స్మృతి లయలు

‘స్వప్నసుందరి - సీతమ్మ తల్లి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధి 1963 ఆగస్టు నెల - మొదటి వారం - నేను ‘తెర మీద - తెర వెనుక’ కోసం శ్రీమతి అంజలీదేవితో విస్తారమైన ఇంటర్వ్యూ పూర్తి చేసుకొనే సరికి రాత్రి పది దాటింది. అంజలీదేవి ఆదినారాయణ దంపతులు ఇద్దరూ.. భోజనం చేసి వెళ్లాలని పట్టుబట్టారు - పోనీ రేప్పొద్దునే్న - మా డ్రైవర్ దింపేస్తాడు - అన్నదామె అమిత వాత్సల్యంగా.. నాన్నగారు ఈ రాత్రికి నిద్రపోరు - పోతానండీ.. భోజనం పూర్తిగా ఆత్మీయం. డ్రైవర్ని పిలిపించిందామె. మీరాశ్చర్యపోతారు - శ్రీమతి అంజలీదేవి - విఖ్యాత సంగీత దర్శకుడు - ఆదినారాయణ రావుగారిని 1942లో వరించి పెళ్లి చేసుకున్నది. ‘గొల్లభామ’గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘లవకుశ’ చిత్రం తరువాత తెలుగు వారి హృదయంలో సీతమ్మ తల్లిగా తిష్ట వేసుకుని - శాశ్వత కీర్తిని సముపార్జించింది.. తిరిగి మెరీనా బీచ్ మీదుగా కారు తీసుకుపోతున్నాడు మా జార్జ్ టవున్‌కి. అక్కడేదో షూటింగ్ జరుగుతోంది - అంజలీదేవి గారి కారుని కొందరు గుర్తించినట్లే ఉంది. కొందరు దారికడ్డం పడ్డారు - ‘యా రిరికా రుల్ల అప్పా.. పార్కాలం’ అంటూ.. చాకచక్యంగా తప్పించాడు డ్రైవర్.. ఆ రాత్రి అదో అడ్వెంచర్.. మా 337 - ఓ రాతికోటలాగా ఉంటుంది - రాత్రి నో ఎంట్రీ - ఆఫీసులకే కాని రెసిడెన్సీ కాదు. వెనుక దొడ్డి దారిలో వున్న పిట్టగోడ దూకాలి. అక్కడ నుంచి స్కావంజర్కోసం మెలిక మెట్లు పైకి మా రూము దాకా వుంటాయి - అదృష్టవశాత్తు ఒక చిన్న తలుపు మా గదిలోకి వుంది.. అట్లా సేఫ్ హోం’... అసలు తెలుగువారి ‘స్వప్నసుందరి’ ఆనక ‘సువర్ణ సుందరి’ కూడా అంజలీదేవియే.
నేను వాళ్ల వైభవ భవనం లాంటి ఇంట్లోకి ప్రవేశించాను. అక్కడో రౌండ్ టేబుల్ - రెండు కుర్చీలు ఉన్నాయి.. అటూ ఇటూ చూసి కూర్చున్నాను. నాకోసమే అయ్యుంటుంది ఒక నౌకరు కప్పుతో టీ పెట్టాడు. ఆమె సంకోచంగా వచ్చింది - ఓ కొత్త కళ విసిరినట్లు.. అభివాదం చేసి ఆమెను కూర్చోమని సంకేతిస్తూ నవ్వేను. ప్రభాకర్ కెమెరా సెట్ చేసుకుంటున్నాడు.
‘ఆయన రావడానికి టైము పడుతుందా?..’ అర్థమై పోయింది - బొత్తిగా వరహీనంగా వున్నానన్న మాట.
‘నేనేనండీ వీరాజీని.. మా ఫొటోగ్రాఫర్ ప్రభాకర్’ అంటూ ఉండగానే - ఆమె నేనూ కూడా కూర్చుండిపోయి కెమెరాలోకి అప్రయత్నంగా చూశాము - స్నాప్ తీశాడు ప్ర.
‘మా చిన్నారావు లాగ వున్నారు - బాబూ!’ అన్నదామె.. శతచిత్ర యాత్ర జేగీయమానంగా పూర్తి చేసుకున్న అందాల తార శ్రీమతి అంజలీదేవి పెద్దబ్బాయిని చిన్నారావు అని పిలుస్తారు. ఇంజనీరింగు చదువుకుంటున్నాడు. అసలు పేరు వీర వెంకట సత్యనారాయణ - రెండో వాడు స్కూల్ ఫైనల్‌కి వచ్చాడు - కుమార్ అంటే నళినీ నిరంజన్ కుమార్. ప్రభాకర్ తమిళ్‌లో అన్నాడు వీర కూడా మొదట ఉన్నదీ అని.. ఆ రెండు వారాల ఇంటర్వ్యూలో - తన మొత్తం వంద చిత్రాల జాబితా ఇచ్చాను. అందులో బహు పసందైన గొప్పవైన సినిమాల జాబితా కూడాచ్చాను- రెండు వారాల పాటు ప్రభాకర్ ఇంకా చాలా? అనకుండా సంతోషంగా తీసిన బొమ్మలు కూడా వేశాను. ఇక్కడ ఇంటర్వ్యూకి పరిమితమై కొన్ని అంశాలను మాత్రం పేర్కొంటాను.. అదే క్రమంలో కాదు.. సందర్భోచితంగా.. తెలుగు అరవం హిందీ సినీ రంగంలోనూ కూడా ప్రముఖ స్టార్ - నిర్మాత కూడా. అంజలీదేవి కదా - ఈమె చిత్రాలు ప్రతిభ - కీర్తి గ్లామర్‌ల గురించి చెప్పకుండా తెనుగు చిత్రసీమ చరిత్ర రాయడం అసాధ్యం.. అన్నదాత; ఇలవేలుపు లాంటి చిత్రాలకు ఆమె అందించిన నటన - ఆమె కళా తపస్సుకు గీటురాళ్లు - అంటే అందరూ ఒప్పుకుంటారు. జయభేరి, భూలోక రంభ ప్రభుత్వం సత్కారం కూడా అందుకున్నది. ఈ భూలోక రంభయే సతీ అనసూయ - శ్రీలక్ష్మమ్మ అంతలో అనార్కలి. అంజలి ఆదినారాయణ దంపతులు - సంగీతానికి నటనకి పెట్టని నగలు - గీటురాళ్లు.. ఆదినారాయణ రావు గారికి కూడా ఏంటో చెప్పాలని ఉంది. తన పాటల గ్రామఫోను రికార్డులను పెడుతూ ఆయన మా సంభాషణలలో పాల్గొంటూ వుంటే ఆమె నవ్వింది - మీరేమి చెప్పినా ఆయనకి వినపడదు - అయితే మీరన్నట్లు (నేను) ఆయన సంగీతం మధురాతి మధురం. నేను ఆనర్స్ ఏ.యు.లో చేస్తున్నప్పుడు - హాస్టల్‌లో సీటు రాక నేనూ గోపాలం టవున్‌లో ఓ ఇంటి మేడ ఒంటి గదిలో కొన్నాళ్లు అద్దెకున్నాము.. ఆ డాబా ప్రక్కనే వున్న పెద్ద లోగిలి - ఓ వాటాల కొంప - అసలు వైజాగ్ బ్రాహ్మణా (వాటా) కొంపలకి పెట్టింది పేరు - నా నవల వీడివిడని చిక్కులకి -ఈ ఉమ్మడి నివాస గృహాలే.. సరే, గోపాలం ముందు లేచి - కాలకృత్యాలు పూర్తి చేసుకున్నాకా - నన్ను కేకవేసేవాడు - కృష్ణ.. లేలే లే... అదుగో నీ ‘చేట సుందరి’ అదుగో తచ్చాడుతూ నీ కట్ బనీను గాయక శిఖామణి - అంటూ మేలుకొలుపు.. ఆ క్రింది వాటాలలో ఓ పెంకుటింటిలో నుంచి - ఓ ప్రౌఢ సుందరి చేటలో బియ్యం పోసుకొని - వాళ్ల వసారాలో - రంగప్రవేశం కోసం తచాడుతూ వుండగా - అటు అయిమూలగా వున్న వాటాలో నుంచి - బనీను వీరుడు - ‘పిలవకురా.. పిలవకురా.. నను పిలవుకురా - అంటూ అంజలీ సువర్ణ సుందరి పాటని ఎలుగెత్తి పాడుకుంటూ వచ్చేవాడు.. నలుగురిలో నను నగుబాటు సేయకురా.. అన్నది విని ఆమె బియ్యం యేర్తున్నదే.. కానీ - చూపులు చెవులూ - బనీను బక్క హీరో మీదే - ఈ దృశ్యం మాకు టైం సిగ్నల్ లాంటిది. ఈ చిత్రం - ఆదినారాయణరావు గారి హిందుస్థానీ బాణీ పాటలకోసమే - హిందీలో తీశారు - ఎక్కడికెళ్లినా వెంటాడే పాట.
- నేను అడిగాను. సహనసద్గుణ శీల.. పాతివ్రత్యానికి స్ర్తిలకి ఆదర్శం, మాతృమూర్తికి ప్రతీక ఇట్లా లోకోత్తర పురాణ పాత్ర - సీతమ్మ తల్లిగా ‘లవకుశ’లో జీవించిన తరువాత - మీ ఫీలింగు?
- ఇవాళ అటు తరువాత - ఆమనీ.. ఆహామంటూ చెట్లచుట్టూ పరిగెత్తే చిన్నపిల్లలా పరుగులు తీసే వేషాలు వెయ్యడానికి అదోలాగ ఉంటున్నది అన్నదామె.
కానీ శ్రీమతి అంజలీదేవికి మేము వున్న పళాన తీసిన ఫొటోలు సాక్షిగా - ఇంకా ఆ కనుల లావణ్యం, మొహంలోని అందం ఇంత పిసరు తరగలేదు. పరువంలోని వేషాలకు ఆమే ఎవ్వరికీ తీసిపోకపోగా మరింత బెటర్ అంటారు నిర్మాతలు. ఆరోఏట తన నటజీవితం ప్రారంభం అయిన ఈమెకు నాటకాలు సినిమాలు వెరసి విజయపరంపరగా గొప్ప తార అయి శతచిత్ర పండుగ పూర్తి అయ్యింది.
ఆమెకు చంద్రసేన రంగులలో తియ్యాలని వున్నదిట.
ఒక యాంగిల్‌లో ఫొటో తీయబోతూ వుంటే - అదొద్దులే బాబూ.. అని వారించి- ‘సారీ టు డిసప్పాయింట్ యూ.. ఆ యాంగిల్‌లో కొంచెం మెల్లకన్ను పడుతుంది’ అన్నదామె. మహానటులకు వాళ్ల డిఫెక్ట్స్ కూడా బాగా తెలుస్తాయి. ఇక ఆమెకి హాబీలు ఏమిటయ్యా? అంటే.. సంసారం బాధ్యత, ఇల్లూ వాకిలీ, మా పిల్లలూ వాళ్ల చదువులు - ఇవిగాక ప్రొడక్షను.. ఇవన్నీ హాబీలే కదా? అన్నదామె.. కాకపోతే శరత్ పుస్తకాలు - వారం వారం వీక్లీ - ఇష్టం.
దైవభక్తురాలు.
అంజలీదేవికి దైవభక్తి మెండుగా వున్నది. ఇటీవల ఆమెకు నిత్యం పూజ ఒకటి దైనందిన కార్యక్రమం అయింది. మస్టూ.. ఇంట్లోనే పెద్ద లక్ష్మీదేవి మందిరం వున్నది. అంతేనా? ఇల్లూ దాని చుట్టూ ఉద్యానవనం. దానిలో ఫౌంటెన్లు.. అన్నీ కన్నులపండువగా - సినిమా సెట్‌లాగా ఉన్నాయి. కాగా మందిరం మరీ శోభాయమానంగా ఉంది. తోటలోకి వెళ్తాను - అని చెప్పింది. అక్కడ పువ్వులూ కాయలూ కోయడం గోప్పులూ గట్రా త్రవ్వడం చెయ్యను. కేవలం ప్రశాంతంగా గడుపుతా అదే నాకు ఇష్టం.
పాటల ప్రస్తావన రాగా ఆమె చెప్పింది. పాటలు ఎక్కువగా వున్నా ఇప్పుడు అవదు. ఇప్పుడు నిడివి మీద నిబంధనలు పెట్టేరుగా అన్నదామె. నిర్మాతగా హిందీ తెలుగు అరవం చిత్రాల అనుభవం వున్నా ఆమెకు హిందీ రంగంలో కూడా నటిగా మన్నన దక్కింది. అక్కడామెను- ద మోస్ట్ గ్లామరస్ డాన్సింగ్ స్టార్ అనేవారు అంతా.. వూరికే విజయం గ్లామర్‌తో మాత్రమే రాదు. శ్రమించాలి. అహర్నిశలు.. డక్కమొక్కీలు తినాలి.
కాకపోతే అక్కడ వాళ్లు బాగా బిజినెస్ లైక్‌గా వుంటారు. అయితే, కేవలం మంచి టేస్టుతోపాటు శిక్షణ కూడా పొందాలి. అంజలీదేవిగారి ఇల్లు - విశాలంగా కళాభిరుచికి ప్రతిబింబంగా వున్నది. ఏరంత బెడ్ మీద - ఆమె ఒద్దికగా మాగజైన్లు చదువుతూ పోజులిచ్చింది.. పోజు మార్పులు కావాలా బాబూ.. రెడీ! మీరడిగినవి రెండు ఒకే ఒక్కటి నాకిష్టం.. ఓకేనా? నవ్వుతూ.. నేను అన్నాను భూలోక రంభ మీరే సతీ అనసూయా మీరేగా.. అని. థాంక్స్ బాబూ నాకు ఇప్పుడు క్లిష్టం కష్టం ఘర్షణ వున్న రోల్స్ కావాలి. సీత పాత్రలో రాముణ్ణి రావణాసురుణ్ణి కూడా మెప్పించిన సౌందర్యం వుంది - పైగా ఎన్టీఆర్ రాముడిగా ‘లవకుశ’లో నటిస్తూ ఉండగా - సీతగా ఆమె స్కోర్ చేసింది. అదో తృప్తి.. అంజలీదేవి కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్న గ్లామరస్ స్టార్. భానుమతిలాగ పొడగరి కాదు. పాటలు పాడదు కానీ - బడిపంతులులోని ఈమె పాత్ర పోషణ మరొకరికి సాధ్యమా? నటీమణులలో నాడు అంజలి నేడు రేఖ అసలు మన హీరోయిన్లు వుండాలి అనిపించారు. అనార్కలిగా అంజలి నటన ఒక ఒజ్జ బంతి అనే వాళ్లున్నారు. కానీ ఆమె నిగర్వి. తమిళులకు ఆమె ‘్భలోకరంభై’.. 1949లోనే ఆమె సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్‌కి వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డది. ‘59లో సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల అసోసియేషన్‌కి ఎన్నికయింది. కాగా, విద్యారంగంలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆమె శాశ్వత సెనేటు సభ్యురాలు - తను నటించిన చిత్రాలే భావితరం నటులకు పాఠ్యగ్రంథాలు అంటారు సినీ పెద్దలు.
అటు తరువాత నేను విజయవాడ సినిమా ఫంక్షన్స్‌లో కలుసుకున్నానే తప్ప - మద్రాసులో వారింటికి వెళ్లటమే పడలేదు - కాకపోతే ఆమె అరవై నాలుగులో మా పత్రిక సంఘం నాటక సంబరాలకి నా మీద అభిమానముంచి.. హాజరై బహుమతి ప్రదానం చేసింది. కేథలిక్ సెంటర్ హాలులో జరిగిన వేడుకలకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా - కృష్ణకుమారి నాటి ఆత్మీయ అతిథిగా రావడం గ్రేట్. ఆంధ్రపత్రిక స్ట్ఫా సంఘం కళా అభ్యుదయ సంఘం ఎన్నటికీ మరచిపోలేనంత ఘనంగా మధుర స్మృతి అందరికీ.
కృష్ణకుమారి - విఠలాచారి గారి సెట్‌మీద వున్నది - పంపనంటాడు.. ఆ మాయల దర్శకుడు. నేను వెళ్లాను ‘చచ్చినట్టు..’ కాకాపట్టాను. ‘వీక్లీ బ్యాక్ కవర్ ఇవ్వం’ అన్నారు మీ వాళ్లు (యాడ్ కోసం) అని అలిగాడు. అది ఆన్యువల్ కాంట్రాక్టు మీద వుంది.. ఏమి తంటాలు పడ్డానో.. మొత్తానికి అట్లా మేకప్‌తోనే కుమార్ కేకే మా ఫంక్షన్‌కి వచ్చేసింది...
*
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com