స్మృతి లయలు
చివరికి ఓ ‘మూలగది’ దొరికింది!-97
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఫత్రిక రాకతోనే పాత బెజవాడ కొత్త విజయవాడ అయిపోవాలీ అంటే ఎట్లాగయ్యా? వీరాజీ!’’ అనేవాడు ప్రకాశరావుగారు. ఈపాటికే జైహింద్ టాకీస్ పక్కనున్న విశాలాంధ్ర - చుట్టుగుంట చంద్రం బిల్డింగ్‌లోకి వెళ్లిపోయి దాని జాగాలో ముక్కలైన కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులైన వాళ్లు ఎవరు అటు విశాలాంధ్రగా ఇటు ప్రజాశక్తిగా పోయారో తెలుసుకునే టైమ్ కూడా లేదు.
రాత్రి డ్యూటీలు తరుముకొస్తున్నాయ్. ‘‘సినిమాలే చూస్తావో? ఇటు ఫీచర్లే రాస్తావో? ఏం చేస్తావో నాకు మాత్రం హాల్లో మనుషులు లేరు కనుక నువ్వు ఫుల్‌గా వార్తలు రాయడం మాత్రం చెయ్యాలి’’ అనేవాడు షైలాక్లాగా మా ప్రకాశరావుగారు. ఆయన బెజవాడ నుంచి మా చిన్నప్పుడు వచ్చిన ‘జన్మభూమి’ దినపత్రికలో పనిచేస్తూనే పత్రికలోకి వచ్చాడుట...
ఏలూరు కాల్వకి అటు ప్రభా, ఇండియన్ ఎక్స్ప్రెస్సూ, ఇటు ఆంధ్రపత్రిక ఉన్నప్పటికీ కాలువ గట్లు బహిరంగ బహిర్భూమిగా ఉండటాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఊరికి మధ్యలో రైల్వే స్టేషన్ ఒక్కటే ప్రధాన ఆకర్షణ. గానీ, అదే ఊరిని తూర్పు, పడమరలుగా చీల్చివేసింది. మళ్లీ అవే రైలు పట్టాలు ‘టూ’ టౌన్‌ని దక్షిణాన ‘త్రీ టౌన్’గా చీల్చేశాయి.
అప్పుడు ఇన్ని రైలు బళ్లు లేవుగానీ ఉన్నవే చాలు. సత్యనారాయణపురం, సీతన్నపేటలకు పోయే శకటాలకి ఓ కునుకు తీసి లేవమని లెవెల్ క్రాసింగ్ గేట్ (రైల్వే) రూపంలో అడ్డం పడిపోయేవి. లేకపోతే భూగర్భస్థ మురుగు కాల్వల్లాంటి మాటలు కూడా ఇంకా పుట్టలేదు కనుక ఊరంతా ‘పందుల బెడద’ ఉండేది. ‘మడత మంచములు అద్దెకు ఇవ్వబడును’ లాంటి బోర్డులు, సినిమా వాల్‌పోస్టర్లు ఇవే ఆకర్షణలు అప్పట్లో.
సూర్యారావుపేట - ఎస్.సత్యనారాయణ ఆసుపత్రి రోడ్డుగా జనాల నోట నలిగే వేంకటరత్నం రోడ్డు నుంచి నేను రిక్షాలో ఆఫీసుకి వచ్చేవాణ్ని. ఆ వీధికి మొదట్లోనే జంధ్యాలశంకర్గారి ఇల్లు ఉండేది. ఆయనకి కూడా బెజవాడనేదో స్వర్గతుల్యంగా చేసెయ్యాలనే తపన ఉండేది. ఆనక మేయర్ అయ్యాడు కూడాను. ‘‘దృశ్యాలు’’ చూసుకుంటూ, ఆవేదన మోసుకుంటూ ఆఫీసు చేరుకునేవాణ్ని. మాకు రాజగోపాలరావు సిటీ రిపోర్టర్‌గా ఉండేవాడు. అతణ్ని ‘డెస్క్’ దగ్గరికి లాక్కోవడంతో లోకల్ రిపోర్టర్ కావాల్సి వచ్చింది. గుంటూరు శాస్ర్తీగారిని బెజవాడలో రిపోర్టర్‌గా వేశాడు. ఆయన్ని మేమంతా ‘జెటోపెక్ శాస్ర్తీ’గారంటూ పొగిడేవాళ్లం. ఎంత దూరమైనా, అమిత వేగంగా లెఫ్ట్‌రైట్ కొట్టేసి రిపోర్ట్ తీసుకుని సైకిళ్లున్న మిగతా విలేకరుల కన్నా ముందు ఆఫీసులో వచ్చి వాలిపోయేవాడు. రిటైర్మెంట్ వయసు అయినా, ఎక్స్టెన్షన్ ఇద్దామన్నారు అయ్యవారు ఆయనకి.
నిజానికి వైజాగ్, రాజమండ్రి, తిరుపతి అన్నిటికీ మించి బందర్ అన్నిచోట్లా ‘పాతకాపు’లు పత్రిక ప్రతిష్టకి పాకులాడే పెద్దలే విలేకరులు. అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ మేనేజర్ ఇట్లా అన్ని అన్ని అసిస్టెంట్ పోస్టులే ఉన్న బెజవాడ ఎడిషన్ కీలకం అయింది. ‘‘మద్రాసు ఎడిషన్‌కి ఇది హంసగీతమే!’’ (స్వాన్‌సాంగ్) అనుకునేవాళ్లం. ‘‘హైదరాబాద్‌కి మారాల్సిందే’’
ఏలూరు విలేకరి చంద్రశేఖర్‌గారికి వర్కింగ్ జర్నలిస్టులలో పెద్దపీట. ఆయనకి ఏలూర్ టైమ్స్ అనే పత్రిక ఉండేది. ఐతే, ఈ వృద్ధ సింహాలందరూ పత్రిక అంటే ప్రాణం పెట్టేవారు. ఓ రకంగా వీళ్ల ‘దృక్పథం’ నాకు ఆదర్శప్రాయం అయింది.
‘అయ్యవారు’ వచ్చారు. పేపరు ఎలా ఉందో? చూడటానికి. ఆయన వస్తున్నారంటే దుర్గావిలాస్ మేడ మీద అతని ‘బస’ గదులకు తలంటు పోసేవాళ్లు. వంటవాడు, అటెండర్ కూడా ‘‘పైలట్’లుగా, ముందు వచ్చేవాళ్లు. అయ్యవారు మద్రాసులో కూడా ‘సబ్బుల’ (సబ్ ఎడిటర్స్) బల్లల మీద ఏష్ట్రేలు పెట్టించేవారు. విజయవాడతో, ఒకసారి హాలులోకి వచ్చారు. వి.వి.యన్. (గొట్టిపాటి బ్రహ్మయ్యగారి అల్లుడుగా వాసికెక్కిన వాడు) హాలు మొదట్లో చిన్నబల్ల, దానికి కొంచెం మూలగా మరో చిన్న బల్ల (మొన్నటిదాకా వీక్లీ ఇన్చార్జిగా, ఆంధ్రాలో వంటింటా, నట్టింటా పేరు పడ్డవాణ్ని అని పెద్దలు మేలమాడేవారు) నేనూ కూర్చునే వాళ్లం. నిజానికి వి.వి.ఎన్. గారు సూర్యారావుపేటలో మా ఇంటి పక్క ఇంట్లోనే, ఓ చిన్న వాటాలో ఉండేవారు. అది వారి ‘చిన్న ఇల్లు’ అన్నమాట.
అయ్యవారు ఇలా తల ఎగరేసి చూశారు.. వెళ్లారు.. మరో అరగంటలో నరసింహారావుకి భోషాణం అంత పెద్ద బల్లా, కుర్చీ వచ్చాయి. ‘‘అయ్యో! ఎరక్కపోయి వచ్చానూ.. ఇరుక్కుపోయానూ’’ అన్నాను నేను. ‘‘మీ సంగతి రాధాకృష్ణగారు చూసుకోవాలి మరి.’’ అన్నాడు వి.వి.యన్. అతనికి ప్రకాశరావుతో పాటు సమంగా అసిస్టెంట్ ఎడిటర్ పోస్టు కూడా ఖాయం అయింది.
ప్రకాశరావుగారికింకేమీ అక్కరలేదు. ఆఫీసూ - ఇల్లూ అంటే శ్రీనగర్ అని రైల్వేకార్టర్స్ (సత్యనారాయణపురం) పక్క కొత్తగా ఏర్పడ్డ పేటలో ఆయన స్వగృహ నిర్మాణం మొదలుపెట్టాడు. ‘‘ఆఫీస్ అవర్స్‌లో కాకుండా మిగతా టైమ్‌లో నువ్వు సినిమాలకీ, రిపోర్టింగ్కీ, నీ రచయితల మీటింగ్లకీ, నీ ఇష్టం ఎంత సేవ చేసినా, ‘‘నీ’’ ఆంధ్ర పత్రిక వద్ద నడు’’ అనేవాడు, గడుసుగా. శలవుపెడతానన్నా, ‘రేపులేట్గా వస్తాను’ అన్నా. ‘‘హాల్లో మనుషులు లేరు’’ (అంటే స్ట్ఫా అన్నమాట) అనే వాడు. నాకు ఒళ్లుమండిపోయి ‘‘వుంటే హాల్లోనే మనుషులున్నారు’’ అనేసి, విసురుగా వెళ్లిపోయేవాణ్ని.
అంతలో అయ్యవారు పైకి రమ్మన్నారని చెప్పడానికి ఆయనతో పాటు మద్రాసు నుంచి వచ్చే అటెండర్ బాలకృష్ణ వచ్చాడు. మద్రాసు స్ట్ఫా అందరికీ నేను ‘లాడ్లా’ కదా!
ఏమో? అనుకొన్నాను. ఆశగా వేరే రూమ్ దొరికిపోతుందా? నాకూ... ‘‘నువ్వు కూడా అసిస్టెంట్ ఎడిటర్ లైన్లోనే ఉన్నావుగా అని చెబుతారా?’’ అనుకుంటూ ఆశగా వెళ్లాను. ఆయన అటూఇటూ పచార్లు చేస్తూనే మాట్లాడుతారు.
‘‘్భరతికి మంచి బుక్ రివ్యూలు చేసేవాళ్లు కావాలి’’ అన్నారు. దాని మీద, నాకు తోచింది చెప్పాను. అప్పటికే ఆర్.యస్.సుదర్శనంగారు ఆయన దృష్టిలో ‘టాప్’లో ఉన్నాడు. అలాగే, లయోలా కాలేజీ నాగుళ్ల గురుప్రసాదరావు అగ్రశ్రేణి సమీక్షకులు. ‘్ధర్మపథం’ వీక్లీలో రాసే పెద్దలు బులుసు వేంకటరమణయ్యగారు మంచి సమీక్షకులే గానీ సత్వరంగా ఆయన దగ్గర్నుంచి తొందరగా రివ్యూలు రావు. కడియాల రామమోహనరావు, కె.మోహన్‌రావు అని మరొక గుంటూరు లెక్చరర్లు కూడా ఉన్నారు. గుంటూరులో కడియాల రామ్మోహనరావుకి ‘రావు’ బదులు ‘రాయ్’ చేశారు అయ్యవారే. ఇద్దరి మధ్యా వ్యత్యాసం కోసం. కడియాల రామ్మోహన్ యూనివర్సిటీలో నాకు డబుల్ జూనియర్ అనుకుంటాను. మహీధర రామ్మోహనరావుగారి ‘సందేశం’ (విశాలాంధ్ర) పత్రిక ఆఫీసుకొచ్చినప్పుడు అక్కడే నాకు నేరుగా పరిచయమై తన్మయంగా, అనురాగంతో నా తొలిమలుపు నవల తనకి ఎంతగా నచ్చిందో చెప్పిన యువకుడు. అప్పటికి నేను ఆంధ్రపత్రికలో చేరుతానన్న ‘వాసన’ కూడా లేదు. ‘‘ఆధునిక కవిత్వం, నవలలు అంటే ఇక ‘‘రామ్మోహన్ని ఆపలేమోయ్!’’ అంటూ మహీధరవారు చేసిన ఆ పరిచయం అరవై ఏండ్లయినా అలాగే కొనసాగుతోంది. నా బుక్స్ మీద ‘‘టాప్’’ రివ్యూలు ‘‘రాయ్’’లే.
ఆ విధంగా డా. కొలకలూరి (ఇనాక్) జి. భాను (లాబెన్ అసలు పేరు మంచి రచయితలు భారతికి రచనలు చేసేవారు. ఆ ఇద్దరూ ‘‘క్యాంపస్’’లో తెలుగు ఆనర్స్‌లో వాళ్లు, ఫిజిక్స్ ఆనర్స్‌లో నేనూ ఉన్నప్పుడే ఫ్రెండ్స్‌మి. డా. కొలకలూరి ఇంకా క్లోజ్. ఆ విధంగా ఆ రోజు అయ్యవారికి నా మీద ఉన్న వాత్సల్యం ద్యోతకమైంది. కానీ నా ‘‘జీత నాతా’’లు మాత్రం రాధాకృష్ణగారి పర్యవేక్షణలో ఉండడం చేత గొప్ప ఇరకాటం అయిపోయింది. నోరు ఇప్పలేకపోయాను.
ఏమాటకా మాటే చెప్పుకోవాలి. వి.వి.యన్గారిది ‘వైర ప్రేమ’ నామీద. నా టాలెంట్ విషయంలో పేచీ లేదు ఆయనకు. ఇష్టమే గానీ, ఆయన మాటల్లోనే చెప్పాలీ అంటే నా ‘ముట్టెపొగరు’ (ఇది కృష్ణాజిల్లా ‘టచ్’) అంటే ఇష్టం లేదుట. హాల్లో ఎదురుగుండా కూర్చొని ఆయనవైపు చూసినప్పుడల్లా నేను సర్కాస్టిక్‌గా, అదో రకంగా ‘నవ్వడం’ తనకిష్టం లేదని చెప్పాడు చాలాసార్లు.
‘‘ఈ సినిమా బుల్లోణ్ని కూడా ప్రకాశరావు రూమ్‌లో పడెయ్యాలి. అందరి మధ్యా సర్దుకోవడం చాతకావటం లేదు’’ అన్నాడు. ఒకటి, రెండుసార్లు. నేను అనేవాణ్ని నవ్వుతూ ‘‘టూ బర్డ్స్ ఎట్ ఒన్ షాటా? వద్దులే బాబూ! వి.వి.ఎన్గారి ‘సెగ’ బెటర్, ఆ ‘పొగ’ కన్నా’’ అని.
కాకపోతే నా వ్యంగ్యమైన ‘ఐరానికల్ స్మైల్’ గొప్ప శత్రువైంది నాకు. సామెత చెబుతారే అలా ‘లక్ష్మణ దేవర నవ్వు’ అని స్ర్తిల పాట ఒకటుండేది. రాధాకృష్ణగారనేవాడు. ‘‘అదుగో, అట్లా సైలెంట్‌గా నవ్వొద్దు’’ అని . ‘‘అసలు నోరే విప్పలేదు కదా, సార్!’’ అన్నాను.
‘అదే, నోరిప్పుతే ఫర్వాలేదు గానీ సైలెంట్‌గానే యూ కెన్ షూటెట్,’ అనే వాడు, మంచి మూడ్‌లో ఉన్నప్పుడు. మా టెలిప్రింటర్ ఆపరేటర్ శాస్ర్తీ (ప్రకాశశాస్ర్తీ - ఆనక ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్‌గా కూడా అయినాడని విన్నాను). అతన్ని ప్రయివేటుగా డిగ్రీ కూడా చెయ్యమనేవాణ్ని. ‘‘నువ్వే ట్రాన్స్లిటరేటరేషన్/అసెంబ్లీ రిపోర్టులు కూడా రాస్తూ ఉండు.. పి.టి.ఐ., ఆఫీసు టి.పి.ల మీదా ఓ కనే్నసి ఇంపార్టెంట్ పట్టుకుని లాక్కురా’’ అంటూ ఎంతో చనువు ఇచ్చి చూసేవాణ్ని.
టెలిప్రింటర్స్ గది అన్నది చిన్న ఆఫీసు రూము. అక్కడ శాస్ర్తీ, రామకృష్ణ అని మరో సిన్సియర్ కుర్రాడు ‘‘బాసు’’లు. ఆ రూమ్‌లో నుంచి అటు ప్రకాశరావుగారి గదిలోకి ఇటు హాలులోకి ద్వారాలు ఉన్నాయి. కానీ దాని పక్కనే ఒక చిన్న యాంటీ రూమ్‌లో పేపర్ ఫైల్స్ వగైరా పడేసి ఉండేవి. సరే, నాకు ఫోన్లు రావడం, పిలవలేక అల్లాడిపోవడం చేయలేక, శాస్ర్తీ సతమతమయ్యేవాడు.
ఈలోగా మద్రాసు కార్యాలయం నుంచి అయ్యవారి సంకల్పమే అయ్యుంటుంది. ఆదివారం పని సినిమా, అలాగే ‘ఎడిట్ పేజీ’ అంటారు. దాని పనీ వగైరాలు నాకు బట్వాడా అయిపోవడం. చాలా యథాలాపంగా జరిగిపోయింది. వి.వి.యన్, ప్రకాశరావుని ప్రేరేపించాడు. ‘‘వీరాజీని, ఆ మూల గదిలో కుర్చీ వేసి ‘పంపేద్దాం’’ అని.
శాస్ర్తీ ‘‘ఆ గదిని, ఇప్పుడే ఖాళీ చేసేస్తాను. టెలిఫోన్లకి పిలిచే బాధ తప్పుతుంది నాకు. అక్కడ ఇలా అందిస్తే ఆయన బల్లకి అందుతుంది ఫోను’’ అన్నాడు.
అట్లా ఓ చిన్నగది, బల్ల, కుర్చీ, ఎదురుగా విజిటర్స్ వస్తే కూర్చోడానికి ఒక స్టూలూ, కుర్చీ పట్టదు మరి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రమోషన్ కాగితం మాత్రం రాలేదు గానీ ‘రూమ్’ దొరికింది. నేను ‘‘వొంటెత్తుని’’ అన్నాడు ప్రకాశరావుగారు. ‘‘పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కారు’’. అనండి అనండి మాటలు... ఎడిటర్‌గారూ! ‘‘అన్నాను’’, ‘‘మాట అనకు బాబూ! గోడలకి చెవులుంటాయి. ప్రకాశరావు ‘ఎడిటర్’ అనిపించుకుంటున్నాడు అంటారు అందరూ!’’ అన్నాడు కరణంగారు. ప్రకాశరావుగారికి మా రాంప్రసాద్ ఇచ్చిన నిక్ నేమ్ అది. (కరణంగారు అన్నది).
అట్లా, ‘‘ఓ రూమ్ వాణ్నయ్యాను!’’ బెజవాడ ఆఫీసులో.
(ఇంకా బోలెడుంది)