స్మృతి లయలు

సుతిమెత్తని కత్తి హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్వ్యూస్ అన్నీ కూఢా వెళ్లిపోయిన తిరిగిరాని మధురమైన ప్లాట్‌ఫారం లేదా రోమన్ హాలిడే లాంటివి.. కానీ నాకే కాదు పాఠకులకు కూడా అవి ఇష్టమైన జ్ఞాపకాలే. కత్తి కాంతారావుగా వాసికెక్కిన తాడేపల్లి లక్ష్మికాంతరావు- తెరమీద హీరో- తెరవెనుక సుతిమెత్తని పర్సనాలిటీగల స్నేహశీలి- అతని పేరులోని మొదటి నాలుగు అక్షరాలూ- ఇంటిపేరు ఆ ఇంట్లో ఇల్లాలు పిల్లలు తల్లి సంసారం సందడి వెరసి కావాల్సినంత లక్ష్మికళ వున్నదానాడు- గుమ్మంలో మోటారు కారు- గుంజకి కట్టిన గర్రంలాగా.
కాంతారావుగారున్నారా?
మీరు వుండమన్నారుగా..!
నిజానికి చూడగానే ఆయనలో మర్యాద తెలిసిన మంచి మాటకారితనమున్నదని గ్రహించాను.
ఉండదా మరి? నాడు హెచ్.ఎం.రెడ్డిగారు పట్టుకుని సానబట్టిన తెలంగాణ రత్నం కదా? 1963 నాటి నా ఇంటర్వ్యూ (తెరమీద- తెరవెనుక)- ‘పాతవారిలో కొత్తవాడు కొత్తవారిలో పాతవాడు. అనుభవజ్ఞుడు అని సరిగ్గానే పేర్కొన్నాననుకుంటనా.. శ్రీ కాంతారావుకి సినిమా రంగంలో చాలా అనుభవం వున్నది. ఢక్కాముక్కలు తిన్నవాడు. కాస్త కటకట ఉన్నది సినిమా రంగంలో. ఇవాళ కొత్తవారంటే భయం. పాతవారి కొరత వున్న ఈ తరుణంలో శ్రీ కాంతారావు వద్ద లభిస్తున్నది సరియైన టాలెంట్. ఈ ఏడాదే చాలా చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో (ఆప్తమిత్రులలో విలనీ వుంది. లవకుశలోని లక్ష్మణుని పాత్ర అద్భుతం) అతనికి ప్రజాదరణ లభిస్తున్నది. ఇంట్లో ఫొటోలు కబుర్లు అయినాక- నాకు షైరు అంటే చాలా ఇష్టం, కానీ ఛాన్స్ ఎక్కడ? అని తను అన్నాడ లేదో- పోదామా? అన్నాను అప్రయత్నంగా నేను. పిల్లలతో ఇల్లాలితో కారుమీద ఫొటోలు తీశాముగాని మేరీనాలో ఇంటర్వ్యూ భేష్ అన్నాను. కారు నేను తోలుతాను- డైరెక్షన్ మీరు చెప్పండి. ఓకె.. హియర్ వుయ్ గో.. అన్నాడు.
మెరీనా బీచ్ రద్దీగానే వుంది.. ప్రభాకర్ అన్నాడు ఇలియట్స్ బీచ్‌కి పోదామా? అక్కడ ఫోటో షూట్ ఈజీ.. హీరో ఎన్టీఆర్ గారి ఇంట ఆయన బెడ్ రూమ్‌లో ముఖాముఖీగా అప్పటికి చర్చలో నలుగుతూన్న రామాయణం స్క్రిప్టు.. ఇక్కడ ఇల్లియట్స్ బీచ్‌లో హీరో కాంతారావుతో ఆటవిడుపు.. నాకన్నా తను పదిహేడు ఏండ్లు పెద్ద.. ఓ సెలిబ్రిటీ.. ఆ మాట మరిచిపోయాం.. ఫొటోగ్రాఫరూ పైలాపచ్చీసు సినిమావాడే.
‘‘అన్‌సీజన్.. సముద్రుడు కూడా ఏకాంతం ఎంజాయ్ చేస్తున్నాడు. జనాలు లేరు- నాటికి ‘వాకింగు దిటాకులు’ గట్రా లేవు. మాదే అనుకున్నాము. లాంగు షాట్స్ మిడ్‌షాట్ ఫోజులు- కబుర్లు.. మీ మాట చలవవల్ల ‘శతచిత్రోత్సవం’ రావాలే గాని మొదటి ఆహ్వానం మీద ప్రామిస్’’ అన్నాడు హీరో గుడ్‌బై చెబుతూ.
గుదిబండ గ్రామంలో తాను మునసబైన గ్రామంలోనే ఈ నాటకాలకు నాంది పలికాడు. దరిమిలా అతడు మద్రాస్ వచ్చాడు. ఇవాళ 60 దాకా సినిమాలు క్రెడిట్‌లో వున్నవాడు హెచ్.హెచ్.రెడ్డి కనిపెట్టినవాడు. తెలుగు సినిమాకి ఆదికవిలాంటివాడు. శ్రీ హెచ్.ఎం.రెడ్డి ఆయన ‘కుర్రాడు రాణిస్తాడు’ అన్నాడు. అదే మొదటి ఖరీదైన సర్ట్ఫికెట్ కాంతారావుకు. ఆయన సానపట్టిన ఈ రత్నం ఇలా రాటుదేలింది.. రాణించింది.
శ్రీ కాంతారావు ప్రతిభగలవాడు. ఈ వాక్యంలో అబద్ధం లేదు. పొగడ్త కూడా లేదు. కాని అతను అదృష్టవంతుడు అనే మాటకు ఆస్కారం లేదు. అది అతన్ని కోరి వరించలేదు ఏదీ- తానై వెంటాడి సాధించి దాని పిలక పట్టుకున్నాడు. ఇవాళ అది సరేనంది (1963).
మనసు ఒక్క సినిమావైపు లాగింది. కాంతారావుకు ఆనాడే సిరి, సంపద వెంట రాలేదు. తనకున్నది కొంత, శ్రమపడి సాధించినది కొంత, కలిసి అతను నిలదొక్కుకుని హీరో అయ్యాడు. ఆ ఏడాది చిత్రరంగాన పలుకుబడిగల పేరు, అనేకమంది ప్రొడ్యూసర్లు, సంతోషంగా ఎగబడుతున్నా పేరు నేడు శ్రీ కాంతారావుది. అతనికి అహంకారము, అసహజమైన దర్పం లేదు. పాత్రను అర్థం చేసుకుని అందుకు శ్రమపడటం అతని కృషి. అదే అతనికి కోరిన వరాలు ఇస్తున్న తపస్సు. క్లుప్తంగా టూకీగా ఈ టాకీ నాయకుని పాత కొత్తల మేలుకలయికకు ఈ పేరా ఉపోద్గాతం.
ప్రతిజ్ఞ - ప్రతిభ
ఇవాళ అతను అగ్రశ్రేణిలో అవకాశాన్ని, ఆశయాన్ని వాడుతూ రాణిస్నుత్నాడన్నమాట అతిశయోక్తికాదు.
ఆయన పూర్తిపేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. మొదటి నాలుగు అక్షరాలు ఇంటిపేరు. ఆ ఇంట్లో ఇల్లాలు, పిల్లలూ, తల్లి, సంసార కళ, సందడి వెరసి లక్ష్మీకళగా ఉన్నదానాడు. ఈ అందాల నటుడు అర్జెంటుగా వున్న అన్ని పనుల మధ్య అర్జెంటుగా ఇంట్లో ఉండిపోయాడు. నన్ను సంతోషంగా పలకరించాడు.
శ్రీ కాంతారావులో మర్యాద తెలిసిన మంచి మాటకారితనము ఉన్నదని కాసేపులోనే గ్రహించాను. అతనికి ఈ మధ్య అంటే ఈ ఏడాది చేతినిండా డబుల్ షిప్ట్ పని వున్నది. అయినా మనిషిలో ఉదాసీనత, అశ్రద్ధ వెతికినా కనిపించవు.
‘ప్రతిజ్ఞ’లో అగుపించిన ఈ అందమైన తెలుగు నటునిలో ప్రతిభ ఇవాళ వసంత ఋతువై పూస్తున్నది. అందుకు విడుదల అవుతున్న సినిమాలు సాక్ష్యం.
మీరు ఆడ వేషాలు వేశారా?
నిక్షేపంగా వేసేవాడిని. నాటకాల్లోలెండి. అందంగా కోలమొహంగల కాంతారావు అందంగా నవ్వుతాడు.
శ్రీ కాంతారావు ‘కట్’లకు ‘టేకు’లకు మధ్య ‘చిలక పలుకులు, హీరో కులుకులు కులికి’ హీరోగా నిలదొక్కుకున్నవాడు కాదు. తెలుగు నాటక రంగంలో ఆనవాయితీగా వస్తున్న ఆడవేషం సైతం చేసి తదుపరి కథానాయకుడైనాడు.
ఈయన కథలో చాలా మలుపులు వున్నాయి. ఎందుకంటే కొన్నిచోట్ల హీరోయిన్ ప్రక్క హీరో, అనగా కథానాయకుడు కాదు. అనేకచోట్ల హీరోప్రక్కన హీరో అంటే సహనాయకుడు కూడా. ఉదాహరణకు శాంతినివాసం, లవకుశ లాంటివి. భట్టి వేషం వేసిన కాంతారావు ఉదాత్తమైన పాత్ర పోషణకు, లక్ష్మణుడైన కాంతారావు గంభీరోదాత్తమైన పాత్రలకు పెట్టింది పేరుగా రాణించాడు.
అలెగ్జాండురుగా..
నాటకాలాడితే అలెగ్జాండరు అందులో వేషాలేస్తే అవి చరిత్రలో నిలిచి వస్తాయయవి. తెరమీద వేస్తే పౌరాణిక కాలంలో ఆ పూసలు, హారాలు గల వేషాలూ, విష్ణుమూర్తి, అతని మనుమడు అనిరుద్ధుడు కూడా వేస్తాడు. జానపదాలైతే చక్కగా నప్పుతాడు. గుఱ్ఱ+కత్తీ = అదీ వేషం, భట్టీగాను రాజుగా గట్టిగాను అన్ని రకాలుగాను సిన్సియర్‌గా కూడా రాణించగలిగాడు.
1.ఖమ్మం మెట్టులో హాయిగా ఉండడానికి ఇవాళలాగే ఇల్లు కట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా, పిల్లాపీచు గొడ్డూ గోదాతో కాలక్షేపం చేయడానికి.
2.ఇవాళ ఇలాగే నిలబడి నిలబడగలనని స్వయంకృషితో ఒక కెరీర్‌ను ప్రేక్షకుల హృదయాలలో ఒక పీఠాన్ని వేసుకోవడానికి ఎంత తేడా వుందయ్యా? అంటే, ఆ తేడా ప్రతిజ్ఞ నుంచి కానిస్టేబుల్ కూతురు దాకా గల సినీ మైలురాళ్లమధ్య సాగిన ‘చిత్రయాత్ర’గా కాంతారావు కథగా రూపొందుతుంది.
‘బాలమిత్ర సమాజం’ ఒకటి స్థాపించి మునసబు గిరీ చేస్తూ కూడా శ్రీకాంతారావు మధుసేవ, చింతామణి, జయంతి, జయపాల లాంటి నాటకాలు ఆడుతూ ఉండేవాడట. ఇవాళ కూడా ఆయన ట్రూపుతో నాటకాన్ని తెలుగువాళ్ళ మెప్పు పొందేలాగా తీసుకెళ్లగలననే ధైర్యంతో ఉన్నాడు. అలెగ్జాండర్ నాటకంలో ఒక సీను దేశరక్షణ దేశ రక్షణ నిధికై తారలు చేసిన ప్రదర్శనలో అతను వేయగా ఈమధ్య హై హైద్రాబాద్, కర్నూలు, విజయవాడ ప్రేక్షకులు చూసే ఉంటారు. అతనే అలెగ్జాండర్. మంచి ధాటిగా డైలాగులు చెప్పగల నటుడు.
‘శాంతి నివాసం’లోని పాత్ర బహుక్లిష్టమైనది. దానిని అతడు పోషించిన తీరు జనానికి చాలా చాలా నచ్చింది. శాంతి నివాసం వేళ అన్ని విధాల ఢక్కా మొక్కీలు తిన్నవాడు, తెరమీద చాలినంత అనుభవం అధ్యయనం, అభ్యాసంగల నటుడు. అదే ఒక ‘మలుపు’. శ్రీ కాంతారావు చెకచెకా సినిమాలు తీసే శ్రీ విఠలాచార్య సినిమాలతో పనిజేశాడు. ప్రతిజ్ఞ నాటినుండి వున్న కత్తి పట్టుకోగల, గుర్రంమీద కూచోగల అనుభవం ఈ సినిమల్లో మంచి వెంచర్‌గా రాణించింది.
కనకదుర్గ పూజా మహిమ బహు గమ్మత్తు అయిన సినిమా కథ. కత్తులు, గుర్రాలు, రాజకన్యలు, దేవకన్యలు, యక్షిణులు, యంత్రాలు, తంత్రాలు- అబ్బోరి అది ఒక మాయాలోకం. అందులోను కాంతారావే. ఖైదీ కన్నయ్యలోను కాంతారావే. అంబరీషుడు, విష్ణుమూర్తి, నారదుడు కూడా కాంతారావే. ఇన్ని కాంతారావులు లేరుగాని ఈ పాత్రలను వేర్వేరుగా ధరించి భరించగలిగినవాడు ఒక్క కాంతారావే. ఆయనలో సిన్సియారిటీ, నిగ్రహశక్తి, ఓపిక, సాదాసీదా నైజం అన్నీ వేషాలలో రాణించాయి.
శ్రీ కాంతారావుకు సాంఘికాలతో ‘టిపికల్’ రోల్స్ రావాల్సి వున్నది- అట్టివి పౌరాణిక జానపదాలలో ఆయనకు దొరికాయి. భేష్ అనిపించుకున్నాడు.
కాంతారావు సమర్థతను ఎక్కువ భాగం పౌరాణికలా, జానపదాలు మాత్రం వాడుకున్నయి. సాంఘికాలకు ఇప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. కుచేల చిత్రం అరవం, మలయాళం భాషలలో తీశారు. ఈ నటునికి కృష్ణునిగా మంచి పేరు వచ్చింది. సాంఘికాలలో ఇటీవలి ‘ఎదురీత’ కానిస్టేబుల్ కూతురు మొదలైనవి ప్రశంసనీయంగా ఉన్నాయని ప్రజలు, విమర్శకులు ఒప్పుకున్నమాట.
శ్రీకాంతారావు సెన్సిటివ్‌గా అనిపిస్తాడు. కలుపుగోలుత, మంచి ఇచ్చి మంచి కోరేతనం- కృషిని ధారపోసి ప్రేక్షకుల మన్నన పొందేతనం- ఉన్నవానిగా కనిపిస్తాడు. ‘నా ఫ్యాన్ మెయిల్ అంటే నాకు చాలా గౌరవం’ అన్నాడాయన.
చిన్నప్పుడే వాళ్ల నాన్నగారు ఇతనిని పెంచాల్సిన బాధ్యతను తల్లికే అప్పగించి కన్నుమూశారు. తల్లి పెంపకంలో పెరిగినవాళ్లకి సుకుమారం.. గారాబం.. కొండకచో మూర్ఖతమైన పంతం అలవడతాయి.
కాంతారావును చూస్తే వాళ్ళ అమ్మగారికి ఎంతో గౌర్వంగా ఉంటుంది. ఆమె బయటకు తెలియనివ్వలేదు గాని నేను గ్రహించాను. ఆమె ఇచ్చిన స్వేచ్ఛను కాంతారావులో ఇవాళకు కూడా కృతజ్ఞత, భక్తి తొణికిసలాడుతున్నట్లు వాళ్ళను చూడగానే గ్రహించవచ్చును. ఆమె చేసిన ‘ఉప్పుడు పిండి’, పెట్టిన ‘తేనీరు’ త్రాగాను.
‘సాధారణంగా ఇంతవరకు ఎప్పుడూ డూప్ షాట్‌లకు ప్రాకులాడలేదు. సాధ్యమైనంత వెంచర్ తీసుకునేవాణ్ణి నేను’ అంటాడాయన.
గుర్రాలు ఎక్కడం, కత్తులు తిప్పడం గట్రా పేర్కొని ‘మరేం ఫర్వాలేదండి’ వాటికి మంచి ట్రైనింగు వుంటుంది. గీసిన గిరి దాటవు. మనని దాటనివ్వవు. అలాగే కత్తి పట్టడమూ. అది అలవాటైంది. అండర్ స్టాండింగ్ వున్న నటులతో అది సునాయాసంగా అవుతుంది’ అంటాడాయన. రాజనాల మంచి ఫ్రెండు.
నిగర్వి
నిగర్వి... మొహమాటం కూడా వున్నవాడే- సాధారణంగా నిర్మాతల మనసుకి, దర్శకుల మస్తిష్కానికి ఇబ్బంది తేవడం గానీ టేకుమీద టేకు అడిగి (ఆ నిర్మాత లేదా దర్శకుడు తానై ఇస్తేను, అడిగితేను తప్ప) సినీ బ్రహ్మల ప్రాణాలను ‘రా’ ఫిలిమ్‌ను కొనుక్కుని తినేవాడు కాదు. అంతా బుర్రలోనే రిహార్సల్ వేసుకుని మూడ్‌లోకి రావడం అలవాటు. చిక్కుఅంతా జానపదం నుంచి పౌరాణికం నుంచి, సాంఘికాల మీదకు రావడమే ఎంతో కష్టమైన పని. ఆ మూడు, మూడు వేరు వేరు లోకాలు అని చెప్పాడు కాంతారావుగారు.
నారికేళం - సాంఘికాలం
ఉదాహరణకి నారదుడు రావణాసురుని వ్యంగ్యంగా ‘లంకేశ్వరా! నీ అంతవాడివి నువ్వు’ అని డైలాగు చెప్పాడనుకోండి. భాషా వేషం కూడా భిన్నం. డైలాగు ఖంగున ఉండాలి. అదే సాంఘికంలో ఓ సుబ్బారావు, అప్పారావుని ‘నీకేమిటోయ్? నీ అంతవాడివి నువ్వు?’ అని వేళాకోళంగా అనాలి అంటే, తేలికగా డైలాగును విసురుతాము. పురాణ చిత్రాలు ‘లైట్ క్లోజప్’ వున్నపుడు సైలెంట్ ఎక్స్‌ప్రెషన్‌కి ప్రాముఖ్యత ఎక్కువ. అలౌకికంగా చూపు ఉండాలి అంటూ హావభావాలతో కాంతారావు సముద్ర తీరంలో భావోద్రేకంగా వివరించి చెప్పడం నేను ఇప్పటికి మరచిపోలేదు.
ఈ విధంగానే కాంతారావు కెరీర్ రెండు విభిన్నమైన సినీ కళావేదికలమీద రాణించింది. అతనిలో అధ్యయనం, దానితోపాటు క్రమశిక్షణ, పైగా సంసారపక్షంగా జీవితాన్ని గడపడం ప్రత్యేకతలు. అందుకనే శతచిత్ర వీరుడు అవ్వాలని మనసా, పత్రికా రూపాన కూడా ఆకాంక్షించారు. అనుకున్నట్టుగానే కత్తి కాంతారావు నూరు చిత్రాలు 67 నాటికి పూర్తిచేశాడు. వీరి పూజ లేదా స్ర్తిజన్మ అతని నూరో చిత్రం.
కోదాడలో అశేష ప్రేక్షక సమూహం మధ్య సంబరాలు జరిగాయి. ఈ ప్రేక్షక ప్రేమాభిషేకానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. బెజవాడ డైలీనుంచి వెళ్లాను. తన ప్రసంగ ప్రారంభంలోనే ఆంధ్రపత్రిక వీరాజీగారు ఏనాడో జోస్యం చెప్పారు. ఆయన ప్రిడిక్షన్ నిజమైంది అంటూ అభినందన మాలలు చిరునవ్వులతో నామీదకు విసిరాడు. ‘దట్ ఈజ్ కాంతారావుగారు’. దీనిమీదట సభకు అధ్యక్షత వహించిన దామోదరం సంజీవయ్యగారు ప్రిడిక్షన్ అనకూడదు అంచనా వేశారు అనాలి అంటూ చమత్కరించటం నాకు గుర్తు వుంది. ఇదంతా ఆనాటి స్మృతి. ఆ తరువాత మా ఇద్దరి జీవితాలు చాలా మలుపులు తిరిగాయి. ఎక్కడ కనిపించినా ఒకరిని ఒకరు వదలలేక కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ప్రేమాస్పదుడైన సినిమి స్టార్. వందలాది సినిమాలు చేసినవాడు సినిమాలు తీసి దెమ్బతిన్నాడు. అయినా మరుపురాని మహానటుడు. ఒకసారి విజయవాడలో ఊర్వశి టాకీస్ ఫంక్షన్ ఒకదానికి వచ్చినపుడు అక్కడి దగ్గరగా వున్న మా ఇంటికి తమ్ముడు గీతా సుబ్బారావుతో నడుచుకుంటూ వచ్చేశాడు. గొప్ప పర్సనాలిటీ.. సింప్లిసిటీ..
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com