స్మృతి లయలు

భానుమతి పంతం: రమణారెడ్డి నిద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యవ్వనం ఝరీవేగతుల్యము.. అన్నాడు. బాగానే ఉంది కానీ జీవితం బుద్బుధ ప్రాయం అని కూడా చెప్పాడు విష్ణుశర్మగారు - అంటే నీటిబుడగలో పంచవర్ణ సమ్మేళనం.. కానీ, నా యవ్వనం స్పీడ్ మద్రాస్ రాడానికి ముందే, వైజాగ్ - డాల్ఫిన్స్ నోస్ - దానికో స్పీడ్ బ్రేకర్ అయింది. ఉషారును మద్రాస్‌లో వీక్లీకి నిత్య నైవేద్యం - సదా నూతనం చెయ్యాలని తపన చెందుతున్న దశలో పెద్దరికం చిత్రంగా మీద పడ్డది. అటు సినిమా స్టార్లతో భావోద్రేక భరితమైన ఇంటర్వ్యూలు చేస్తూ, మరో ప్రక్కన ప్రక్క ప్రేమకు పగ్గాలు సీరియల్ కొనసాగించడం - ద్విపాత్రాభినయం లాంటిదే అయ్యింది. అయినా పగ్గాలు ప్రేమకి ఉంటాయా? అని ఈ కాలం పిల్లకాయలు ఆశ్చర్యపోవచ్చును గానీ ఈ నవల ఆ మాటకి భాష్యం చెప్పింది అన్నారు పెద్దలు. సినిమా అగ్రతారల హృదయాలను కూడా సున్నితంగా తడమడం - నాకు నా గుండెల నిండా నిండిన కన్నీళ్లు పన్నీరుగా అనిపించాయి - నవల నవంబర్ ’63 నెలాఖరుకి పూర్తయింది. ఉత్తరాల దాడి మొదలైంది. (పాత వీక్లీస్ తిరగేస్తున్నాను ఇది రాస్తున్నప్పుడు) బరోడా నుంచి అరవింద్ ఆర్ఫరీఖ్, వై.విజయకుమార్ బెల్గాం నుంచి రాసిన ఉత్తరాలు టిపికల్. సెలక్షన్‌లో ఎస్సార్‌గారు (ఒక్కోసారి ఇద్దరం కూర్చుని) వేర్వేరు ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ చేసేవాడు. బాలెన్స్‌డ్‌గా ఒక అంశం మీది లెటర్స్‌ని - దాని మీది స్పందనకి దామాషాతో నియంత్రించి - తదనుగుణంగా వేసేవాళ్లం.. మనమీద మనం అంటే మా ఫీచర్లు మీద కన్నా తతిమ్మా వాళ్ల ‘మీద’ లెటర్స్ పడాలి అన్నదో సూక్తి. ‘వీడెవడో మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నాడు’ ఈ లెటర్ వద్దు - సెల్ఫ్ డబ్బా అనుకుంటారు అంటూ రాధాకృష్ణగారు ఇలా చెయ్యి బల్ల క్రిందికి జొనిపి కొన్ని బుట్ట దాఖలు చేసేవాడు.
నేను సచిత్ర ఇంటర్వ్యూలకి జమున, జగ్గయ్య, కాంతారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, అంజలి, రాజసులోచన, గుమ్మడి అట్లాగే, ఆదుర్తి, ప్రత్యగాత్మ, సిఎస్ రావు, చక్రపాణి దుక్కిపాటి, మొదలైన టాప్ ఆర్డర్ వాళ్లని - ముఖాముఖి కలిసినప్పుడు - అన్నీ మధుర స్మృతులే అనుకోడం పొరపాటు - కొన్ని చెడు అనుభవాలు కూడా లేకపోలేదు. నందమూరి తారక రామారావుతో ‘ఫేస్ టు ఫేస్’ - విడిగా ’64లో చేశాను - అదో, అద్భుతం - దాని కథ ఆనక. ఈ తారలకు వాళ్ల ఫీచర్ పడ్డ వారపత్రికని ఆరేసి కాపీలు పంపించేవాళ్లం. అది సరే, లెటర్స్ అసలైన ఫీడ్‌బ్యాక్ - సినిమా వాళ్లు ఫాన్‌మెయిల్ అనేదాన్నీ మనం రీడర్స్ లెటర్స్ అనీ అంటాము - ఈ వారంతో ప్రేమకి పగ్గాలు అయిపోయింది అంటే - ఏంటో విచారంగా ఉంది ఇంతటి రసవత్తరమైన కథ మరో ఐదారు వారాలపాటు నడుస్తుంది అని.. ఆఖరు భాగంలో వీరాజీగారు కరుణ రసం వుట్టిపడేలాగా వ్రాశారు (తన) పిన్ని చావుకు భాస్కరం పడిన బాధ దానిని వర్ణించిన విధానం నన్ను ఏడిపించినంత పని చేసింది - ఆఖరు భాగంలో కథ చాలా జోరుగా పోతుంది.. ఇలా బరోడా లేఖ సాగితే - బెల్గాం లెటర్‌లో కూడా కథ అయిపోయింది అనంగానే నాలో ఏదో ఒక అసంతృప్తి బయలుదేరింది. (లేఖకునికి) ప్రేమకు పగ్గాలు చివరి వరకు చాలా సహజంగా వాస్తవికంగా ఉంది కానీ చివరిలో కథను కట్ చేసినట్టుగా ఒక్కసారిగా ముగించి వేశారు.. సుజాతకు అన్యాయం చేశారు. కానీ, నేరుగా మన తారలు చెప్పారు (ఆనాడు అందరికీ కావాలి వీక్లీ; ఇంకో దృశ్య శ్రవణ ప్రక్రియ పోటీ ఏదీ?) గుమ్మడిగారు ఓసారి నాలుగు పేజీల లెటర్ రాస్తూ ఎనాలసిస్ పంపాడు. హైదరాబాద్ షూటింగ్‌కి పోతూ ఫ్లైట్‌లో రాశానంటూ..
కృష్ణకుమారి గారన్నది - మీ నవలలో- నాకు పద్మావతి అంటే ఇష్టం.. ఆ ‘పాత్ర’కి నా కాల్షీట్స్ రెడీ - కానీ జమునగారికి - సురేఖ పాత్ర ఇష్టం.. ఇలా ఎన్నో.. ప్రొడ్యూసర్స్ ఏరీ? ఈ కథ ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి కథే గానీ.. మధ్యలో మరి రెండు పాత్రలున్నాయి. పిన్నిగారు: హీరో సవతి తల్లి - ధనమ్మగారు: పద్మావతి పెంపుడు తల్లి.. భానుమతిగారికి ఈ పిన్ని పాత్ర బాగున్నదిట.. మాకు ధర్మారావు అని విశాఖ ప్రాంతానికి చెందినతను సినిమా రిపోర్టరున్నాడు. కొత్త, బిడియం, వినయం, కొంత భయం ఎట్సెట్రా కలవాడు.. ఇతనే నేరుగా టెలిఫోన్ లేని కారణం చేత - మాకు ‘కమ్యూనికేట్’ (సంభాషణా స్వీకార ప్రసార కార్యకర్త) అసలు భానుమతితో తెర మీద - తెర వెనుక ముగించాలి ఒక హైలైట్‌గా అనుకున్నాను.
మా ధర్మారావు ఇంకా ముదురుకేసుగాడు - సార్! నా పేరు ధర్మాజీ అని పెట్టండి అంటూ గునిసి గునిసి ఓకే చేయించుకున్నవాడు. ముందుకి వెళ్లటానికి - ముందుగా కొంచెం ప్రేమకు పగ్గాలు కథ సూచిస్తాను మీ సౌలభ్యం కోసం నాటి వీక్లీలోని జరిగిన కథ నుంచి కోట్ చేస్తాను ఇక్కడ.
‘వాల్తేరులో ఎం.ఏ.కి అప్లికేషన్ పెట్టి వస్తున్న పద్మావతిని చూడాలని భాస్కరం బెజవాడ స్టేషన్‌కి పోతాడు. తన క్లాస్‌మేట్ సురేఖని పద్మ భాస్కర్‌కి పరిచయం చేస్తుంది. భాస్కరం సవతి తల్లి జానకమ్మకి భాస్కరం అంటే ప్రాణం. కానీ కూతురు వసంతి పెళ్లి చెయ్యాలని ఆమె ఆరాటం. ఈలోగా అన్న భాస్కరం పెళ్లి చేసెయ్యాలని పిన్ని పంతం. భాస్కరాన్ని పెళ్లిచూపులకు వొప్పించి తీసుకుపోతుంది జానకమ్మ. సురేఖయే పెళ్లికూతురు అని చూసి నివ్వెరపోతాడు భాస్కరం. అతను నిజంగా పద్మావతిని ప్రేమించడం లేదేమో? సురేఖ సందేహం. సురేఖ పెంపుడు తల్లి ధనమ్మ నిజంగా ధనమ్మ. భాస్కరం అల్లుడుగా కావాలి ఆమెకి. పైగా ముకుందరావు ద్వారా ఆమె వసంతికి సంబంధం తెస్తుంది. లోపాయకారి ఒప్పందం అన్నమాట.’
ఇందులో వేయివిధాల సాగే పాత్రల యొక్క మనస్తత్వ విశే్లషణ ముఖ్యం. రసవత్తరంగా సాగే డ్రామాలో ధనమ్మగారు జానకమ్మ ప్లస్ ఈ ముగ్గురు ప్రేమికులు - ముఖ్యపాత్రలు. నేను ఎవరినీ రోల్ మోడల్స్ ఫీలై రాయలేదు. కానీ భానుమతికి జానకమ్మ అంటే ఇష్టంట. జమునకి రెండు జడల సురేఖ మీద మోజు. అయితే భానుమతికి - తాను ధరించబోయే పాత్రలు తెర మీదనైనా మరణించకూడదు. ధర్మారావుకి ఆమె అదే చెప్పిందట. మనసు విరిగిపోయింది అని అన్నట్లు చెప్పాడు ధర్మాజీ. నేను ఎవరితోనూ ఏ విధంగా ‘పర్స్‌యూ’ లేదా చర్చ చెయ్యలేదు ఈ విషయాలు. సారీ - పొగరు కాదు కాదు బిజీగా వున్నాను. కానీ సభాపతి అన్నాడు - అక్కినేని సరిపోతాడు హీరోగా అని. భానుమతికి అధికారికంగానే - మా ప్రతినిధి ధర్మాజీ చేత లెటర్ పంపాను. ఆమె ఫోన్ మీదికి వచ్చింది. ఒక షరతు అన్నది మీకు ఇంటర్వ్యూ కావాలీ అంటే - ముందుగా ప్రొడ్యూసర్ డైరెక్టర్లలో మా సారు రామకృష్ణ గారున్నారా? చెప్పింది అన్నది. నసిగాను - ‘నెక్స్ట్’ టీములో ఆయన ఉంటారు.
‘ఈసారి ఎవరు వున్నారు?’ అడిగింది.. ‘చెప్పను’ అనబోయి - భానుమతికి బాల్యం నుంచి (నా బాల్యం) వీరాభిమానిని గనుక - అలా అనలేక పేర్లు ఏకరువు పెట్టాను - సరే మా వారు ఈ లిస్టుకూ తగుదురు కనుక నేను ముందు ఆయన ఇంటర్వ్యూ వెయ్యాలని అన్నాను అని చెప్పండి మీ ఎడిటర్‌కి అన్నది. నాకు మండిపోయింది. బెదిరింపా? ఇది?.. ముందు మీ ఇంటర్వ్యూ రికార్డు చేస్తాము ఆనక.. అపాయింట్‌మెంట్ డేట్ ప్లీజ్.. అన్నాను.
ఇద్దరిలో ఎవరి ప్రశ్న వారిదే. ‘ఎవడో బెల్ కొట్టేసి చస్తున్నాడు - అప్పరం పార్కాలం’ అన్నదామె. ‘యూ ఆర్ వెల్‌కమ్ ఎనీ టైం మేడమ్’
ఫోన్ కట్.
తన ‘టిట్’ తనది నా ‘టాట్’ నాది.. టిట్ ఫర్ టాట్ అయింది ఐ మిస్డ్ హర్.. అండ్ షీ మిస్డ్ ద వీక్లీ ఫీచర్ - అప్పటికి.. కాకపోతే, ఆమె కథలు, నా నవల విడీవిడని చిక్కులు కూడా ఎంఎన్ రావుగారి (ఎమెస్కో) ఇంటింటి గ్రంథాలయం స్కీములో జమిలిగా ఫస్ట్‌లోనే వున్నాయి కనుక - మా సంబంధాల ఆరోగ్యం చెదరలేదు. బెజవాడ వెళ్లాక మీటింగ్‌లో సరదాగా ఎన్నోసార్లు కలిశాము. ఆమె ఆమెయే..
నిజానికి ఆదుర్తిగారు గొప్ప వెంచర్ మొదలెట్టాడప్పుడు - సీనియర్ - పుల్లయ్యగారి లాగే జీనియస్. ఆదుర్తిగారు, తేనెమనసులు అని ఓ కలర్ చిత్రం. అందరూ సరికొత్త నటులతో - ముళ్లపూడి మాటలతో చిత్రం తీస్తున్నాడప్పుడు. కృష్ణ, కొత్త బాలుడప్పుడు. ఇప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ ‘ది వెటరన్ సెలబ్రిటీ’కి అది అరంగేట్రం. ఆదుర్తి సుబ్బారావు గారు ఎప్పుడూ తన భుజం మీద లేదా మెడ చుట్టూరా.. ఓ నాప్కిన్ ఇలా వేసుకుని వస్తాడని అది ఆయన షూటింగ్ డ్రెస్‌లో భాగమని అందరి తెలుసు. చివరిదాకా సమావేశంలో వదలలేదు. తన ఇంటర్వ్యూ చేయడాన్ని ఎంజాయ్ చేశాము. అక్కడ వున్నవాళ్లు ఆనందించారు. 1955లో అమర సందేశంతో సెట్స్‌కి ఎక్కిన ఆదుర్తి - ‘కట్ కట్’ అంటూ దర్శకత్వం వహించిన చిత్రాలలో ముఖ్యంగా తోటికోడళ్లు - ఒక శిఖరం - తెలుగు బాక్సాఫీసు చరిత్రలో ఒక మైలురాయి. తేనెమనసులు ఒక గీటురాయి. ఆయన అన్నాడు ‘పాటలు వుండాలి సినిమాలకి అవే ప్రాణం’ అని. సుబ్బారావుగారు - సావిత్రి గురించి - చెబుతూ తన మొహం మీద కెమెరా పడకపోతే టచ్‌అప్’ అడిగేది కాదు అని తనకి షాట్ టేకింగ్ వాల్యూస్ బాగా తెలుసునని ఆమెకు కితాబు ఇచ్చాడు. మూగ మనసులు లాంటి హిట్ రాలేదు - తేనె మనసులు రిలీజ్ కాగానే - అందులోని కొత్త నటులు కృష్ణ, రామ్మోహన్, సంధ్య మొదలైన వారిని పట్టుకుని ప్రెస్‌కి పరిచయం చేస్తూ ఎంతో హుషారుగా యంగ్ కన్నా యంగ్‌గా ప్రొద్దుటే - మోడరన్ కేఫ్ బెజవాడలో గడిపాడాయన. ఒక బాక్సాఫీస్ ఫార్ములా అతని దగ్గర వుండేది - సియస్ రావుకి ‘లవకుశ’కన్నా పెద్ద క్రెడిట్ ఏమి కావాలి? గట్టి పొట్టివాడు మన లిస్టులో రమణారెడ్డి కూడా ఉన్నాడు’ ఆర్నబండపడా అంటూ నెల్లూరు యాసకి వెండితెర మీద బంగారు పట్టం కట్టినవాడని, అతన్ని ఎంపిక చేసాము కానీ, అపాయింట్‌మెంట్ ఇచ్చి తీరా వెళ్లిన తరువాత - అరగంట కూర్చోబెట్టాడు - నేను మేజిక్ చేస్తాను అదీ మీకు చూపిస్తాను అన్నవాడు ఎప్పటికీ బయటికి రాలేదు - మాయం.. గాయబ్.. అతని సెక్రటరీ నిద్రోతున్నారండీ అన్నాడోసారి. మరోసారి వచ్చి షూటింగులో వున్నారు - ఇంకోసారి చూద్దాం అన్నాడు.
సారీ! ఆంధ్రపత్రిక మరోసారి రాదుట - ఒకసారి వస్తుందిట గుడ్‌బై అన్నాను. తరువాత సారీ చెబుతూ - ఎన్నోసార్లు ధర్మారావుతో కబురు పెట్టినా - ‘గుడ్‌బై’ చాప్టర్ క్లోస్డ్’ అన్నాను. పద్మనాభం రేలంగి తరువాత చెప్పదగిన వైవిధ్యంగల అనుభవం గల నటుడు - ప్రొడ్యూసర్ కూడా. కానీ తెర మీద - తెర వెనుక ఫీచరు ఎత్తేశాము. అదీ సంగతి.
(ఇంకా బోలెడుంది)