S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉప్పు పిండి తినలేక ఛస్తున్నాం..

ఇంటర్నెట్ రావఢానికి చాలాకాలం ముందు ఒక్క సినిమాయే- మూడు అక్షరాల తారకమంత్రం. ఊరు ఊరా నా పేరేనోయ్ చిన్నవాడా.. గోడ గోడా బొమ్మేనోయ్!.. నేను సిన్మా స్టారునోయ్ చిన్నవాడా! 63 ఫిబ్రవరిలో తెరమీద - తెర వెనుక శీర్షిక మొదలుపెట్టాము. దీనికి ముందు చాలా స్పీడ్ వర్క్ (సన్నాహక పని) చేశాము. ప్రేక్షకనాడిని బట్టి అక్కినేని, రంగారావు, రేలంగి, భానుమతి, అంజలీదేవి, జమున, కృష్ణకుమారి, సావిత్రి డైరెక్టర్స్‌లో ఆదుర్తి, సి.ఎస్ మొదలైనవారిని షార్ట్‌లిస్ట్ చేశాము. కాకపోతే మొట్టమొదటి ఆరు ఇంటర్వ్యూలు ఫొటోలు సహా పైపులైనులోకి తీసుకుని కానీ ఫీచర్ని వదలాలీ అనుకోలేదు. సస్పెన్స్‌లో తారలు కూడా ఎదురుచూడాలి- అదీ ప్లాను. క్లూ ఇచ్చి మాత్రమే ప్రకటనలు చేసాము తప్ప తారల పేర్లు గుప్తంగా వుంచాము. అదే టైములో నేను రాసిన సైకోలాజికల్ రొమాంటిక్ నవల ప్రేమకు పగ్గాలు కూడా వదలాలని నిర్ణయం, ఆ విధంగా ప్రత్యర్థి ‘ప్రభ’ని ఉక్కిరి బిక్కిరి చేసి కాసిన్ని ఎక్‌స్ట్రా కాపీలు అమ్మేసుకోవాలి.
ఆ రోజుల్లో ఉత్తరాలు- అలాగే వనితావాణి శీర్షికకి వచ్చే లెటర్స్ మాకు ప్రజల నాడిని పట్టి ఇచ్చేవి.. సీరియల్ ప్రధామైన బువ్వ కాగా దాని చుట్టూరా వుండే అన్ని శీర్షికలు నంజుళ్ళు. సినిమా స్పెషల్ స్వీటు.. పాఠకులు గొప్ప చతురులు- హాస్యపియులు కూడా.. ఓసారి కమలాదేవి సీరియల్ బంగారు బొమ్మలు అనుకుంటాను- ఏడవ భాగం బొమ్మనే కొనసాగిస్తూ- సీరియల్ లాగిస్తున్నాము. అందులో అందాల కథానాయిక ఇలా వొయ్యారంగా వొంగొని వడ్డన చేస్తూ వుంటుంది.. ఓ చదువరి - స్వామీ ఆ అమ్మాయి నడుము నొప్పితో చస్తుందేమో కాస్త నిలబెడుదురూ.. అంటూ రాశాడు. మగ దిక్కు అనే సీరియల్‌లో ఆమే ఎప్పుడూ అతను రాగానే ఉప్పుడు పిండి టిఫిను పెడుతూ వుంటుంది.. అయ్యా ఎడిటర్‌గారూ! కాస్త మెనూ మార్చండి, ఎప్పుడూ ఉప్పు పిండి తినలేక చస్తున్నాము.. ఇలా ఉండేవి లెటర్స్. కట్టలు గుట్టలుగా అందేవి వనితావాణి లేఖలు. భూమీద గల అన్ని అంశాలు చర్చకు వచ్చాయి. ఈ రెండూ దిక్సూచికలు.
‘ప్రేమకు - పగ్గాలు’ సీరియల్ నాది కూడా కొత్త సినిమా శీర్షికకి అదనంగా ఇచ్చాము. అందరికీ బాపు బొమ్మలే కావాలి- తను అదర్‌వైజ్ బిజీ.. నా సీరియల్ విడీవిడని చిక్కులకి కూడా బాపుబొమ్మలు నేనే టైం చాలక త్యాగం చేశాను.. అంతా బొమ్మలోనే ఉన్నదీ.. అన్న టైపు కాదు నేను. ప్రేమకిపగ్గాలు వేళకి అనుకోకుండా ఆర్టిస్టు గంగాధర్ ఆఫీసుకి వచ్చాడు. అతను, సత్యనారాయణ, రామారావులు కల్సి స.రా.గం.గా ఆర్టిస్టు వ్యవసాయం చేస్తున్నారు. వార్ పుటింగు మీద బొమ్మలు ఇస్తానన్నాడు గంగాధర్.. సెంటర్‌స్ప్రెడ్‌కి డిస్కస్ చేసాను- ప్రూఫులు ఇచ్చాను. బెజవాడ ఫ్లాట్‌ఫాం లెవెల్ సందడి వర్కవుట్ చెయ్యాలి. ఇందులోఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి కథే కాని సైకలాజికల్ ట్రీట్‌మెంట్ వుంది. మోడల్స్‌గా ఇద్దరు స్టార్స్‌ని కూడా సూచించాను. వాళ్ళు బ్రహ్మాండంగా బొమ్మలువేశారు- అదో పార్శ్వం.
అక్కినేని మాటకారి చమత్కారి రిపాటీలు ఇస్తాడు తీసుకుంటాడు అని విన్నాను. ఒకసారి మద్రాసు లా కాలేజీ స్టూడెంటు అసోసియేషన్ వారు - ఆంధ్రా చాంబరు చైర్మన్ జె.వి.సోమయాజులుగారిని స్టార్ అక్కినేని నాగేశ్వరరావుని వార్షికోత్సవానికి పిలిచారు. నన్ను ఆత్మీయంగా రమ్మన్నారు.. జెవీగారు మా నాన్నగారి ద్వారా ననె్నరుగుదురు. వారి ఆఫీసు 337లోనే మొదటి అంతస్తులో వుండేది. షేర్ బిజినెస్సు. నాన్నగారు షేర్స్ అకౌంటెంట్‌గా సండే నాడు అందులో పని చూసేవారు. మావాడు జర్నలిస్టు అంటూ మెట్లు దిగుతూ వుండగా పరిచయం చేసారు ఆయనకి. అట్లాగా.. ఆనాడు అక్కడ అక్కినేనికి వారే నన్ను పరిచయం చేశారు.
నేను ఇంటర్వ్యూకి వెళ్లినపుడు- నాగేశ్వరరావుగారు ‘‘ఓహో.. చంపేశారు పో.. మిమ్మల్ని ఎక్కడో చూశా’’ అంటూ గలగలా నవ్వేడు. నేను జంకుగా ఇంగ్లీషు అన్నా.. ‘మిమ్మల్ని చంపడం కష్టం- యూ ఆర్ ఏ స్టార్’ అన్నాను. ‘లా కాలేజీ పంక్షన్‌లో కలిశాము’ అంటూ జ్ఞాపకం చేశాను. అంతలో అక్కడే వున్నారు దాశరథిగారు. వీరాజీ ‘మాజాతి’ అంటే కవి...... అన్నారు (్థంక్ గాడ్). దాశరథి సారుకి నేను బాల అభిమానిని- ఉత్తరాల వీరుణ్ణి- ఆనక స్రవంతి పత్రికకి కంట్రీబ్యూటర్ని- హైబాదులో రచయితల అఖిల భారత మహాసభల్లో 61లో ఆయనని కలుసుకున్నాను. ఇంటర్వ్యూ సంభాషణల్ రూపంలో సాగింది. ఫొటోల వేలకి ప్రభాకర్- అవుట్‌డోర్ షూటింగ్‌లో వుండి రాలేదు.
ఎవరీ ప్రభాకర్? అవధరింపుడు. ఓ రోజు బిజీగా పనిలో నిమగ్నమై వుండగా- ఓ నల్లని నున్నని మొహం- పొట్టి ఉంగరాల జుట్టు గల కుర్రవాడు ఫొటోలు తెచ్చాను అంటూ ఫుల్ సైజు - షీలా, సంధ్య (ఆనక జయలలిత వాళ్ళ అమ్మ అయింది) కె.ఆర్.విజయ బొమ్మలు చూపెట్టాడు. ఇన్నర్ టైటిల్ పేజీలకి పేరుప్రఖ్యాతి లేని ఈ బొమ్మలు వద్దులే బాబూ అన్నాను- అసలు సంగతి- అతను డబుల్ రేటు చెప్పాడు. చాలా కోపంగా ‘సర్రు’మన్నాడు. తర్వాత రిపెంట్ అవుతారు ఈ అమ్మాయిల వెంట మీరూ (ప్రెస్) సినిమాల ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు- బెట్ అన్నాడు.
ఇతగాడేదో మన టైపులాగున్నాడు.. అనుకొన్నాను. ఓ ఐడియావచ్చింది.. మన కొత్త శీర్షికకి వై నాట్ దిస్ మ్యాన్?
స్టార్లు, తెలిసిన అసోసియేషన్ మెంబర్స్‌అయిన స్టిల్ ఫొటోగ్రాఫర్‌లకి మాత్రమే ఫోజులు ఇస్తారు- మిస్యూజ్ అవుతాయని భయం.. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కానీ మద్రాస్ పేవ్‌మెంట్లమీద పెద్దస్టార్స్ మొహాలకి మార్ఫింగు చేసి బూతు బొమ్మలు అమ్మడం మొదలైంది. స్వాతిశయము టాలెంట్ రెండూ వున్నవాడికి కీర్తి కండూతి కూడా వుండాలి. అతనికి తెలుగు రాదు నాకు మలయాళం రాదు- వేవ్ లెంగ్త్ కలిసింది... తారలు అంజలి, జమున, కెకె అంటే కృష్ణకుమారి, రేలంగి- అట్లాగే 1964లో ఎన్టీఆర్‌ల టాప్ ప్రైవేటు బొమ్మలు - ఇతనితోనే ఒక షూటింగ్ లెవెల్లోలాగించాను- (ఇవాళ నమ్మలేకపోతున్నాను నేనేనా? ఇదంతా చేశాను? అని అక్కినేనికి రూప (ఎస్సార్‌గారి ఫ్రెండ్స్‌కి తెలిసిన) ఫొటోగ్రాఫర్ తీశాడు. నో ‘కాస్ట్యూమ్’ చేంజ్.
మా రాధాకృష్ణగారికి ఈ ఫీచరుమీదు ఆసక్తి వచ్చింది. ఆయన తొలి ఇంటర్వ్యూమీద మనలో మాటలో ఇలా రాశారు. ఎన్నాళ్లనుండో ప్రారంభిస్తామని చెపుతూ వచ్చిన ‘తరమీద - తెర వెనుక’ మొదటి వ్యాసం ఈవారం వేస్తున్నాము. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రఖ్యాతి ప్రాచుర్యం గల వ్యక్తులు కొందరితోఇంటర్వ్యూలు జరిపి.. అయితే చిత్ర పరిశ్రమలోనివారికి తీరిక తక్కువే అయినప్పటికీ చాలామంది మా ప్రతినిధి శ్రీ వీరాజీతో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసుకున్నారు. మొట్టమొదటి ఇంటర్వ్యూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుతో జరిగింది. అది పూర్తికావడానికి ఆరు గంటలు పట్టింది. రాజన్నామలైపురంలోని వీరి ఇంటికి రెండు రోజులు - రెండు సార్లు వెళ్లవలసి వచ్చింది.. (వ్యాసాన్ని కూడా రెండు భాగాలుగా వేయవల్సి వచ్చింది).
అక్కినేని డబుల్ రోల్ చిత్రం- ఇద్దరు మిత్రులు- టెక్నికల్‌గాకూడా టాప్. నాలో ఇద్దరు మిత్రులు వున్నారు అన్నాడాయన చిత్రం పేరుమీద ‘పన్’కొడుతూ.. శతాధిక చిత్రాలతో రజతోత్సవ చిత్రాల హీరోగా టాప్ వున్న నటుడు- ఇండస్ట్రీలో బిజినెస్‌లో కూడా రాణిస్తాడన్నది.. తను రుజూచేశాడు. అప్పటికి హైదరాబాద్‌కి పోవడం స్టూడియో కట్టడం లాంటివి లేవు. ఏదో ‘పల్వరిజింగు’ ఫ్యాక్టరీ వున్నదిట.
ఆ నా ఇంటర్వ్యూని చాలాసార్లు వేర్వేరు పత్రికలూ వేసుకున్నారు. చలనచిత్ర వజ్రోత్సవాలలో కూడా గాజు పత్రిక (గ్లేజ్ పేపర్ మల్టీకలర్)లు ప్రత్యేకంగా వేశాయి. ఆనాటి ఇంటర్వ్యూలు త్రిప్పి ఇక్కడ వెయ్యడం భావ్యం కాదు- కకపోతే నేను ఎక్కువగా ఫొటోగ్రాఫర్ ప్రభాకర్‌తో కలిసి స్వేచ్ఛగా ఫొటోలు తీస్తూ జనరంజకంగా చేసి ఎంజాయ్ చేసినవి మాత్రం చెబుతాను- అచ్చులో వేయని కొన్ని కబుర్లు చెప్పాలి.. అప్పటికే సినిమా మొఘల్‌గా వాసికెక్కిన విజయవాహిని బి.నాగిరెడ్డిగారితో కొంత ఘర్షణ అక్కినేనికి వున్నది. అలాగే సావిత్రి మీదకూడా మనవాళ్ళకి ఒక ఫిర్యాదు వుండేది- గొప్ప నటి సావిత్రి- దక్షిణాది మీనాకుమారగా వాసికెక్కినది.. తన్మయంగా పాత్రలో లీనమై నటిస్తుంది- కట్ కట్ అన్నా కూడా మనలోకంలోకి రాకుండా ‘బంక లాగా’ అన్నవి అక్కినేని మాటలు.
‘కాకపోతే రెండో పెళ్లియే కావచ్చు- పోయి పోయి అరవవాడు.. ఆ ముట్టెపొగరు జెమినీ ‘బడ్డు’గాన్ని చేసుకున్నదెందుకు? సావిత్రి- అంటూ బాధపడ్డారు. మనవాళ్ళు లాంటి మాటలెన్నో ‘ఆఫ్ ద రికార్డు’ దొర్లాయి. మర్నాడు చివర్లో మన పితూరీల దాసుగారు వివియన్ (వి వి నరసింహారావు)గారు దిగడ్డాడు అక్కడికి. నాకు సెండాఫ్ ఇస్తూ అక్కినేని ‘ఆంధ్రపత్రిక మనదే.. జాగ్రత్తగా రాయి ‘జీ’ బాబూ’ అంటూ నవ్వుతూ వుంటే- ‘‘అదెట్టా సార్?’ అన్నాడు వివిఎన్. అక్కినేని భళ్ళు నవ్వుతూ- ‘తెలవదా? నాకు అందులో పావలా వాటా వున్నదిలే’ అంటూ నవ్వుతూ సాగనంపాడు నన్ను. ఈ పావలా వాటా అన్న మాట మోశాడు అయ్యవారిదగ్గరికి.
చెప్పానుగా.. వివియన్ని ఇంటిదారిలో దింపేసి అయ్యవారు ఇంటికి వెళ్లేవాడని- ఫ్రంటు సీట్లోనే కూర్చోపెట్టేవాడు- శంభుప్రసాద్‌గారు.. తన సరసన ఎవరిని కూర్చోనిచ్చేవాడు కాదు. ఈ అక్కినేని వాటా మాట ఆయనని ‘ప్రిక్’ చేసింది- ఆనక నన్నడిగారు.. అట్టాంటి మాటలు ఎంటర్‌టైన్ చెయ్యబాకండి.. అంటూ కోపగించుకున్నారు. నేను ఇప్పటికీ అక్కినేని చనువుగా స్వతంత్రంగా పత్రికమీద ప్రేమతోనే ఆ మాటలు అన్నాడు.. తప్ప నన్ను బాగా రాయకపోతే చూస్కో అని హెచ్చరిక ‘అది కానే కాదు’. కాని వివియన్‌గారు ఘటికుడు. నారదుడి టైపు- కాకపోతే నెగెటివ్.. బైదిబై ఇంటర్వ్యూ పడ్డాక అక్కినేనిగారు ఫో చేసి క్లాసుగావుంది.. నాలో ఇప్పుడు ముగ్గురు మిత్రులు వున్నారు. ఆ మూడోది ఎవరో మీకు తెలుసుగా?.. మీరే అంటూ మెచ్చుకున్నాడు. చివరిదాకా ఎక్కడ తటస్థపడ్డా.. తనే ముందు కులాసా అంటూ పలకరించేవాడు మన ఆల్ టైం హీరో మిత్రుడు... (ఎంతో వున్నది)
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com