S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

12/14/2019 - 23:16

అధి 1963 ఆగస్టు నెల - మొదటి వారం - నేను ‘తెర మీద - తెర వెనుక’ కోసం శ్రీమతి అంజలీదేవితో విస్తారమైన ఇంటర్వ్యూ పూర్తి చేసుకొనే సరికి రాత్రి పది దాటింది. అంజలీదేవి ఆదినారాయణ దంపతులు ఇద్దరూ.. భోజనం చేసి వెళ్లాలని పట్టుబట్టారు - పోనీ రేప్పొద్దునే్న - మా డ్రైవర్ దింపేస్తాడు - అన్నదామె అమిత వాత్సల్యంగా.. నాన్నగారు ఈ రాత్రికి నిద్రపోరు - పోతానండీ.. భోజనం పూర్తిగా ఆత్మీయం. డ్రైవర్ని పిలిపించిందామె.

11/30/2019 - 23:11

ఓకే రోజు ,నేను ‘‘ప్రెస్’’ లోనుంచి అక్కడ పేజీలు గాత్ర చూసుకొని నా బల్ల
ముందు చిన్న డ్రామా జరిగి పోతోంది .. మా సెల్ లోకి వచ్చేస్తో వుంటే ,మా

11/23/2019 - 23:21

ఫాఠకులు చాలా సెన్సిటివ్‌గా, చురుకుగా వున్నప్పుడు పత్రికా సంపాదకుల మీద వేరే ‘నియంత్రణ’ అక్కరలేదు. గుంటూరు నుంచి ఎన్. సూర్యారావు అనే పాఠకుడు ఓ కార్టూను మీద మమ్మల్ని నిలదీశాడు. అది ఇలా వుంది. ‘మీ వారపత్రిక (17.4.64)లో కాఫీ హోటల్స్‌లో సర్వారాయుళ్లు చేయు ఆలస్యాన్ని హాస్య పూర్వకంగా తెలుపుతూ ఒక కార్టూన్ ప్రచురించారు.

11/16/2019 - 23:13

నిజమే, తెర మీధ తెర వెనుక శీర్షికకి -అంజలి, భానుమతి, సావిత్రిల సరసన -నాట్య తారకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాము -కారణం ఈ మాటలోనే వున్నది- ఆమె నాట్యతార-కేవలం సెట్స్ మీదనే కాదు - నిజజీవితంలో కూడా ... తన ట్రూప్‌తో దేశంలోనూ విదేశాలలోనూ కూడా పర్యటించాలి.

11/09/2019 - 18:28

ఉధ్యోగరీత్యా ఎంతోమందిని కలిసి సంభాషిస్తాం. ప్రతిసారి అది ‘థ్రిల్’ ఇవ్వదు. కానీ 1963, నవంబర్ 14న వాలెంతినా తెరెష్కోవాతో కరచాలనం చేసి కేవలం అయిదు నిమిషాలే సంభాషించిన నేను ఇప్పటికీ ఆ మధుర క్షణాల స్ఫురణతో మురిసిపోతుంటాను. ఎక్కడ ప్రప్రథమ రోదసీ మహిళ? ఎక్కడ నేను? ఆమె నాడు పతీసమేతంగా మద్రాస్ వచ్చింది.

11/02/2019 - 19:28

ఒక వర్కింగ్ జర్నలిస్టుగా - సృజన రఛనకి చాలినంత సమయం కుదరకపోయినా అనుభవాలు అవకాశాలు ఎన్నో దొరుకుతాయి.. కేవలం రచయితగా వుండి సోమేసెట్ మాంలాగా నవల రాయడానికి ముందు ఇండియా టూర్ చేసి వెళ్లి రాయడం సాధ్యం కాదుగా.. రెక్కాడాలి.. డొక్కాడాలి - కలం కదలాలి.. కొత్త అనుభవాలు అనుభూతి కావాలి. నేను తెర మీద - తెర వెనుక ప్లాన్ చేసినప్పుడు - అదీ యాభై అరవై ఏండ్లు ఇలా ఆకర్షకంగా ఉండిపోతుంది అనుకోలేదు.

10/26/2019 - 18:23

అరవై నాలుగు, జూన్ 28 రాత్రి అక్కినేని నాగేశ్వరరావు కోసం మధ్రాసు మీనంబాక్కం ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. అభిమానులు, హితైషులు ఎందరో వున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న తెలుగు వాళ్ల ‘దేవదాసు’ని ముందుగా పలకరించి నాలుగు మాటలు ఏర్చికూర్చి మర్నాడు ఉదయం - వీక్లీకి ఎక్కించాలని అదో కోరిక. మర్నాడే వీక్లీ అంతా రెడీగా ఉంది. వీక్లీ ప్రింటింగ్ మొదలైపోతుంది.

10/19/2019 - 18:31

1963వ సంవత్సరం ఛాలా రకాలుగా నా ‘కెరీర్ జీవితం’లో ‘మరపురాని సంవత్సరం - నా సీరియల్ నవల ‘ప్రేమకు పగ్గాలలు - జర్నలిస్టుగా కొత్త ట్రెండ్’లో తెర మీద - తెర వెనుక శీర్షిక నిర్వహణ - పుస్తక ప్రపంచంలో ఇంటింటి గ్రంథాలయం ద్వారా ఓ కొత్త విప్లవాన్ని కాదు, కాదు ఓ నవ చైతన్యాన్ని తీసుకుని వచ్చిన శేషాచలం అండ్ కంపెనీ ఎం.ఎన్.రావు గారితో పరిచయం అవడం - సరసమయిన ధరకి నవలలు పాఠకుణ్ణి వెతుక్కుంటూ పోయి - అందించిన ఎం.ఎన్.ర

10/12/2019 - 17:29

వీక్లీ ఇంఛార్జిగా రాగానే - బాధ్యతనెత్తిన టన్ను బరువులాగా పడ్డది. సమన్వయ సమర్థత అనేది ఇంకా కష్టం. వీటికోసం బెరుకుగా భయంగా ఎక్కడ తప్పు జరిగితే అది ముప్పు తెస్తుందో? ఐతే, అప్పట్లో ప్రకటనదారుల బెదిరింపు తక్కువ. వెనుక అట్ట ప్రకటన కోసం డిమాండు వుండేది. మద్రాస్ మ్యూజియం క్యురేటర్ నీలం హరినారాయణరెడ్డి గారొచ్చాడు మా ఆఫీసుకి. తన వ్యాసాలమీద నా కథలమీద చర్చతో మొదలయింది మా దోస్తీ.

10/05/2019 - 18:34

అరవై నాలుగు ఉగాదికి - ఆంధ్రపత్రిక ఆఫీసులో - వినాయక చవితి కళ కనిపించింది. ఆంధ్ర పత్రికకి పుట్టిన రోజు వేడుకలు అంటే వినాయక నవరాత్రులే. డిపార్ట్‌మెంట్‌ల వారీగా విఘ్నేశ్వర పూజలు చెయ్యడం - ప్రసాదాల పంపిణీలో - విగ్రహాలంకరణలో - ఎవరి ప్రత్యేకత వారు చాటుకోవడం ఒక పరంపర. కానీ ఆ సారి అదనంగా - ఉగాది వేడుకలు అంటూ సిబ్బంది చేసుకోడాన్ని - నేను వెనకేసుకొచ్చాను. అందర్నీ కూర్చోబెట్టి పల్లకీ మోసే బోరుూలెవరోయ్?

Pages