స్మృతి లయలు

మా స్కూల్లో క్రికెట్ లేధు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లాది రూపాయలు ఖరీదు చేసే సరుకులు వస్తువులు వున్న గూడ్స్ గోడౌన్లు మొత్తం లూటీ అయిపోయాయి. సబ్బులు, పౌడర్లు, పప్పులు, రకరకాల సామాన్లు మొత్తం అన్నీ దోచేస్తున్నారు.. తగలబెట్టేస్తున్నారు.. నేనూ నా బ్యాచ్ - పోలీసు ఫైరింగ్ మొదలయిందన్న వార్తలకి - చలించిపోయి భయం వెంటాడగా ఇళ్లకేసి పరుగులు తీశాం. పదోక్లాసు పిల్లలం ఏమి చెయ్యగలం? మూకలతో కలిసి దోపిడీ చెయ్యకుండా ఆగగలమేమో కాని - దోపిడీని ఆపగలమా? దోచిన సొమ్ములు ఇళ్ల దగ్గరికి తీసుకుపోయి అణాకి బేడకి - మొదలు వందల రూపాయల దాకా నగదు వసూలు చేస్తూ అమ్మేశారు ‘దుండగీండ్రు.’
నెంబర్ 126 రాయపేట హైరోడ్‌లో వున్న - మహర్షి బులుసు సాంబమూర్తి గారి నివాసం - వేలాదిమందితో - శోకసముద్రమే అయ్యింది. అక్కడే గాంధీజీ అనుంగు శిష్యుడు - సత్యాగ్రహ మహావీరుడు -శ్రీరాములు గారు వీర స్వర్గమలంకరించి - తెలుగు వాడికి ఆత్మగౌరవ భిక్ష ప్రసాదించాడు. ఆయన నిరాహారదీక్ష బూని - అసువులు బాసి మనకొక అస్తిత్వాన్ని ప్రసాదించాడు. చెన్నై వెళ్తే ఈ పట్టు ఆ మందిరం చూడాలి.
మేము మా స్కూలు ఎదురుగుండా ఉన్న గాంధీ పార్కులోనే - ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారి మీటింగ్‌లకి హాజరయ్యేవాళ్లం. పెద్ద గ్లామర్ నాకు. అచ్చం సింహంలాగే ఉండేవాడు కానీ మద్రాస్ హార్బర్ నియోజకవర్గంలో ఓటర్ల చేత తిరస్కరింపబడటం దురదృష్టం. ఒక దేవాలయంలో వున్న దేవుణ్ణి కొలవడానికి పోయినట్లు - పోయి కూర్చుని వినేవాళ్లం ‘సారు’ని. కాని అల్లర్లనాడు.. ఆ గాంధీ పార్కుని ధ్వంసం చేసేద్దాం అనుకున్నాం గాని ఎక్కడో గవర్నర్‌పేటలో దించేశాయి లారీలు మమ్మల్ని. జనాల మధ్య కాలుతున్న వస్తువుల మధ్య నించి ఇంటికి కాలూ చెయ్యి గట్టిగా ఉండగానే చేరుకున్నాను కానీ అక్కడి దృశ్యం హృదయ విదారకంగా అత్యంత బీభత్సంగా ఉంది. మా ‘బడే సాయిబు వీధి’ నిండా కళ్లు చెదిరిపోయే వస్తువులే.. కుప్పలు పోసి అమ్మేస్తున్నారు. జనాలు కొనుక్కుంటున్నారు? పప్పులు కుప్పలు తెచ్చి వొలిపేస్తున్నారు.
అమ్మకి నన్ను చూడంగానే ప్రాణం లేచి వచ్చింది. ‘హమ్మ య్య వచ్చావా? కృష్ణా’ అంటూ అక్కున అదుముకొని బావురుమన్నది. వెర్రిపిల్ల.. ఏవేవో వస్తువులు కొనేసింది.. నేను అరిచాను ‘అమ్మా! సారీ అమ్మా’ అంటూ. అమ్మ విచలితం అయింది. తుపాకులు పట్టుకొని మరీ వస్తున్నారు పోలీసులు. ఇవి అవతల పారేయాలమ్మా.. అంటూ నేను తమ్ముడు మిత్రులం అంతా కలిసి సరుకులన్ని రోడ్డు మీదకి విసిరేస్తున్నాం. పోలీసులు రానే వచ్చారు.
వాళ్లకి ఏదో ముట్టజెప్పి కారుచౌకగా కొన్న సరుకుని దక్కించుకోవాలన్న వాళ్లూ ఉన్నారు. సరుకులు తెచ్చి రోడ్డుమీద పడేసి అగ్గిపుల్లలు గీసి పడేసిన వాళ్లూ ఉన్నారు. కాని మేము నినాదాలు చేస్తూ ‘అమరజీవి జోహార్.. ‘ఆంధ్ర కేసరీ ‘మియాం మియాం’ అని అరుస్తూ సరుకులను ఇంటింటికీ పోయి బ్రతిమాలి బయటవేస్తూ ఉంటే డబ్బులు పోయి సరుకులూ పోయాయి అబ్బాయిలూ.. ‘హయ్ అల్లా.. అబ్ క్యా కరేమ్‌రే..’ అని బూబమ్మలు ఏడుపు - ఇనుప టోపీలు ధరించి వచ్చిన పోలీసులు నన్ను ‘్భష్ భేష్’ అని వీపు మీద చరిచారు. నాకు ఎక్కిళ్లుగా ఏడుపు తన్నుకు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మద్రాసుతో కావాలి అన్నది మా కోరిక. వస్తుందా? నెహ్రూ రాజాజీలు దగుల్బాజీలు కమిటీ వేశాం అని నాటకం మొదలెట్టారు అన్నారు పెద్దలందరూ.
గాంధీ పార్కు నాకు ఫ్రెండు. పక్కనే జంక్షన్‌లో వారగా వున్నా కుంభకోణం హోటలు - మాకు ఎంతో ప్రియమైనది. ఇడ్లీ సాంబార్ కాఫీలకి కాదు.. క్రికెట్ కామెంటరీ వినడానికి.. అయ్యర్ గారికి క్రికెట్ పిచ్చి. నాడు రేడియోలు అరుదు. ఒక స్టాటస్ సింబల్ అది. హిందీ క్లాసు అయితే డుమ్మా కొట్టేసేవాడ్ని. లాలా అమర్‌నాథ్.. వినూ మన్కడ్, పొలీ ఉమ్రీగర్, పాకిస్తాన్ మీద ఆడుతూ వుంటే ‘విజ్జి ది గ్రేట్ కామెంటరీ.. వింటూ వుంటే.. ఏమి హాయిలే హలా.. అలా నిలబడి - పొమ్మంటున్నా వేలాడి వినడమే పని. కొత్త కుర్రాడు హనీఫ్ మహమ్మద్ ఆటకి ఫిదా.. కెప్టెన్ అమర్‌నాథ్ ‘రాంగ్‌ఫుట్’ బౌలర్ - విన్నూ మన్కడ్ కుడిచెయ్యి బ్యాటింగ్ ఎడమ చెయ్యి బాల్.. ఇవన్నీ కామెంటరీ ద్వారానే బొమ్మలు కట్టినట్లు ఉండేవి. ఆనక హిందూ వాళ్ల ఏకైక స్పోర్ట్స్ మేగజైన్‌ని రీడింగ్ రూమ్‌లో దొరకబుచ్చుకుని చూసి తరించడం. స్కూల్‌లో క్రికెట్‌కి గుర్తింపు లేదు. బేస్‌బాల్, వోల్లీ బాల్.. వీటినే పోటీలకి అనుమతించేవారు. గాంధీజీ హైస్కూలు అంటే ఫుట్‌బాల్ టోర్నమెంట్స్‌కి పెట్టింది పేరు. రాధా సెవెన్ - అందరూ ఏడుగురు బ్రదర్స్.. దుమ్ము లేపేస్తూ ఆడేవారు. ఓసారి.. స్పోర్ట్స్ రూమ్ ప్యూన్‌కి పావలా ఇచ్చి గడ్డి కూరిన ఫుట్‌బాల్ తెచ్చి ఆడాను. బొటనవ్రేలు గోరు చేత్తో వొలిచినట్లు ఊడిపోయింది.. మళ్లీ ఆ ఆట జోలికి వెళ్తే వొట్టు.. కానీ వాలీబాల్ లేదా బేస్‌బాల్‌కి రెడీ. జిల్లా పోటీలకి ఎంపిక అయ్యాను కూడా. చెడుగుడు నిత్యకృత్యం. కూత మాత్రం భిన్నంగా డుగ్‌డుగ్‌డిగా.. అని పెట్టేవాణ్ని. గ్రిగ్‌లో రిఫరీ బయటకు పొమ్మన్నాడు.. హ్యాపీగా పోయి కూర్చున్నాను. (ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com