S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేరులోనే గలదు పెన్నిధి! అది ఎట్లన్నన్!!

ఓకే రోజు ,నేను ‘‘ప్రెస్’’ లోనుంచి అక్కడ పేజీలు గాత్ర చూసుకొని నా బల్ల
ముందు చిన్న డ్రామా జరిగి పోతోంది .. మా సెల్ లోకి వచ్చేస్తో వుంటే ,మా
వాడు ప్రకాశం -అటూ ఇటూ తిరుగుతూ -అచ్చం నాలాగే -లేక్చర్ ఇస్తూ -ఝానఝన లాదడిస్తూవుంటే -మాధవరావు , ప్రకాశరావు మిగతా వాళళు- చిన్మయంగా ఆలకిస్తున్నారు- నేను గతుక్కుమన్నాను -ఇలా వుంటుంది అన్న మాట -నా కోపం అసహనం -దిసిప్లిను ఎలా ఉంటాయో -మిమిక్రీ చీస్తున్నాడు అన్న మాట మా వాడు-
నాదే పొరపాటు-మెయిన్ ఎంట్రన్స్ లోనుంచి కాకుండా డైలీ హాల్లో నుంచి ‘‘బ్యాక్ షాప్’’ లోకి వెళ్లి రావడం.. తక్షణం వెనక్కి జారుకున్నాను.. ప్రెస్‌రూమ్ లోకి అక్కడ కూర్చుని -గోపాల్! ప్రకాశం వచ్చాడేమో చూ!మన్నాను. నాకు కొంత కోపిష్టి నైజమ్ వున్నది .. మరీ ‘‘బడి పంతులు టైపు’’- కాకపొతే, మా వాళ్ళే చెబుతారు... అది ఉత్త విసనకర్ర విసురు- తర్వాత -బోలెడు గారం చేస్తాడు అని అనేవాళళు. వాసిరాజు ‘‘పేజీలు దిద్దిపడేస్తున్నాను సార్’’ అన్నాడు ప్రూఫ్‌తో వచ్చి..అలా వుంటే - మధ్యలోనే ఆపి నన్ను చూడలేదుగా.. అన్నాను కొంటెగా సర్ వచ్చి రూమ్‌లోకి వెళ్లారు.. అన్నాడు...ఈసారి ఖంగుతిన్నది నేను .. బాస్ మహేష్ -ఇద్దరు రావడం నమక్కి ఎరికైఇల్లే.
..మహేష్ -అసలు ఉమామహేశ్వరరావు -చాలా జీనియస్. -మాకు వార ఫలాలు రాస్తాడు. వేల్పులకైనా మార్పులు తప్పవు అన్న హిస్తోరిక్ పౌరాణిక గాథలు రాశాడు-కాళికా దేవి గణపతి లాంటి దేవుళళు హిస్టరియా మిస్టరీయా ? లాంటి మేటర్ చాలా సేకరించిన -మహేష్ -అసలు ఇంట్రెస్ట్ వేరు.. మంచి రచనా పటిమ కూడా గలవాడు. జాతకాలూ రాస్తాడు- న్యుమరాలజి కూడా చెప్తాడు- అతన్ని వర్తులాధికారి అనేవాన్ని ప్రేమగా నేను. వర్తులాధికారి అంటే సర్కిల్ ఇన్‌స్పెక్టర్కి -కొంటె తెలుగు మాట. మహేష్ గుండ్రంగా -వున్నట్టు - బొజ్జ కూడా వుంది. మెట్లు మావీక్లీ’మిద్దే’వి నిచ్చెన నిటారుగా నిలబెట్టినట్లే వుంటాయి- ఆపసోపాలు పడుతూ ఎక్కి వస్తూ -రాధాకృష్ణ గారున్నారా? వట్రసుడి మీద నొక్కి అడిగేవాడు-.వాయిస్ కాస్త ‘‘లౌడ్ స్పీకరు ‘‘. క్రిష్ణ అనొచ్చుగా అంటే -ముక్కుమీద వ్రేలు వేసుకొని -అపచారం సర్- అని -లోపలికి వెళ్ళేవాడు.
రాధాకృష్ణ గారన్నాడు-ఇది (నన్ను చూబెట్టి) ఆయన డిపార్టుమెంటు- అని నవ్వుతూ -మహేష్ గారేదో -మీకు.. పనిబెడతాడు- చేసుకోండి. అని నాకు అప్పగించేశాడు.
అవధరింపుడు: ‘‘నామధేయం నసార్థకం -అంటూ సంస్కృత భాష -‘పేరు’ మీద -విశ్వాసరాహిత్య తీర్మానాన్ని ప్రతిపాదించగా -పేరు గొప్ప వూరు దిబ్బ అంటూ తెల్గు భాష సదరు తీర్మానాన్ని -బలపరుస్తోంది.. గాని సంఖ్యాశాస్త్రం మాత్రం పేరులోనే గలదు పెన్నిధి అంటుంది. ఏ వ్యక్తీ కైనా తన పేరుకీ బలంగా ఏ సంఖ్యా వస్తుందో ? ఆ సంఖ్యా యొక్క మంచి చెడ్డల మీద - అ వ్యక్తీ జీవితం ఆధారపడి వుంటుంది అని న్యూమరాలజీ చెబుతోంది’
ఒక్కో అక్షరానికి ఒక్కొక్క సంఖ్యని శాస్త్రం నిర్ణయించింది అన్నాడు
మహేష్- కాకపోతే తెలుగు సంక్లిష్ట అక్షరాలకన్నా ఇంగ్లీషు అక్షరాలకి పవర్ చెబుతాను అన్నాడు- అది ఇది-; ఇంగ్లీషు అక్షరాలకు నిర్ణయించబడిన సంఖ్యలిలా వున్నాయి.
I J Q Y P 1

B K R P 2

C G L S P 3

D M T P4 అలాగే E H N X P 5

U ,V , W P వీటి బలం 6

O, Z P 7 తఠ్వాత , - -8 ఇక వీటిని చాసే విధానం ..

KAMARAJ P 2 1 4 1 2 1 1 ??? 12

పేరుకు సంఖ్యని నిర్ణయించేటప్పుడు ఒక సంగతిని ముఖ్యంగా గమనించాలి-
అది ఇది -ఏ పేరుతో ఏ వ్యక్తి అధిక సంఖ్యాకుల చేత పిలవబడతారో -ఆ పేరునే పరిగణనలోకి తీసుకోవాలి -అంతే కానీ బారసాల నటి పేరుకో కూడదు. అలాగే దస్తావేజుల్లో వుంది నామధేయాన్ని గాని తీసుకోకూడదు - ఫలితం వుండదు- కొంత మంది పేర్లకు అనేక విధాలుగా మార్పులు వస్తూ వుంటాయి.. ఉదాహరణకి -కొంతమంది తమ పేరులోని కొంత భాగంతో -అనగా పొడి అక్షరాలతో ప్రసిద్ధులు అవుతారు- ఉదాహరణకి -పూర్తి పేరు పూసపాటి విజయరామగజపతిరాజు -కానీ, వాడుకలో ఆయన -పివీజి రాజు - మరి కొంతమంది -పూర్తిగా పేరులోని పొడి అక్షరాలతోనే వ్యవహరింపబడుతూ వుంటారు. -ఉదాహరణకి -పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు -వాడుకలో శ్రీ శ్రీ - మరికొంతమంది తమ పేరులోని కొంతభాగంతోనే గుర్తింప బడుతూ వుంటారు. మాటవరసకి -పూర్తి పేరు -గుమ్మడి వెంకటేశ్వర రావు -కానీ వాడుక -గుమ్మడి అని మాత్రమే. మరి కొంతమంది అసలు పేరుతో నిమిత్తం లేకుండా -కలం పేరుతోనో లేక మరి ఒక పేరుతోనో చలామణీ అవుతూవుంటారు. ఉదాహరణకి అసలుపేరు -పిళ్లా కృష్ణముర్తి -వాడుకలోని పేరు వీరాజీ. పేరులో మార్పు ఎట్లా వచ్చినా -మారిన ప్రసిద్ది కెక్కిన పేరుతోనే-ఒక వ్యక్తిని -అత్యధిక సంఖ్యాకులు -ప్రజలు గుర్తిస్తూ వుంటే ఆ నామధేయానే్న పరిహరించాలి -ఇది ముఖ్యం. అసలు పేరు -లేదా పూర్తి పేరు గాని లెక్కలోకి తీసుకోరాదు. -వాడుకలోని పేరు మాత్రమే తీసుకోవాలి.
ఇక -పేరు లోని అక్షరాల కూడికలకు - బలం - ఫలితం చూద్దాము.
మంచి చెడులు ఇలా వుంటాయి. 1. (మొత్తం అయితే) మిక్కిలి మంచిది -
2. మంచిది. 3 -చాలా మంచిది- 4 -సామాన్యం, 5-ఎంతో మంచిది. 6 .చాలా మంచిది -7. మంచిది, 8 -చెడ్డది. 9.చాలా మంచిది -10 కూడా చాలా మంచిది. 11.మంచిది కాదు 12.మంచిది 13.సామాన్యం -14.కూడా సామాన్యమే-15 -మంచిది . 16. మంచిది కాదండీ- 17. శుభా శుభ మిశ్రమం. 18 .మంచిది . 20 అంత మంచిది కాదు. 21.చాలా మంచిది కాగా 22. అంత మంచిది కాదు 23.మిక్కిలి మేలు 24.ఇంకా మంచిది. 25.మంచిదే 26.మాత్రం చెడ్డది. 27.వెరీగుడ్ 28.బాడ్ మంచిది కాదు -28.కూడా మంచిది కాదు. 29.నాట్ గుడ్ 30.చాల మంచి రొంబ అలఘ.. సామాన్యం 32. చాలా మంచిది -33. సరే చాలా మంచిది. 34.మంచిది -35. చెడ్డది. 36.ఎంతో మంచిది. 37.డిట్టో 38. మంచిది కాదు 39.చాలా మంచిది.. 40.సాధారణం 41.చాలా మంచిది 42. చాలా మంచిది. 43.మంచిదికాదు 44 .చెడ్డది 45. చాలా మంచిది -46 చాలా గుడ్ 47 . మంచిది కాదు సామీ.. 48 .చాలా మంచిదీ. 49.సాధారణం -50 . వెరీ గుడ్ ..
ఇక -కొన్ని ప్రముఖుల పేర్ల బలం ఎలా తీసుకోవాలో చూద్దాము.
gandhiP 3 1 5 4 5 1P???19 అలాగే nehru P5 5 5 2 6 ???19 ;lenin P3 5 5 1 5
???19 Pchoodamdi P limkan ; kennedy ఇధ్దరికీ ఒకటే నంబర్ - 27 వస్తుంది. మరో మతలబు వున్నది-పేరులో రెండు మూడు స్వతంత్రములైన భాగాలు గాని పొడి అక్షరాలుగాని వుంటే -ఉన్నట్లయితే వాటికి విడివిడిగా సంఖ్యలను సాధించి
-అప్పుడు కలపాలి గాని రోడ్ద కొట్టుడుగా ఒకేసారి బలం గణించకూడదు. నీలం సంజీవ రెడ్డి - విడివిడిగా తీసుకొని లెక్క తీసికొని అప్పుడు కలిపి బలం తెలుసుకోవాలి. నీలం (23 )??? 5; సంజీవరెడి డ(34 )??? 7 - 7, 5 కలిపితే 12 .
L V prasad Pni విడగొట్టి గణించవలెను . -3, 6, 1 వస్తాయి మొత్తం 10 అని మహేష్ వివరణ.
అలాగే పేరుని బట్టి వచ్చిన సంఖ్య -పుట్టిన తేదీ రెండూ వొకటయితే భేష్!
-నెహ్రు కి అలాగే వచ్చిందట. అయితే, 8 సంఖ్య ఇట్లా వస్తే మంచిది కాదుట. మహేష్ కొన్ని వృత్తులకు అంకెలు ఎట్లా నప్పుతాయో ఇచ్చాడు. రాజకీయాలు -1, వ్యాపారం -5, సైన్యం -9. కళలకు -2 మరియు 6. మత విషయం అయితే -3 బెటర్. మరో సంగతి -ఈ సంఖ్యల యొక్క బలాబలాలు -ఆయా సంఖ్యల అధిపతులైన గ్రహాల మీద ఆధారపడి వుంటాయి. ఈ బలాబలాలు -కేవలం వ్యక్తులకే కాదు -సంస్థలకు కూడా వర్తిస్తాయి- ప్రముఖుల జీవితంలో -సంఖ్యా శాస్త్రం ఎటువంటి పాత్ర పోషించిందో కూడా పరిశోధించాలి -ఆ పని చేస్తానని మహేష్ మాట. అసలు కోరిక అతనిది వేరే వుంది. ఒక కథ రాయాలి -దాన్ని సినిమా తియ్యాలి అది ఆడాలి -పేరు పైకం గడించాలి ... నేను చనువు వున్నది కనుక- అన్నాను -
ముందా బొజ్జ తగ్గాలి ( ఇది సెప్టెంబర్ అరవై నాలుగు లోని మాట ) -ఈ వ్యాసం అప్పటిదే. నవ్వేశాడు.
ఫుడ్ తగ్గించేసా సామీ -ఏమి ? ఆచరప్పాన్ స్ట్రీట్ మిర్చీ బజ్జీ హోటల్‌కి పోతం లేదా.. అడిగాను. ఈ ఆచారప్పన్ స్ట్రీట్ బజ్జీల రెస్టారెంటు -మిరపకాయ బజ్జీలకు ఫేమస్ .. ఎన్టీఆర్ గారికి ఇక్కడనుంచే -ఓ యాభై అరవై కి తక్కువ లేకుండా -మిర్చిబజ్జీ తీసుకుపోతారని-ఆయన పాతిక దాకా లాగించి బ్రేవ్‌మని త్రేంచేవాడని వదంతులున్నాయి. నాకు మాత్రం ఎన్టీఆర్జీ -వాళ్ళ ఇంట గూనలతో వున్న తేనెని మాత్రమే చవి చూపించాడు.
లేదండీ .. ఫుడ్ తగ్గించా .. ఇప్పుడే రెండు బాసుందీ తిని ఇట్లా బండీ
లాగించా నన్నాడు- నవ్వాపుకోలేక చచ్చామనుకోండి- బాసుందీలు , హల్వాలు తింటే -సినీస్టార్ ’టున్ టున్’ లాగా -.. .మళ్ళీ పొట్ట పగిలేలాగా .
నవ్వు- మా పాఠకులకు ఇది చాలాకాలం కాలక్షేపం అయ్యింది గాని -రాధాకృష్ణ గారికి నా పేరు కూడా మహేష్ స్టడీ లోకి వెళ్ళడం అది వెయ్యడం నచ్చలేదని అభిజ్ఞ్ఞవర్గాల భోగట్టా.. మిమ్మల్ని కాకాపట్టాలని మహేష్‌గారు తనిట్లా రాశాడు అని -మా ఫ్రెండు -బ్యాంకు మానేజరు -రాజారావు అన్నాడు.. అని మాత్రం అన్నాడాయన .. శిరసుండగా మోకాలి పూజ ఎందుకుటా ? మీరే తన వశుడై వుండగా -నేనెందుకో?.. అన్నాను నేను. తమాషాకి అన్నాను... మహేష్ మంచివాడు- ఆల్‌రౌండర్ -అంటూ నవ్వాపుకోలేక -లేచి వెళ్లి కిటికీ తలుపు ఇలా మూసి వచ్చాడాయన... అది ఆయన మ్యానరిజం.. దానికి ఎన్నో అర్థాలు వుంటాయి.
ఇంకావుంది

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com