స్మృతి లయలు

తెర మీద - తెర వెనుక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై రెంఢులో వారపత్రికకి మారడానికి ముందు దినపత్రిక ఉదయం షిఫ్టులో వున్నప్పుడు వడపళనిలోని విక్రమ్ స్టూడియోకి ‘పెళ్లి తాంబూలం’ సినిమా ప్రీవ్యూకి బయలుదేరాను. ‘సాయంకాలం మూడు గంటలకే వేసేస్తాం’ జనవరి నెల కదా? లేట్‌నైట్ ఇండ్లకు పోడం కష్టం’ అన్నారు. బేబీ టాక్సీలు దొరకవు. దొరికినా, ఆఫీసు - ఆటోకి మాత్రమే ‘పే’ చేస్తుంది. విజయా లాడ్జి నుంచి బ్రహ్మాండం నరసింహారావుకి ఫోన్ చేశాను. ‘చిత్ర’ పత్రిక బాస్ అతను. నీళ్లు నమిలాడు. ‘ప్రసాద్ అడగమన్నాడు’ అన్నాను. ‘రా, గురూజీ! కారేసుకు పోదాం’ అన్నాడు.
ఈ స్టూడియోలదో గోల. ఆటోలనీ, వాటినీ లోపలికి రానివ్వరు. విక్రమ్ వాళ్లు రానిస్తారేమో తెలీదుగానీ, మొత్తానికి ‘పెళ్లి తాంబూలం’ కాదు ‘పెళ్లి వడ్డనల’కు పోయినంత శ్రమైంది. కాకపోతే ఆంధ్రప్రభ వెంకట్‌గారు కారేసుకొచ్చాడు. తిరుగుదలలో మవుంట్ రోడ్ దాకా లిఫ్ట్ ఖాయం. పత్రికల వాళ్లకన్నా స్టూడియోలో స్ట్ఫా - వాళ్ల కుటుంబాల వాళ్లే ఎక్కువ మంది వున్నారు. పెద్ద నటులు షూటింగుల్లో వుండి పోయారు. రాలేదు. ఇక ఈ సినిమా విజిట్స్ కట్టేద్దామనుకున్నాను. కానీ మళ్లీ పక్షం రోజుల్లోనే ఆదినారాయణరావు గారి నుంచి అంజలీ పిక్చర్స్ వారి ‘స్వర్ణమంజరి’కి పిలుపువచ్చింది - ఏ.వి.ఎమ్. స్టూడియోలో ఇది. అంజలీదేవిగారు అందర్నీ చిరునవ్వుతో ఆహ్వానించింది. ఎన్.టి.ఆర్. హీరో - గానీ రాలేదు. కాల్‌షీట్ వుందిట. ఆదినారాయణ రావుగారి హిందుస్తానీ బాణీలు అందరికీ ఇష్టమే. కాకపోతే, ఏం మాట్లాడినా డైరెక్టర్ వేదాంతం రాఘవయ్యగారితోనే. నారాయణరావు గారు చెవిటి మిషన్ పెట్టుకోడం మరిచిపోతాడు.
నాకో అయిడియా వచ్చింది. ఎంతో సౌమ్యంగా మాట్లాడే టాప్‌స్టార్ అంజలీదేవి. ‘కీలుగుర్రం నాటికీ, నేటికీ చాలా తేడా రాలేదా?’ అన్నానే్నను. ‘వచ్చింది. కాస్ట్యూమ్స్‌లో, సెట్టింగ్స్‌లో. మిగతాది, ప్రేక్షకులకి ‘థ్రిల్లింగ్’ కావాలి. సందేశాలూ నీతి కథలూ ఎవరికీ అక్కరలేదు’ అంటూ వేదాంతంగారు కూడా మాట కలిపారు. ‘అవీ - ఇవీ - అన్నీ’ శీర్షికకి అదో స్టోరీ అవుతుంది లెమ్మనుకున్నాను.
ఐతే, పొద్దునే్న లేచి చూసేసరికి - బల్ల మీద - మెయిగ్రెట్ - సెట్స్ ఎ ట్రాప్’ అన్న జార్జి షిమినార్ నవల కనబడ్డది. నాన్నగారు - ఇలా అన్నారు. ‘మీ, రాధాకృష్ణ గారు ఎక్కువ మక్కువతో చదివే షిమీన్ నవల ఒకటి దొరికింది నిన్న. నువ్వు చదువు. రేపు ఇచ్చేస్తాను’ ఐదొందల పుస్తకాలు రాశాడట ఈయన! ఎర్ల్‌ష్టాన్లీ గార్డనర్ - ‘ఎ.ఎ.ఫెయిర్’ పేరుతో కూడా చాలా రాశాడు గానీ (ఎర్ల్‌స్టాన్లీ) గార్డెనర్ అన్న పేరుకే గ్లామర్ ఎక్కువ. మారు పేరు కృష్ణానంద్‌కన్నా వీరాజీ అన్న పేరుకే సహజంగా గ్లామర్ వున్నదీ అనుకున్నాను. అలాగే, గార్డ్‌నర్‌గారి ‘పెర్రీమాసన్’ సిరీస్‌లో డిటెక్టివ్ పాల్‌డ్రేక్ అంటే నాకిష్టం. పెర్రీమాసన్ (లాయర్ డిటెక్టివ్) పిలుపు నందుకుని వస్తూనే, కుర్చీలో కూలబడి ఓ కాలు ఎత్తి, ఇలా కుర్చీ చెయ్యి మీదుగా వ్రేలాడదీసి కూర్చునేవాడు పాల్. ఆఫీస్‌లోకి వెళ్తూనే, నేనూ అలాగే కూలబడి - ఈ కొత్త పుస్తకం నేను చదివానని రాధాకృష్ణగారికి చెప్పాలనుకున్నాను.
తిరుమల రామచంద్రరావుగారు తిరిగి మద్రాసు ప్రభ వీక్లీకి వచ్చేశారని రాశాడు తమ్ముడు. అంటే, ఇద్దరు ‘వీక్లీ వీరుళ్లు’ విద్వాన్ విశ్వం, నండూరి రామ్మోహన్‌రావులు - డైలీ, ఆంధ్రజ్యోతికి ‘వెలుగు’లై వెళ్లిపోయారన్నమాట. సోమవారంనాడు ప్రొద్దునే్న రాజకుమారి టాకీస్ (టి.నగర్)లో - ‘స్పార్టకస్’ సినిమా - ప్రెస్ షో - అన్న ఆహ్వానం జ్ఞాపకం వచ్చింది. ‘సరే! పోండీ. కానీ మధ్యాహ్నం సినిమా కాగానే ఆఫీసుకొచ్చేయాలి’ అన్నారు శ్రీరాములుగారు. కిర్క్ (కర్క్ అనాలిట) డగ్లస్ హీరో. సెట్టింగుల హంగుల బయస్కోపు అది. ఈ రాజకుమారీ టాకీసు - హాలు పాతదే కానీ, పాపులర్ తమిళ హీరోయిన్ రాజకుమారి పేరు మీద వున్నది అదో ఆకర్షణ. ఈ రాజకుమారి బొద్దుగా - అన్ని అవయవాలూ పుష్టిగా వున్న పెద్ద క(చ)నుల తార. ‘లావుపాటి పక్కింటి పిన్నిగారు’ అనేవాడు రాంప్రసాద్. ‘స్పార్ట్‌కస్’ - హాలులో, సినిమా జర్నలిస్టులంతా కలిశారు. అదో ఆనందం. జి.వి.జి.మోహన్ కుమార్, కొత్తగా ఆంధ్రపత్రిక వీక్లీ టీములో చేరిన ధర్మారావు వగైరాలు కలిశారు. వై.వి.రావు డిటెక్టివ్ బుక్ ఎడిటర్ - వీరాజీ మాకో డిటెక్టివ్ కథ రాయకూడదూ’ అని అడిగారు.
‘అబ్బే! ఇప్పుడు స్పేస్ ఫిక్షన్ రాస్తున్నాడు, తంబి. రష్యావాణ్ణి చంద్ర మండలం పంపించి గానీ నిద్రపోడు’ అన్నాడు రాంప్రసాద్. అతనికి మన్‌డే ఆఫ్. ఇద్దరం డిన్నర్ చేసి, ఆనక అతని రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద జార్జిటౌన్ వచ్చేశాం. తను ప్రెస్సులో పనుందనీ అటూ - నేనిటూ.
ఆదివారం సంచికలో ‘మన రోదసీ మజిలీ చందమామే!’ అంటూ ఓ ఆర్టికల్ రాశాను. దాన్ని పట్టుకొనే స్పేస్ ఫిక్షన్ రాస్తాడు మా వాడు’ అంటూ రాంప్రసాద్ జోక్ పేల్చాడు.
ఆ రాత్రి, బుర్రలో ‘ఔనూ! స్పేస్ ఫిక్షన్ ఎందుకు రాయకూడదూ, నేనూ?’ అన్న ఆలోచన రగిలింది. లైట్‌హవుస్ వెల్తురు ‘చక్.. చక్’మని, కిటికీలో నుంచి మొహం మీద తట్టుతూనే ఉంది. పోయినేడాది రా.కృ.గారు, నేను - రోమన్ హాలీడే లోలాగా అమృతాంజన్‌లో ‘హస్కు’ మెరీనా బీచ్ మీదుగా బస్‌స్టాప్ దాకా ‘రైడూ’ సాగిస్తున్నప్పుడు - ఆయన ‘ఐజాక్ అస్సిమావ్’ నవల - ‘పెబిల్ ఇన్ ద స్కై’ ఇచ్చాడు. నాకు సైన్స్ ఫిక్షన్ విషయంలో ‘జూల్స్‌వెర్న్’ - సనాతన రచయితగా జార్జ్ ఎన్.గామావ్’ - అధునాతన రచయితగా అనిపిస్తారు. కానీ ఈ ఐజాక్ అస్సిమోవ్‌గారు కూడా జార్జిగామావ్ గారిలాగా రష్యాలో పుట్టి - అమెరికాలో మెట్టినవాడేనట!
ఇక డైలీ హాలులో జోకులూ, కబుర్లూ అవీ తగ్గేయి. బుర్రలో రోదసీ ‘యానం’ చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. కాశీమజిలీ కథల ప్రభావంతో చిన్నప్పుడు మా పినతల్లి పార్వతమ్మ కథన ప్రోత్సాహంతో ‘సింహబలుడు సాహసయాత్ర’ అంటూ, కాశీమజిలీ కథలకి భిన్నమైన వాతావరణంలో ఓ సీరియల్‌ని ‘పాపాయి’ పత్రికకి రాశాను. అనుకోకుండా - ఆ ‘పాపాయి’ కాపీ ఒకటి - కనె్నమెరా లైబ్రరీ తెలుగు సెక్షన్‌లో -శిథిలావస్థలో కంటబడ్డది. మళ్లీ వార్తలు, రాజకీయాలూ మీది నుంచి స్పేస్ ఫిక్షన్ రాయాలన్న కోరిక కలిగింది. వీక్లీలో ‘ఎడ్గార్‌వాలస్’ నుంచి ఆర్థర్ కానన్ డయల్ దాకా అందర్నీ వాడేశారు - కాపీ రైటు కొని మరీ. ‘క్రిస్టిన్ కీలర్’ కథ కూడా వేస్తున్నాం’ అంటే, నేను వీక్లీ అవతారంలోకి వచ్చేశానన్నమాట! ‘ఏదో ఒకటి చెయ్యాలి’ అన్న తపన - ‘శి.రా’గారికీ, నాకూ కూడా ఎక్కువైంది. నవలల పోటీ రిజల్ట్సు వేయకుండానే, మళ్లీ నవలల పోటీ - ఈసారి వెయ్యి రూపాయల బహుమతి పెట్టి ప్రకటించాము.
‘ఒక్క సంగతి మర్చిపోకు’ అంటూ, సభాపతీ, పర్సనల్‌గా ఇక్కడ బెజవాడ నుంచి, (నా రూమ్మేట్) గోపాలం, పోర్ట్‌నోవో నుంచి తిరుమల వేంకటేశ్వర్లూ - పదేపదే జ్ఞాపకం చేశారు. ‘నువ్వు రచయితవి. ముఖ్యంగా నవలా రచయితవి. చివరకు మిగిలేవి, నీ నవలలే. తొలి మలుపు, రాతిమేడ, ఎదిగీ ఎదగని మనుషులు, పగా - ప్రేమా లాంటివన్నీ ‘వీను మిగిలిపోతున్నాయి’ అంటూ. ‘విడీవిడని చిక్కులు పూర్తి కాంగానే - నీ కొత్త నవల ఏమిటి?’ అభిమానుల సూటి ప్రశ్న అనుకో...
అటు వీక్లీ ‘పిచ్చి’ - ఇటు రచయితగా - ‘వట్టిపోతున్నానేమో?’నన్న బెంగ. ‘అడకత్తెరలో వక్క’ లాగా ఉంది నా పరిస్థితి. ఢిల్లీ నుంచి కృష్ణప్రియ - రచయిత్రి, డ్రస్ డిజైనర్, ఫ్యాషన్ మేకర్ - వగైరా ఓ మాడరన్ లేడీ రాస్తున్న ఉత్తరాలలో, ముఖ్యమైన వాక్యాలు హెచ్చరిస్తున్నట్లు జ్ఞాపకం వచ్చాయి.
ఆమె, ‘ఇక ముందు నేను దేశీ విదేశ అనుభవాలను కలిపి వారానికొక కథ రాసేస్తాను’ అంటూ, ఓ మాట కూడా రాసింది - ‘అన్నట్లు మీ ‘కాగితం పడవ’ (కథ) పదకొండుసార్లు చదివాను’ నాకు ‘సెంటిమెంటల్ ఫూల్’ అనే నిక్‌నేమ్ వున్న సంగతి తెలుసా? ‘మన్నాడే’ సంగీతమూ (పాట) వీరాజీ ‘వాడి బాణాల్లాంటి’ వాక్యాలూ - వాసిరెడ్డి సీతమ్మగారి నిప్పులాంటి నిజాల కథలు నన్ను కదిలించి, కలం పట్టేలాగా చేస్తాయి. మీ ‘కాగితం పడవ’ నన్ను గంట వరకు కన్నీరు కార్పించింది. అందుకే నేను మీ రచనలంటే పడి ‘్ఛస్తాను’. దాన్లో మెరుపులుండవు. కేవలం మరకల తాలూకా ఆలోచన్లుంటాయి’ - ఇలా సాగిందా ఉత్తరం.
‘కొండంత ఊహలకన్నా చిటికెడు అనుభవం కథలకి జీవం పోస్తుంది’ అంటారు. అతి చిన్న కథ ‘కాగితం పడవ’. కానీ, ఇవాళ్టికీ దాని ‘ఇంపాక్ట్’ ఉంది. నా కథల సంపుటి ఒకదానికి ఈ టైటిలే వాడాను. ఐతే, వృత్తీ ప్రవృత్తీ ఒకటే అయితే ఇబ్బందులు జర్నలిజమ్ భాషలో చెప్పాలీ అంటే - ‘అధిగమించాలి’! అదీ సవాల్...
నవ్వుకున్నాను. ‘విశ్వం’ హీరోగా విశ్వాంతరాళాలలోకి - విశ్వయాత్ర మొదలుపెట్టాను. దీన్ని సీరియలైజ్ చేయలేదు - ‘బాపూ’ చేత టైటిల్ బొమ్మ కూడా వేయించాడు రాధాకృష్ణగారు. ఆయనకీ నచ్చింది. కానీ, ‘తెర మీద - తెర వెనుక’ అనే సినిమా స్టార్‌ల - స్టార్ ఇంటర్‌వ్యూలు ప్లాన్ చేశాము. జీవితంలో - ప్రేమకు పగ్గాలున్నట్లే - ఉద్యోగంలో కోరికలకు ఎన్నో పగ్గాలుంటాయి. ఈ జీవితమే పదివేల పగ్గాల ‘పన్నాగం’ ‘జీనా చల్ నేకా నామ్ హై.. చలనమే ప్రగతికి వూతం కాదా? కదమ్ బఢాతే జావ్...
సచిత్ర వారపత్రికకి పాఠకులు రాసే ‘లేఖావళి’ ఒక గీటురాయి. ఒక ‘గాలికోడి’ లాంటిది. అలాగే ‘వనితావాణి’కి వచ్చే లెటర్స్ కూడా అవి ఉత్త ఖాళీ డబ్బాలు కావు. నిజంగా ‘వనితలవాణి’యే అది! పాఠకులు ‘విడీవిడని చిక్కులకు’ ఇచ్చిన ఆదరణ, తీర్పూ - నాకు మరొక సృజనాత్మక నవలను మొదలెట్టడానికి స్ఫూర్తిని ఇచ్చింది.
ఆగస్టు సంచికలో నవల పూర్తి అవగానే మద్రాసు ఆంధ్ర విద్యార్థి సంఘం వారు ఆఫీసుకు బృందంగా వచ్చి ‘లెటర్’ ఇచ్చారు. ‘మళ్లీ ఇంత చక్కటి సాంఘిక నవల చదివే భాగ్యం మళ్లీ ఎప్పటికి కలుగుతుందో? ఏమో?’నంటూ.
ఉత్తరాల దాడి - ప్రశంసాత్మకమైన ‘అక్షింతలు’ పడ్డాయి. ‘రాజ్యలక్ష్మి’ని ఏమి చేసినారు? ‘మీనాక్షి’ ఏమయినది? సూర్యం ఏమయినాడు?’ లాంటి విడీవిడని చిక్కులు - ఎనిగ్మాటిక్’ ముగింపు కావడం వల్ల దాని మీద చాలాకాలం చర్చ జరిగింది. ఈ నవలని ఎమ్.శేషాచలం అండ్ కంపెనీ - ఎమ్.ఎన్.రావుగారు - కొత్తగా ‘ఉద్యమం’గా మొదలెట్టిన ‘ఇంటింటి గ్రంథాలయానికి’ ఎంపిక చేసుకున్నారు. ఆ మాదిరి గ్రంథాలయోద్యమం ప్రపంచంలోనే కొత్తదేమో? ఐదు రూపాయలు నెలకి కడితే చాలు - వెంటనే ‘మీరు ఏరికోరుకునే మూడు పుస్తకాలు - ఉచితంగా, వాటితోపాటు ‘పుస్తక ప్రపంచం’ మాసపత్రికా ఇంటికి అందించే ఏర్పాటు చేశారు. అంతకు ముందు పుస్తక ప్రపంచం పత్రిక ద్వారా ‘ఎవరు పాపులర్ నవలా రచయితలు?’ అంటూ ఒక పాఠకుల సర్వే చేశారు. అందులో నుంచి రచయితల్ని ఎంపిక చేసుకున్నారు. అందులో నా పేరు ‘టాప్’ వరుసలోనే వచ్చింది. కోటలో పాగా పడ్డదన్నమాట!
ఎం.ఎన్.రావుగారు నిజంగా ‘బుక్ లవర్’ మాత్రమే కాదు - రచయితల పాలిట ఒక ‘వరం’ ఒక ‘కల్పవృక్షం’ కూడా. భానుమతి అత్తగారి కథలు, విడీవిడని చిక్కులు - ఈ స్కీమ్‌కి ఎంపికయినాయి. నా ‘నవల’ విషయంలో మా వాశిరాజు ప్రకాశం, సుంకు రామచెట్టి స్ట్రీట్‌లోని శేషాచలం కంపెనీకి వెళ్లడం, రావడం - ప్రూఫ్‌ల సంగతి చూడడం - అన్నీ ఎంతో మక్కువతో చేశాడు. కవర్‌పేజీ మామూలుగా అయితే ‘బాపు’కిస్తారు - వేయిస్తారు. కానీ ప్రకాశం తన ఫ్రెండ్ మనోహన్‌దత్ అనే ‘అంతర్జాతీయ ఖ్యాతిగల ‘యువ ఆర్టిస్టు వున్నాడు - అతనికిమ్మన్నాడు. రావుగారూ, నేనూ ‘సరే’ అన్నాము. సింపుల్ కవర్‌పేజీతో, ఈ నవల విడుదలవుతూనే అందరూ అందేసుకున్నారు. (సీరియల్‌గా అందరికీ జ్ఞాపకం ఉందిగా.) వేసిన వెంటనే విచిత్రంగా అమ్ముడుపోయిన నవల’ అంటూ, రావుగారే ప్రకటన వేశారు పుస్తక ప్రపంచంలో. అదో ‘రికార్డు’. ఆ రికార్డు, ఆ తర్వాత యద్దనపూడి సులోచనారాణీగారి ‘సెక్రటరీ’ వచ్చేదాకా బ్రేక్ అవలేదంటారు. నేను ఏదో సామెత చెప్పినట్లు నా ‘సర్క్యులేషన్’ ‘యావ’ - కీర్తి కండూతి అన్నా తప్పు లేదు - అట్లా కొట్టుకుపోసాగాను. ఇలాంటి వాటిలో.. ఆసక్తి లేదు.
అంచేత స్పేస్ సీరియల్ విషయంలో తటపటాయించాను. ‘సారు’ అటే మొగ్గు చూపించాడు. ఆయనకి స్పేస్ ఫిక్షన్ అంటే ఇష్టం. ఎనె్నన్ని స్పేస్ ఫిక్షన్ బుక్స్ చదివామో? అన్నీ ఆయనే పట్టుకొచ్చేవాడు. పైగా, నా ‘విశ్వం’ రోదసీ యాత్ర కథలో చిన్న ‘స్లిప్’ జరిగింది. దాన్ని సవరించడం తేలికైన పనే గానీ, నేను ‘హర్ట్’ అయిపోయాను.
ఓసారి జ్యేష్ఠ రాశాడో వుత్తరంలో - ‘గుండెకాయ తీసి అరచేతిలో పెట్టుకుని - ‘ఇదుగో.. రండి, గుండు సూదులు గ్రుచ్చండి’ అనే సెన్సిటివ్ బాపతు మీరు’ అని. ‘శి.రా’గారన్నారు - ‘అక్కడ గాలి లాంటి ద్రవం వున్నదనో, లేకపోతే సదరు గ్రహం ‘బ్రావో’ పేరు మీద, ‘బ్రేవ్‌కాప్టర్’ అనో మార్చేయండి’ అని.
కానీ, ‘సారీ, సర్! ‘తెర మీద - తెర వెనుక’ సినిమా ఇంటర్వ్యూల, శీర్షిక మనకి ‘ఫెచింగ్’ అన్నాను. మొదట అదే. అయితే ‘ప్రేమకు పగ్గాలు’ నవల వ్రాతప్రతి 18 భాగాలు పూర్తి చేసి, ఇంటి దగ్గర బెజవాడలో వుంది - ‘దాన్ని తెప్పించాలి’ అనుకున్నాము - అంటే మిగతా నవల పూర్తి చేయాలిగా!!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com