స్మృతి లయలు
నిత్య నూతన సంచాలకుడు చక్రపాణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నిజంగా ఆంధ్రపత్రిక వీక్లీని ఎడిటింగ్ చెయ్యడంలో నేను తృప్తిగా ఎంజాయ్ చేసిన టైము- మద్రాసుకి సంబంధించినంత వరకు నేరుగా అయ్యవారి పర్యవేక్షణలో పని చేసినప్పుడే జరిగింది. చీఫ్ శివలెంక శంభూప్రసాద్ గారిని - అయ్యవారు అని అందరూ అంటే అయ్యర్ అని కుంచిత పాదంగారు రిఫర్ చేసేవాడు. ఎస్సార్ గారుఅంటే రాధాకృష్ణ గారిని బాస్ వచ్చాడేమో చూడండి అని నేను ఒక్కడినే అనేవాడిని!! ఏమంటున్నాడు మావాడు? అదే, మీ ఫ్రెండ్ - పెళ్లి చేసుకుంటానంటాడా? లేదా? అని ఒక్కోసారి అనేవారు అయ్యవారు.
అటు జి.యమ్. ఇటు అయ్యవారు కూడా ఇచ్చిన చనువుని - నామీద ఉంచిన కాన్ఫిడెన్స్ నేను ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడం దాకా ఎందుకు? కనీసం తరుచుగా పోయి ఏదోక సాకుతో పలకరించి - నా భక్తిశ్రద్ధలని వెల్లడి చేయలేకపోయేవాడిని. ఏదో నామోషీ. బిడియం రాధాకృష్ణగారు హర్ట్ అవుతాడేమోనన్న సంకోచం ఉండేది. తను కాదా. నన్ను వేటాడి, వెంటాడి పట్టుకొచ్చి ఎడిటోరియల్ హాలులో కూర్చోపెట్టింది అనుకునేవాణ్ణి. ఈ బిడియం, చనువిచ్చినా తీసుకోలేకపోవడం నాకు కెరీర్‌లోను, జీవితంలోను కూడా దెబ్బతియ్యడమే కాదు హ్యాన్డిక్యాప్డ్‌గా కూడా పరిణమించాయి. బెజవాడలో మాకు ఋషికేష్ అని నాకు కాలేజీలో సీనియర్ - నరసింహ మాష్టారు కుమారుడు సబ్‌గా చేరాడు. అతనో టిపికల్ పర్సనాలిటీ. రాధాకృష్ణ గారు మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏదో టైము చూసుకొని ఆయన గదిలోకి వచ్చేవాడు. వాళ్లనాన్నగారి పేరెట్టి చనువు తీసుకుని ఏదైనా ఫేవర్ అడుగుతాడేమోనని ఈయనికి భయం,. కూచోనేవాడు అట్లా పదినిముషాలు లేచి శలవు యిప్పించండి అంటూవిష్ చేసి వెనక్కి రెండు అడుగులు వినయంగా వేసి వెళ్లిపోయేవాడు. అలా చూసి వెళ్లడం కూడా కాకా పట్టడంలో ఒకరకం అనేవాడు. మా పొట్లొరు నవ్వుతూ.
ఓ సారి మా బాస్ అమెరికా యాత్ర చేసినపుడు మరోసారి అరవై నాలుగు జూలైలో తూర్పు ఆఫ్రికా టూర్ వెళ్లినపుడు అయ్యవారి మెప్పు పొందేలాగా వీక్లీ కే కాదు, ఆయన దగ్గర ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాను.
అయ్యవారి రూమ్‌లోకి ఆఫీసులోనైతే జియమ్ కాదు ఇన్‌చార్జి శ్రీరాములు గాదు ఎవరయినా నిలువుజీతమే. ప్రకాశరావుగారు లోనికి పోతే ఓ కాలు మార్చి ఓ కాలుమీద నిలబడుతూ ఉండేవాడు. కానీ ఇంటి దగ్గరికి వెళ్తే అసలు దృశ్యమే మారిపోయేది.
నేను వీక్లీ అంతా పేజీలు చేశాక తీసుకొని ఇంటికి వెళ్లేవాడిని. అంటే నన్ను వున్నాడుగా మా మైరావణాసురుడు. అంటే సూపరింటెండెట్ వర్గీస్. అతనే స్వయంగా కారుతీసి తెచ్చి అక్కడ పెట్టేవాడు. తానే డ్రయివ్ చేసుకుంటూ ఛామియర్స్ రోడ్డులోని శంభూప్రసాద్ గారి ఇంటికి తీసుకుపోయి-
నన్ను చూస్తూనే అయ్యవారు రండి అంటూ ఓ కుర్చీ చూపెట్టేవారు. తాను మాత్రం అటూ ఇటూ పచార్లు చేసేవారు. ప్రక్కన స్టూలు దాని మీద నా వారపత్రిక ఫైలు అంతే వర్గీస్ మాత్రం మూతి మీదో చెయ్యి పృష్ట మీద మరో చెయ్యి వేసుకొని నిలబడేవాడు. (అతి వినియం దూర్తలక్షణం అనుకునేవాణ్ణి)
అసలు మొదట నేను వీక్లీలోనే పనిచేశాను. కుర్చీలో కూనిరాగాలు అని కాలమ్ కూడా రాశారు. ఎన్.టి.ఆర్. ని ఇంటర్‌వ్యూ చేశాక- ప్రభాకర్ తీసిన ఫోటోలు ప్రింట్లు చూపించాను. సెలక్షన్ చేసి ఇస్తే.. అంటూ
ఇంటర్‌వ్యూ చేసిందెవరు? నేనే సార్.. మరి సందర్భోచితంగా బొమ్మలు తియ్యండి బొమ్మలు - మనం ఎన్నుకున్న టాపిక్ అందులో ఉన్న పర్సనాలిటీ, స్టేచర్‌కి తగ్గట్టు సైజులు లేఅవుట్ ఉండాలి. అంతేగానీ పోస్టలు బిళ్లల్లాగా చిన్న బొమ్మలు పది వేసేయకూడదు అంటూ శీర్షిక పేరేమిటి? ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్ నవ్వారు. ఇలా తల ఎగరేసి - నేను ఎన్.టి.ఆర్. అతని పడకటింట మంచంమీద -‘‘ఎదురు-బొదురు’’, ‘‘అనంతశయనం’’ భంగిమలో ఉండి ఉన్న ఫోటో (యివాళ్టికి అతి తెగ పాపులర్ -ఎన్. టి.ఆర్. ఫ్యాన్స్ దాన్ని కలర్ లామినేట్ చేసి వేడుకలయినాక నాకు పంపించారు.)ని తీసి దాన్ని వేసి టైటిల్ సూపర్ యింపోజ్ అయినట్లు, పెట్టండి అంటూ ఇచ్చారు. నాకు చెమటలు పట్టాయి.
‘‘రాధాకృష్ణగారు ..’’ అంటూ నసిగా నవ్వేశారాయన. నేనే పై నుంచి అంతా చూస్తున్నానని మావాడికి తెలుసు. ‘‘్ఫలో మై సజెషన్స్’’ అన్నారాయన.
అక్కడ ఎన్.టి.ఆర్ ఇంకా చనువుగా, స్వేచ్ఛగా ఆ రోజంతా కాల్షీట్ మీదే బ్రదర్ అంటూ తన ఇల్లు- పిల్లలూ - వారి చదువుల గది అన్నీ చూపించారు.
చిన్న పిల్లాడిని ఆడిస్తున్న వారి అమ్మగారిని చూపించి మాతృశ్రీ అంటూ ఆమెకి నమస్కరిస్తూ సినిమా భంగిమలో పరిచయం చేశాడు ఎన్.టి.ఆర్.గారు.
పెద్దపెద్ద ‘‘గూన’’లతో ఓ గదిలో ‘పుట్ట తేనె ఉన్నది’ ఇది ప్యూర్ హనీ. ఇదే నా వ్యాయామం తరువాత ‘సేవనం’ అంటూ కొయ్యాడతో (వుడెన్ స్పూన్) కొంత తీసి నాకు పోసి తాను నాకి దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఫిట్‌నెస్ అంటూ గాలిలో కొన్ని వ్యాయామ విన్యాసాలు - శివతాండవం చేసినట్లు చేసి చూపించారు. అదంతా ఓ డ్రీమ్ సీక్వెన్స్ లాంటి ఇంటర్‌వ్యూ.
అదంతా ఆనక ఇక్కడ అయ్యవారు ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ సభ్యులకు ఇచ్చే అతి వాత్సల్యభరితమైన ట్రీట్‌మెంట్ గురించి తలుచుకుంటే నేటికి నా ఒడలు పులకరిస్తుంది.
‘‘చక్రపాణి’’ గారంటే విజయ వాహినీ బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి త్రయంలో ‘‘విష్ణుమూర్తి’’ లాంటి వాడు. 1940 నే బి.ఎన్. రెడ్డి గారు స్వర్గసీమ స్క్రిప్టు రాయడానికి పోయి తెనాలి నుంచి తెచ్చుకున్న ఆలూరు వెంకట సుబ్బారావే. చక్రపాణిగా విజయ పతాకను నభో మండలాన ఎగిరించిన వాడు యువపత్రిక అంటే కుర్రాళ్లం పడి వాళ్లం, చందమామ పత్రిక కొడవటిగంటి కుటుంబరావుగారి జర్నలిస్టు రచయిత దొరకడంతో, భూమి మీద మరో చంద్రుడై అన్ని భాషలలోను రాణించింది. నాకు తెలుసు - ‘తెరవెనుక’ భానుణ్ణి ఇంటర్‌వ్యూ చేయబోతున్నానని పైగా శరత్ సాహిత్యం అనువాదాలు అన్న లైబ్రరీలలో ఆయన చేసినవే చదువుకున్నాను. నేను చక్రపాణి గారి ఆఫీసులో ప్రవేశించేసరికి అక్కడ డివి నరసరాజుగారు ఉన్నారు.
నిజానికి నరసరాజు గారే ‘సార్ షార్ట్ స్టోరీ రైటర్ కూడా , అది మాట అందించారు. లేకపోతే చిన్న పిసరు గుర్తు ఉంది నా మీద చక్రపాణిగారికి. నా ‘అండమ్మ కథ రివ్యూ’ ఒకటి, జగదేకవీరుని కథ ఒకటి ఆయనకి వేళాకోళం చేస్తూ రాభు అనిపించింది. ‘రెండు’ హీరోలు, ‘రెండు హీరోయిన్స్’ అన్నావు అసలు హీరోయిన్ సూర్యకాంతమ్మ అన్నావు.
కానీ, ఆ వ్యక్తిత్వం లేని హీరో క్యారక్టర్ లే హిందీలో కూడా ఢంకా బజాయిస్తున్నాయి. చూడు అంటూ తన కుర్చీ వెనుక ఉన్న గుండమ్మ కథ హీరోల ఫోటోలు చూపెట్టారు. మరొక సంగతి నేను స్వాతంత్య్రం రాకముందు సినిమాలకు అటు తరువాత చిత్రాలకు వౌలికమయిన మార్పులేమిటి? అని అడిగాను.‘‘ ఇవి కమ్మర్షియల్ చెత్త అంటావా?
అంటూ మన కోపంగా అసలు నీ వయస్సు ఎంతబ్బాయి’’ అన్నారు.
నవ్వేను. నా వయస్సు యాభై ఐదు సంవత్సరాలు అన్నాను.
‘‘ఆరీ ’’ అంటూ ఆయన కుర్చీ వెనక్కి తోసుకున్నారు. - విశదీకరించాను.
ఇంటర్ వ్యూ చేస్తున్నది పత్రిక సదరు అనుభవం యొక్క వయస్సు చెబుతున్నాను అన్నాను. అసలీ ప్రశ్న దుక్కిపాటి మధుసూదనరావు గారిని అడిగి ఆనక నన్ను అడుగు అన్నాడాయన. ఇదీ మాట మధుసూధన రావుగారు హైదరాబాదులో మా ప్రతినిధికి దుక్కిపాటి వారు చెప్పారు.
నాకర్థమయింది. మొదట మీ ఇంటర్‌వ్యూ తరువాత ఆయనది రెండూ రెడీ చేశాక రిలీజు అన్నాను. కొంత వివాదం సాగింది.
ఏం త్రాగుతావు.. మీరేం తాగితే అదే. మరో కప్పు ఫిల్టర్ కాఫీ చాలు అన్నాను అంట చెప్పాను సార్ ఒక్కసంగతి వినండం. నరసరాజుగారు ముందుకు వంగారు ఇద్దర్నీ ‘‘కూల్’’ డవున్ చేద్దాం అని నా ఉద్దేశం. అని అనక చెప్పారు.
మీరు 1940 లో స్వర్గసీమ స్క్రిప్టు రాస్తున్నప్పుడు నేను పుట్టాను. అందుకే మిమ్మల్ని 1940 కి -1960 కి మధ్య కంపేరు చెయ్యమన్నాను. శాంతించాడు. మూవీ సంచాలక చక్రవర్తి ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. రాను రాను సినిమా టెక్నాలజీ పెరిగిన కొద్దీ మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచి ఈ సినీ చిన్న ప్రపంచం రేపు ఎంతో విస్తారమవుతుంది. స్టూడియోలో డబ్బాలతో చేసిన జలపాతం కాదు. నిజం జలపాం. కావాలి అంటాడు ప్రేక్షకుడు. - రేపటి సినిమా కూడా ఆయనకు ఐడియా ఉన్నది. కమ్మర్షియల్ విషయాలలో పోటీ లేదు అనొద్దు. ఏ.వి.యమ్. సంస్థ జెమినీ సంస్థలు ఉన్నాయి. దక్షిణాదిన చెలామణి ఉన్న విజయవాహిని అనే బంగారు నాణేనికి చక్రపాణి, బి.ఎన్. నాగిరెడ్డి ఇద్దరూ బొమ్మ, బొరుసు లాంటివారు. రచయిత, సంపాదకుడు (చందమామ, యువచాలదా) నిర్మాత, ద్రష్ట, స్రష్ఠ అయిన చక్రపాణి గారు యాక్షన్ చేయించేవాణ్ణి’’ నేను నాకు వేరే ఫోటోలు వద్దు లే అబాబ అంటూ ఆయన పోటో గ్రాఫర్ ని వారించాడు. ఈ నివిషాలు దుక్కిపాటి ఆర్టికల్ తరువాత మళ్లీ కలుద్దాం. అప్ డేట్స్ చేద్దాం. కావాలంటే నేను శంభూ ప్రసాద్ కారికి కూడానచ్చ చెప్పగలను.
నిజంగా ఒక లెజండ్ తో మాట్లాడిన అనుభూతి కలిగింది.
‘యువ’ పత్రికలో దీపావళి ప్రత్యేక సంచిక నా కథ ఉండాలి. నా పెంకితనాన్ని ఆయన ఎంత హర్షించాడంటే 1974లో ఆ ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక కథలనన్నీ తిరిగి ‘యువ’లో వేశారాయన మునగ చెట్టు నవల తో సహా తాళ్లూరి నాగేశ్వర రావు పర్యవేక్షణ అప్పుడు.
అప్పుడు నిజానికి నెల, వార్షిక పత్రికలకు తప్ప పోటీ వీక్లీలకి డైలీలకు రాయకూడదు. అన్ని అంక్షలు ఉండేవి. ఏది ఏమైతేనేం? చక్రపాణి గారి ఇంటర్‌వ్యూ వెయ్యలేకపోయాను. అయ్యవారు కూడా మరోసారి చూద్దాం. హిడిజర్స్ స్పెషల్ ట్రీట్‌మెంట్ అన్నారు.
నేను విజయవాడ వచ్చేశాక అయ్యవారు తన స్వదస్తూరితో ఒక ఉత్తరం రాశారు నాకు.
‘‘చక్రపాణి’’తో చేసిన ఇంటర్‌వ్యూ అంశాలు ఉంటే రాసి పంపండి. అని భారతిలో వేద్దాం అనుకున్నాం. వ్రాసి పంపించాను కూడా. దటీజ్ అయ్యవారు.
అయ్యవారితో సన్నిహితంగా చనువు ఉన్న చివరి తరం నాది. ఆయన సంపాదకులకు సంపాదకుడు తాను కనీ పడక తన ప్రకాశాన్ని నలుదెసలా వెదజల్లిన వెలుగుల మూర్తి.
(ఇంకా బోలెడుంది)