స్మృతి లయలు
నటనకి పరిమళం జమున అందం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇన్ని వేల ఉత్తరాలు- ఇన్ని సంవత్సరాలు పెట్టెలలో గోతాలలో ఎలా దాక్కుని ఇంకా చదివేవిధంగా ఉన్నాయో? చూస్తే గుండె చెరువు ఐపోతోంది. చాలా లేఖలు రాసిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మనస్త్వత్వాన్ని - అయాచితంగా ప్రతిబింబిస్తాయి- అవి ‘సెల్ఫీలు ఇన్ లెటర్స్’ అనగా అక్షరాలలో. అవసర నైవేద్యాలు- ధధి ప్రయోగాలు కావు చిత్తశుద్ధిగల లెటర్స్.. నాకు వీటి సంఖ్యే ఎక్కువ. మద్రాసునుంచి బదిలీ అయి వస్తో వీటిని మాత్రమే హౌరా మెయిల్ మొదటి తరగతి పెట్టెలో అపురూపంగా పెట్టి కూడా తెచ్చుకున్నాను. ఆఫీసు లెటర్స్ మొదట క్లర్కు శాస్ర్తీగారు ఆనక క్లార్ల్ ప్రకాశరావులు ఫైల్ చేసుకోగా- నా పర్సనల్ (సెమీ పెర్సనల్) అన్నీ తెచ్చి రూమ్‌లో పడేసుకుంటే మా డాడి వాటిని ఐరన్ టేబుల్ సొరగుల్లో తోసేసేవారు. ఆనాడు విఐపి సూట్‌కేసులు గట్రా లేవు. చివరలో నేను ఏమి సామాను తెచ్చుకోలేదు. దానికి బిల్లు క్లెయిం చేయలేదు (శుద్ధ వెర్రినాగన్నని కదూ?). నాన్నగారు ‘నాతో తెస్తాలే నీ సామానులు’ అన్నారు. పుస్తకాలు గోతంలోకి ఎక్కించాను. నా బదిలీయాత్రదో చిత్ర గాధ. రైలు బోల్తాకొట్టింది- మున్ముందు మీరే చూస్తారు అది.
64 అక్టోబర్‌లో టి.నగర్‌లోని వివి గిరి రోడ్డులో వున్న గిరిగారి ఇంటినుంచి శ్రీమతి సరస్వతి గిరి గారినుంచి ఆహ్వానం- పి.మోహనరావు పేరిట వచ్చింది. గిరిగారి ఇంట సాయంకాలం కొంచెం మంది ఎంపిక అయిన ‘అతిథులు’కోసం యువ వీణా వాదన సంచలనం ముద్దా చిట్టిబాబు వీణ కచేరికి తప్పక రమ్మని. రాత్రి 8.30లోగా లేచి చక్కా ఇండ్లకు పోవచ్చును అని కూడా షరా వుంది. చిట్టిబాబు విఖ్యాత ఈమని శంకరశాస్ర్తీగారి ప్రియమైన అంతేవాసి. సరస్వతి గిరి గారు గిరి గారిలాగే పెద్ద పర్సనాలిటీ. బోలెడు కవిత్వం పద్యాల రూపంలో రాసిన మేడం- థాంక్స్ టు తెరమీద- తెర వెనుక శీర్షిక.. నన్ను అమిత వాత్సల్యంతో ఆదరించి బోలేడు ముద్దు చేశారు. గిరిగారు ఉపరాష్టప్రతి ఆనక రాష్టప్రతి గాక మునుపే నేను నా చిన్నతనంలో వైజాగ్‌లో చూశాను వీరి భారీ విగ్రహం. దంపతులు ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వైజాగ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్‌కి కూడా అధ్యక్షులట ఆయన. మా పెద్ద మేనమామ పూడిపెద్ది సూర్యనారాయణ ఉరఫ్ పివియస్ నారాయణ జనరల్ సెక్రటరీట. గిరిగారెప్పుడూ లేబర్ లీడరే.. ఆనక లేబర్ మంత్రి. అప్పుడు వైస్‌ప్రెసిడెంట్ ఆనక ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ కదా. చిట్టిబాబు మనిషి ఎర్రగా బుర్రగా డెలికేట్‌గా వుండి ఓ గంటసేపు ఉర్రూతలు ఊగించాడు. చిన్న బిట్ న్యూస్ వీక్లీలో వేశాము. సందర్భశాత్తు చిట్టిబాబు కజిన్ సిస్టర్ ఆంధ్రపత్రిక సర్క్యులేషన్ డిపార్టుమెంటుకి చెందిన శ్రీమతి వనజాక్షి- అక్కడకి వచ్చింది. ఆమె చిట్టిబాబుకి నా గురించి తెగ చెప్పింది. తను ఆ చిన్న బిట్ పడ్డందుకే మురిసిపోయాడు. ఎక్కడ తడస్థపడ్డా బాగా టాప్‌లోకి వెళ్లిన తరువాత కూడా పలకరించేవాడు. క్రమేపి అంతటి గురువుకి సాటి ఐన మేటి వైనికుడైనాక బెజవాడ- క్షేత్రయ్య కళామండపంలో భారీ కచేరికి నేను, నండూరి- అప్పుడు మరో మీటింగుకి కాబోలు వచ్చిన సినారె- అంతా ముందువరుసలో కూర్చుని ఎంజాయ్ చేసాము. నండూరివారు కనపడని జోకులు వేస్తాడు. ఆ సంగతి చూడండి- ఆ గమకం (నాకు సదరు జ్ఞానం హుళక్కి) అంటూ పెద్దలు కొందరు వహ్వాలు కొడుతూవుంటే - నండూరివారు ‘మందు’హాసం చేస్తున్నాడు బాగుంది కదూ.. అని సినారె మీదుగా వాలి నా చెవికొరికారు. తూలుతున్నాడేమో? చిట్టిబాబు..ఎంతటి జీనియస్కైనా వ్యసనం కార్చిచ్చు పెట్టేస్తుంది కదా’’ అని నీరుకారిపోయాను. సరే మళ్లీ వెనక్కి వెడదాము.. నాడు రాధాకృష్ణగారు నవ్వి నవ్వి ఇరుక్కుపోయారా అంటూ సరస్వతిగారి పొయెట్రీ వెయ్యండీ మీ ఇష్టం అన్నాడు. ఉత్తరాల శీర్షికలో వరుసగా వేశామనుకోండి- శ్రీమతి గిరిగారు దొడ్డమనిషి. వారి ఇంట ఏ గెట్ టుగెదర్ పెట్టినా నేను మస్టూ. కాని నాకే అవి చాలా బోరుగా వుండేది. తరువాత చిట్టిబాబుకి మద్రాసులో ఘనసత్కారం శ్రీ రాజమన్నార్ అధ్యక్షతన జరిగింది. పుష్పగిరి శంకరాచార్యులవారు- వైణిక సార్వభౌమ అన్న బిరుదుతో- 1116 నగదుతో సత్కరించి అతను కలైకొట్టె అన్న తమిళ చిత్రంలో వాయించిన వీణను కూడా బహూకరించారు. అద్భుతమైన కచేరి చేసే ముందు చిట్టిబాబు ఆంధ్రపత్రిక (వీక్లీ)కి జేజేలు చెప్పడం గొప్ప సంగతి. సరిగ్గా ఊపు అందుకున్న వేళ న్యూస్‌ప్రింటు కొరత వచ్చిపడ్డది. మనలో మాటలోనే రాసేశాడు ఎస్సార్గారు.
గిరిగారు అల్లుడు సూర్యారావుగారు ఆంధ్రా సిమెంట్స్ మానేజరు. వారి సతీమణి సరళ నాన్నగారికి ఫ్రెండు. వాళ్ళిద్దరూ ఎర్ల్ స్టేన్లీ గార్డ్నర్ ఫాన్స్. తను ఎన్నో పాకెట్ బుక్స్ చదివాక- అబ్బాయికి ఇవ్వండి అని ఆయనకీ ఇచ్చేసేది. నాన్నగారు గాడ్డమ్ స్త్ఫ్పు చదివేవారు. ఆల్డస్ హక్లీని చదివేవారు. పెర్రీ మసన్ ది లాయర్ అంటే క్రేజు. వాళ్ళ ఆఫీసు వౌంట్ రోడ్‌కి పోకముందు నేను ప్రొద్దునే్న ఆనందవాణికి చెక్కేసేవాణ్ని. సూర్యారావుగారు ఇక్కడికే వచ్చేవారు. తర్వాత అకౌంటెంట్ గారే వౌంట్ రోడ్‌కి వెళ్ళేవారు. నాన్నగారు మావాడు ఉంటున్నాడు నాతో అని హెడ్డ్ఫాసుకి రాసేసారు.
మద్ది సుబ్బారావు చెప్పాను నాన్నగారి దగ్గరికి వచ్చినపుడల్లా- జమున గురించి అడిగేవాడు. మార్చి నెల అరవై మూడులో సత్యభామ - భామాకలాపంలో దిగినట్టు- జమునను పాఠకులకు అపురూపమైన ప్రైవేటు బొమ్మలతో ఇచ్చాము- నిస్సందేహంగా మోస్ట్ గ్లామరస్ స్టార్ ఆఫ్ ది ఇయర్. నాకు తెలుసు ఎంతోమంది విద్యావంతులు ఆమె అంటే పడి.. అని.. ఆరోజుల్లో ఈ తెరమీద ఇంటర్వ్యూలను మధ్యపేజీలలో మొదలుపెట్టాము. దేశంలో (ఆంధ్రలో తెలంగాణ సీడెడ్ ప్రాంతాలలో) కిళ్లీకొట్లవాళ్లు- ముఖచిత్రం ముడిచేసి స్టాల్స్‌లో వ్రేలాడదీసేవాళ్లని- మాకు ఫీడ్ బ్యాక్.. జమునకి ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నాయి. ఆ ఇండ్లలో రేడియోగ్రాములు- సోఫాలు బీరువాలు అంటూ రాయడానికి నేనెందుకు, జమున కేవలం తన అపార అందం మాత్రమే పెట్టుబడిగాగాక నటిగా పాత్రకి అనుగుణంగా ఎంత మారిపోతుంది అనేది డిస్కషన్స్ చేశాను. ఆమెకి హాలీవుడ్ స్టార్ లక్షణాలు చాలా వున్నాయి. ఆమె హాబీలలో కుక్కలు ముఖ్యం. అయినా వాటిని కట్టేసి సత్యనారాయణ వ్రతం మొదలు అనేక నోములు కూడా నోస్తుంది. బొమ్మలకొలువు పెడుతుంది. ఇన్ని కుక్కలు? బాబోయ్? వీటికి అన్నింటికి పెట్టిన పేర్లు మీకెలాగ జ్ఞాపకం వుంటయ్- నా ప్రశ్నకి మొహం నిండా నవ్వుతూ డజనుకిపైగా బొచ్చుకుక్కల్ని చూసుకొని మురిసిపోతూ- అదో దాని పేరు బ్లాకీ, వీడి పేరు వైటీ (మగది కాబోలు) అంటూ ఆ ముందు పెట్ రమణ ఇది జ్యోతి.. నాకు డాగ్స్ అంటే ఎలర్జీ లేదా ఫోబియా వుంది.. అమ్మయ్యా కట్టేయించింది. లోగడ ఓ పిల్లి పిల్లని, ఓ రెండు లవ్బర్డ్స్ని కూడా పెంచింది. పిట్టల్ని పిల్లులు తినును జాగ్రత్త అన్నాను. అతి శ్రావ్యమైన కంఠంతో నా దగ్గర రెండు లేడి పిల్లలు కూడా ఉండేవి.. వీరాజీగారూ.. నవ్వాను.. ఓ పులి పిల్లని కూడా.. అని నేను అనేలోగానే ఆ కోరికా వుండేది అన్నది. అప్పుడు ఆమెకి బొంబాయి ఫీల్డులో భలే ఛాన్సులు తగిలేవి. అక్కడో ఇల్లు కట్టాలని ఉందా? అడిగాను- ఆ కబుర్లలోకి లాగాలి కదా?.. లేదు కాని ఓ సినిమా హాలు కడితే బాగుణ్ణు అనిపిస్తుంది- ‘ఎక్కడ మద్రాస్లోనా?’ ‘ఉహున్... ఆంధ్రాలో.. బెటర్ మీ వూరు దుగ్గిరాలలో అన్నాను.
స్నిగ్ధ మోహన రూపసి జమున నిప్పాణి. అదో అట్లా ఓ ఫొటో తలుపు తెర ఇలా లాగుతూ టక్కున ఇటు చూసే ఫోజు- ఇలా వేర్వేరు ఫోజులు తీసుకుంటూనే హిందీ ఫీల్డ్ గురించి అడిగాను. మొహం ఇలా అయిష్టంగా పెట్టేది. ‘అబ్బే’ అక్కడ ప్రెస్‌కి ఇక్కడ మన పత్రికలవాళ్లకి పోలిక లేదు అన్నది. స్టార్స్‌తో ప్రాబ్లెం? అడిగాను- లేదు మీనాకుమారి, మాలాసిన్హా ఎంతో ఇదిగా పలకరించారు. మాలాసిన్హా అయితే నన్ను ముద్దేసుకుంది కూడా అన్నది. సమస్య ఫిలిం పత్రికలవాళ్ళే ముందే పబ్లిసిటీ ఇవ్వడానికి బేరాలు పెట్టేస్తారు. (తన్ని ఒక పెద్ద పత్రిక ఎంత అడిగిందో ఆఫ్ ద రికార్డు చెప్పింది- ఇక తోటి తారలు అనగా పురుషులు- అతి చనువు తీసుకుంటారు.
సరే జమునగారిల్లు చాలా పెద్దది. రకరకాల కాలింగ్ బెల్స్ అమర్చివున్నాయి ఇంట్లో- ఇవన్నీ కోడ్బెల్స్. ఓ బెల్ కొడితే ఓ పనివాడు, మరో బెల్ రెండుసార్లు కొడితే ఇంకో వంటావిడ- ఇలా పరిచారికలకు కోడ్బెల్స్. మా గోపి నుంచి మా ఇంటి మహాలక్ష్మి వరకూ, చిరంజీవులనుంచి గుండమ్మకథ దాకా ఆమెదో జైత్రయాత్ర. ముచ్చటగా ఆల్చిప్పలంత కన్నులున్న ఈ సుదతీమణికి చిలిపివేషాలు వెయ్యగల సత్తా ఉంది. నిండు మాతృమూర్తిగా అందరి మన్ననా పొందే టాలెంటు వుంది. ముందునున్న అలీషాన్ ఇంటి వెనుక ఇంచుమించు అదే నమూనాలో మరో ఇల్లు ఉండడం జమున అంతస్తుకు అభిరుచికి తార్కాణం. ఆనాడు రకరకాల వడియాలు అప్పడాలు పచ్చళ్ళతో చేసిన షడ్రసోపేతమైన విందు వొహోమని వుంది. మరుపుకి రాని అలనాటి అందాల మహా తెలుగు నటి జమున
(ఇంకా బోలెడుంది)