకులం అయిన మా కష్టం శ్రమా తెలియవు. అద్సరే.. నేను ఈ విషయంలో రాతియుగంవాణ్ణి - అంటే? తరువాత వస్తుంది ఈ కథ.. కొంచెం ఆగుడు.
సరే సత్తార్భాయ్ అన్నాడు.
బడేహోకర్ ఏక్ రెడీమేడ్ షాప్ రఖో.. ముఝేభీ కామ్‌దేనా, చోటే సర్‌కార్-
దేతూన్ జరూర్ దేతూన్ లేకిన్ అబ్ తో జాతూన్ - అని లేచి మా పెద్దత్త దగ్గరికి పారిపోయేవాణ్ణి. అదో పెద్ద నాలుగు గదుల ఇల్లు. గజాల తలుపులు కిటికీలు గట్రా వుండి వెనక వరండా ఉండేది. డాబా చాలా విశాలం. పెద్ద మెట్లు - మెట్ల మలుపులో నుంచి చూస్తే పైకి ఎక్కుతూ ఉంటే - గామా పహిల్వాన్ ఇంట్లో నుంచి మా డాబా మీదకి తొంగిచూసే మునగకాయల బ్రహ్మాండమయిన చెట్టు.. భలే కాని మా ఖాసిం పహిల్వాన్ భాయ్‌కి గామా వస్తాద్‌కి చుక్కెదురు...
సాయిబుల ఇళ్లల్లో మునగచెట్టు, గోరింటాకు చెట్టూ మస్టూ.
కాని, ఆ ఇంట్లో ఓ గది చిమ్మచీకటిగా ఉండేది. ఆ గదిలో గ్రామఫోను పెద్దది పెట్టేడు పె.మా. పాపం మా అత్తకి అనుమానం ఆ గదిలో దెయ్యాలున్నాయని. అసలు ఆ మాటకొస్తే ‘ఇంచ్‌పేట’లో మీకు గుమ్మగుమ్మానికి రక్షరేకులు ఎడాపెడా కొట్టని ‘ఇండ్లు’ అస్సలు వుండవు.
ఆఫ్రికన్ షాప్ అని బోడెమ్మ హోటల్ సెంటర్‌లో - పోలీసుస్టేషన్‌కి, మా స్కూలుకి దగ్గరగా ఓ పెద్ద షాపు ఉండేది - అప్పుడు తెలియదు కాని పెద్దయ్యాక ‘జిఎంహెచ్ స్టూడెంట్’ అయ్యేక దాని గొప్ప తెల్సింది. అదో డిపార్ట్‌మెంటల్ స్టోరు - అదో సూపర్ మాల్ టైపు. విదేశీ సరుకులు కూడా దొరికేవి. లోపల ఒక మ్యూజియం లాగ బోలెడు గదులు.
అక్కడ మా ‘మామాసురుడు’ అత్తర్లు సెంట్లు - జవ్వాజి వగైరా.. అలాగే గ్రామఫోను రికార్డులు కొనేవాడు. మా పెద్దమామయ్యకి అలాగే విశాఖపట్నం సుబ్బారావు మామకి హిందీ సినిమా పాటల పిచ్చి - పిచ్చి అంతాఇంతా కాదు. మొదటి రికార్డు వీళ్లే కొనాలి. వీళ్ల యావచూస్తేనే అర్థం అయిపోతుంది అనేవాళ్లు మా చిన్నాన్నలు దుఃఖంతో. గట్టిగా కాదు - చిన్నగా తిట్టేవాళ్లు లెండి మా బాబాయిలు. మా అమ్మ దీనికి డబ్బు సర్ది హెల్ప్ చేసేది కూడా. మా సుబ్బారావు మామయ్య - ఆరడుగుల పొడుగు - ఆవుల్ని కుక్కలని పెంచేవాడు. సీమ కుందేళ్లను పెంచేవాడు. పోర్ట్‌లో అంటే హార్బర్ వైజాగ్‌లో పనిచేసేవాడు. ఇండిపెండెన్స్ డే నుంచి కాఫీ - నీరుల్లిపాయ వదిలేశాడట. గొప్పగా చెప్పేది మా అమ్మ ఎప్పుడూ. హిందీ పాలన్నీ అప్పజెబుతాడు కాని పాడేడో.. మనం ఫినిష్! చిత్రం బావమరుదుల మధ్య ‘వైర ప్రేమ’కి ఓ నిదర్శనం ఓ చిన్న ఇన్సిడెంటు. అరచేతిలో - బొటనవ్రేలితో మూడు వ్రేళ్లు మడచిపెట్టుకుని తర్జనని దాని ప్రక్క వేలుని కలిపి తుపాకీలాగ పెట్టి - నువ్వు ఇలాగే పెట్టు అనేవాడు మరిదిని (మామయ్య). నువ్వూ ఇలాగే పెట్టు కన్నా! (మా బుచ్చినాన్న) పెట్టేవా? చూడు సుబ్బా అని మా బుచ్చి నాన్న చూపెట్టేవాడు. ‘చిడత పెట్టి ముందుకు జాపు’ అనేవాడు. ఆనక, తను గాలిలోకి సర్రున చెయ్యెత్తి లాగి - ఆ రెండు వేళ్లతో మా చిన్నాన్న రెండు వేళ్లని ‘టాప్’మని కొడితే - ఫినిష్ - గిర్రున కన్నీళ్లు తిరిగేవి పాపం. నువ్వు కొట్టు.. కన్నా! నువ్వు రెండు ఛాన్సులు తీసుకో’ అనేవాడు. పె.మా. ఇంకెక్కడా కన్నా.. వదినా అంటూ.. ఇంటికి పోయి మా అమ్మ మీద విరుచుకుపడేవారు.. మా అంకుల్స్.
‘వదినా విను. ఆ సూరిబాబు వస్తే వాడికి కాఫీ ఇవ్వొద్దు.. అట్లకాడ కాల్చి వాత పెట్టు.. లేదా నేను రేపు అన్నం తినను వదినా నీ ఇష్టం’
‘ఇవాళ మట్టుక్కి తినేస్తాడన్నమాట..? అన్నది మా సత్యం అత్త నవ్వుతూ. ఆమె అతనికన్నా జస్ట్ పెద్దది.
ఛాన్స్ దొరికితే చాలు మా సత్యం అత్త వచ్చి.. ఇక్కడ మా అమ్మ దగ్గర వాలేది. ‘వదినా! ఆ సూరిబాబు పెద్దవాడయితే అయ్యాడు కాని - ఆనక దణ్ణం పెడతాగాని - ఇప్పుడు మాత్రం తిట్టేస్తాను’ అనేది. మా -‘మా బాబు’ని (అంటే మా నాన్నగార్ని) ఎత్తుకుని గిరగిరా తిప్పి ఇలా పడేశాడో మారు క్రింద. (హాస్యానికే లెండి) ఉత్త వస్తాదు బాపతు... కింగ్‌కాంగ్‌ని అనుకుంటాడు. ఈ తిట్టు శ్రీకాకుళం తిట్టు.. మా మామ్మగారి పుట్టింటారు ‘చిక్కోళ్ - కాస్సాల (కాశీ సోమయాజుల) వారు. అమ్మ వంటలో బిజీ.. నాన్నగారేమో? ఆఫీసుకి పోయి డబ్బులు తెచ్చే ఓ యంత్రం. ఇలా అయినవాళ్లంతా మామ్మని, అమ్మనీ సతాయించే సరుకే...
మా గురించి హూ కేర్స్/ నేను ఐదోక్లాసు లేదు వాడు మూడో క్లాసు లేదు. ఛాన్సు దొరికితే - అమ్మ వైజాగ్ వాళ్ల ఇంకో చిన్నన్నయ్య దగ్గరికి. మాకు టిక్కెట్టు అక్కరలేదుగా.. మాకు చేయి తిప్పి చెవి చుట్టూ వేయించి.. అందలేదు టిక్కెట్ అక్కరలేదు అని వదిలేసేవాళ్లు.
మిలిటరీ కాంట్రాక్టులు చేసేవాడు మా సుందరం మామయ్యా - వాళ్ల ఇంట్లో పెద్ద కుక్కలు రెండు ఉండేవి. ఓ గుర్రం బండీ - అది ఆ రోజుల్లో స్టేటస్ సింబల్ అన్నమాట. ఓ కారు - పాత మోడల్ ఫోర్డు. (ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com