S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉత్తమ నటనకి అసలు పేరు.. సావిత్రి

ఫందొమ్మిది వందల 63, మే నెలలో ఆంధ్రపత్రిక ‘వీక్లీ’లో పడ్డ తెరమీద- తెరవెనుక శీర్షికకి సావిత్రిని యింటర్వ్యూ చేసినప్పుడు ఆమె మిగతా అందరి తెలుగు టాప్ స్టార్స్‌కన్నా ‘యమబిజీ’గా వున్నది. ఒకసారి ఫోన్ చేస్తే‘బొంబాయి వెళ్ళారండీ!’ అన్నారు. మరొకసారి ప్రయత్నం చేస్తే ‘‘హైదరాబాదులో వున్నాద’’న్నారు. సరే, ఈ స్పెషల్ ఫీచర్ ‘‘ఎక్స్‌క్యూజివ్’’... ప్రయివేటు- చిత్రాలతో మన వీక్లీలో అచ్చుఅవుతున్నప్పుడు కూడా ఆవిడ ఢిల్లీలో ఉన్నది. ఇక్కడ నేను చేసుకుంటున్న జ్ఞాపకాలు, రాస్తున్న సావిత్రి వ్యాపకాలు అలనాటివే ఎక్కువ భాగం ఆ రెండు వారాల నా అన్ని సచిత్ర శీర్షికనుంచి ఎత్తిరాస్తున్నాను యిప్పుడు.
ఇవాళ సావిత్రి గురించి తెలియని తెలుగువారు ఉండరు. (ప్రేక్షకులు). సొంతంగా రుూ మహానటి మీద అభిప్రాయం ఏర్పరచుకునే వుంటారెందరూ... అప్పుడామె మూడు రకాలుగా ‘‘బిజీ’’వుంది. తమిళ చలనచిత్ర రంగంలో సావిత్రి గణేషన్‌గా ‘‘టాప్’’, తెలుగులో సరేసరి, మూడో పాత్ర? నిజ జీవితంలో ‘‘కాదళ్ మన్నన్’’గా (మన్మధుడు అని అర్ధంట) వాసికెక్కిన జెమినీ గణేషన్ సతీమణిగా, ఇల్లాలుగా అంత బిజీగావున్న ఆమెని నేను పలకరించినప్పుడు ‘‘నిబ్బరం’’గా వుంది. తానే హాల్లోకి వచ్చి తొంగి చూసి ‘‘ఇదో వచ్చేస్తున్నానిప్పుడే ‘‘ఉక్కారుంగో’’అని అని నాలిక కరుచుకుని ‘‘వచ్చేస్తానిప్పుడే...’’అన్నది తెలుగులో. పదహారణాల నవ్వు నవ్వి. జెమినీ గణేషన్ సావిత్రిగారల గారాల పట్టి చాముండేశ్వరికి అప్పుడారేళ్ళు కాబోలు. ‘‘అది బళ్ళోకి వెళ్లింది’’ అన్నది. అంటే రుూ ఇంటర్‌వ్యూలో ‘‘మారాం’’చేయదు అన్న హామీ అన్నమాట.
శోభాయమానంగా అలంకరించి వున్న ‘‘ఇల్లు’’-అవతల చిన్ని ఉద్యానవనం పలకరిస్తున్నది. ‘‘తీరికవేళల్లో ఏంచేస్తారు?’’ మొదలు పెట్టాను సంభాషణల దాడి- ‘‘తీరికా? అదెట్లా ఉంటుందేం?’’అన్నది. పద్మరేకుల్లాంటి కనులను ఇలా విప్పారజేసి-
తీరికవేళల్లో వీణ వాయించుకుంటానందామె. తన టీపాయి మీద అప్పుడు జమున వీణవాయిస్తున్న ముఖ చిత్రం-వున్న వీక్లీ వున్నది- ‘‘నేరకపోయి కదిపాను, అనుకున్నాను. ‘‘అబ్బే!’’అన్నది. వారపత్రిక మీద గల ముఖ చిత్రాన్ని యిలా పట్టుకుని ఎద్దేవా చేసింది.
సహజంగా నటులు, కళాకారులు, రచయితల మధ్య మాత్సర్యం వుంటుంది.
‘‘జమున గ్లామర్ స్టార్ అప్పుడు’’.
వీణ వాయించడం తెలిసినవాళ్ళు అలా పట్టుకుని కూర్చోరు, అన్నది.
నా ఎదురుగా కూర్చున్న ఆమె పరిచారికకి ఏవో ‘‘స్నాక్స్’’గట్రా తెమ్మని సైగ చేస్తూనే
‘‘మరెలా పట్టుకుంటారో?’’ నేను రెట్టించాను.
సావిత్రి గారూ! ఆమెను ఆ పోజు యివ్వమని నేనే రిక్వెస్టు చేశా.
అలా ఫొటో తీయించుకున్నాను... ‘‘నేరం నాదే’’అన్నాను నవ్వుతూ అంటూనే నా ప్రశ్నను కొనసాగించాను- అంతలో ఆమె వీణ తెప్పించుకుంది.
‘‘అంటే మీరు వీణావాదనంలో ఎక్స్‌పర్టు అన్నమాటే!’’
ఫొటోగ్రాఫరికి ఆమె వీణతో వున్న ‘‘్ఫటో’’తీసుకోమని ‘‘సైగ’’ చేశాను.
‘‘ఏమిటి మీ ఉద్దేశ్యం? సావిత్రికి వీణరాదనా? పాట కూడా వచ్చును తెలుస్తోంది. అయితే పాడమనకండీ?’’ అని నవ్వేసింది.
వీణ శృతి చేసుకుంటున్నది. ఆమె జార్జెట్ చీర కట్టుకుని వచ్చింది.
నిండుగా కూర్చొని ‘వాతాపి గణపతి భజేహం..’ మొదట వాయించింది.
కుమారి జమున మీద ఏదో కామెంట్ చేసింది కూడా.
ఐతే ‘‘ఆఫ్ ది రికార్డ్’’అది. ‘‘సావిత్రిగారూ! మా బెజవాడలో ‘‘మీ ఫ్యాన్స్ ఎక్కువ’’ అన్నాను.
‘‘మన బెజవాడ’’అనండి. అన్నది నవ్వుతూ. జస్ట్ ఫ్రూట్‌జ్యూస్...
నాకు చాలు మాడమ్! అన్నాను.
‘‘నేను డిట్టో’’అన్నది. ఫొటోగ్రాఫర్ వేపు సంకేతించి ‘‘క్లాసు’’సరుకేనా అన్నది.
‘‘టాప్-’’మా బాస్ రాధాకృష్ణగారి మనిషి అన్నాను.
బయట ఉద్యానవనంలో ఫొటోలు బాగుంటాయి కదూ? అంటే వెంటనే బయట కుర్చీలు వేయించి
కొబ్బరి మట్టల మీద అరిటాకుల విన్యాసం లాగ వుండే ‘‘పెద్ద క్రోటన్ చెట్టు’’కూడా వుంది. దాన్ని ‘‘బ్యాక్‌గ్రౌండు’’గా ఫోజు ఇవ్వమన్నాను. అద్భుతంగా ఆ ఆకుల ముందునుంచి గొప్ప పోజు యిచ్చింది.
ఫొటోగ్రాఫర్‌ని ‘‘అపెర్చర్ ఎంత పెట్టావ్? అనడిగింది. అవుట్ డోర్‌లో, మిట్టమధ్యాహ్నం ఎండ నెత్తిన ఎక్కుతోంది... ‘‘లెవెన్’’పెట్టుచాలు అన్నది. ‘‘్ఫ్లష్’’మాత్రం కొట్టు అంటూ సూచనలు యిస్తూ ‘‘నాతో’’ అని కారు ప్రక్కన పోజుయిచ్చింది.
‘‘కారుమీద వద్దులేండి’’.
సోఫాకమ్ బెడ్ కమ్ వుయ్యాల వుందిగా అటూ. ‘‘పాండవోద్యాగ విజయాలలో శ్రీకృష్ణుని ఫోజు’’అంటూ నేనిచ్చిన సూచనకి నవ్వుతూ, నాటకాల అనుభవం మాత్రం వున్నట్లు లేదే మీకు? అన్నది. మీ ఉద్దేశ్యం నాకు అర్ధమయ్యింది అంటూ నాలుగైదు పోజులు, రెండు పర్యాయాలు చీరెలు మార్చి మార్చి సహకరించిందామె.
‘‘ప్యాకప్’’యింకా కాస్ట్యూమ్ ఛేంజీ లేదు. ఓన్లీ ‘‘టచ్ అప్’’అంటూ తానే మొహం ఇలా చిన్న అద్దంలో చూసుకొంది.
మామూలుగా ఉందిగా ‘‘నా పేటెంట్’’ భంగిమ మెట్లమీదకి ఎక్కి ల్యాండింగ్ మలుపులోనుండి క్రిందకి యిలా తొంగి చూసే పోజు. ఇవన్నీ చాలానే అయ్యాయి. ‘‘ఇన్ని ఫొటోలు తీస్తున్నారు.’’ అన్నీ పడతాయా? అన్నది కాస్త చిరాకుగా పడతాయా?’’ పట్టకపోతే చిన్న సైజుచేసి వేస్తాం’’ అన్నాను నవ్వుతూ.
ఆమె ఫొటోగ్రాఫర్‌ని చూస్తూ ‘‘ఇక నువ్వు దయచేయ్. ఎక్కడైనా రాంగ్ ఏంగిల్ వచ్చిందో? అంటూ నవ్వింది. తర్జని చూపించి ఆనక తనకి హిందీలో ఎంత డిమాండు వచ్చిందో చెప్పింది. ‘‘సౌత్ మీనాకుమారిగా తనకు ఎంతో ఖ్యాతి వుంది. అసలు సావిత్రి కనులకు ఉన్న భావ వ్యక్తీకరణ పటిమ, మరొకరికి లేదు. ‘‘గంగాకి లహరేం’’అన్న సినిమాకి మొదట మీనాకుమారిని అడిగారు. ఆనక ‘‘నన్ను తీసుకున్నారు’’అన్నది. ‘‘ఘర్ బసాకే దెఖో’లో నటిస్తున్నాను అన్నది. ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రెండువారాలు వేశాను. ‘‘అందమైన కళ్లు విజయవంతమైన నటన’’అంటూ రైటప్ యిస్తూ... ఆమెది ఔచిత్యమెరిగిన నటన, సందర్భం తెలుసుకున్న భావ ప్రకటనా పటిమ అన్న వ్యాసాలు యిచ్చాను. తెలుగునాట- ఆ వీక్లీని ‘స్టాల్స్’లో నిలువునా తెరచి సెంటర్‌స్ప్రెడ్ కనపడేలా వ్రేలాడదీశారు. నిజానికి తెలుగు నటీమణులలో యింత స్పీడుగా ‘‘శత చిత్ర విజయాన్ని’’అందుకున్నవాళ్ళు మరొకరు లేరు.
అప్పుడు ఆమె కెరీర్ క్లయిమాక్స్‌లో వుంది.
‘‘చిన్నప్పుడు అంజలీదేవిగారు, అక్కినేని నాగేశ్వరరావుగారి సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని’’అన్నదామె. అనతి కాలంలో దక్షిణాది అగ్రశ్రేణి తారల సరసన ‘‘రైట్ రాయల్ వే’’లో చోటు సంపాదించుకున్నది.
తన పధ్నాలుగవ ఏట వెండితెర మీదకెక్కిన ఈ ‘‘నటి’’ని సంసారం సినిమాకి పిలిచి హీరోయిన్‌గాకాక ‘‘చిన్న సైడు పోర్షను’ఇచ్చారు. ‘‘పాతాళభైరవి’’లో (తెలుగు మరియు టామిల్‌లో) చిన్న డ్యాన్స్‌లో చోటుఇచ్చారు. తనే చెప్పింది. (తన జ్ఞాపకశక్తి అమోఘం.) 1951 నవంబర్ ఐదో తేదీనాడు ‘‘శాంతి’’అన్న సినిమాలో ముసిలి మొగుడి సరసన పడుచువేషం వేశాను. ‘‘అదే టర్నింగ్ పాయింట్’’. ఇంతకీ ఆ ముసలి మొగుడు ఎవరో తెలుసా? డా.గోవిందరాజుల సుబ్బారావుగారు (మాయలఫకీరు). అయితే సావిత్రిని ఆకాశపథాన ప్రత్యేక ‘‘తారగా’’నిలబెట్టింది. అక్కినేనిని ‘‘దేవదాసు’’ని పాత్రలో శరత్‌చంద్రుని ‘‘పార్వతి’’పాత్రలో (శరత్‌బాబు బ్రతికుంటే ‘్ఫదా’ అయిపోయేవాడు) ‘‘పార్వతి’’కి ప్రాణంపోసింది.
అరవ సినిమా ప్రేక్షకులు సావిత్రీ గణేశన్ అంటే పిచ్చెత్తిపోసాగారు. ఎస్వీ రంగారావు, సావిత్రిలకు అక్కడ ఒక్కటే ‘‘బిల్లింగ్’’
పది సంవత్సరాలు తిరగకుండానే 62నాటికి కథ విని తనకి పాత్ర నచ్చితేనే సినిమాలు ఒప్పుకునే స్థితికి ‘‘సూపర్‌స్టార్’’గా ఎదిగిపోయిందామె. ‘62లో ఆరు సినిమాలు చేసింది. కారు నడపడంలో స్పీడు జాస్తీ. జెమినీ కోప్పడుతాడుట. కెరీర్‌లోనూ అదే ‘‘స్పీడు’’. అందర్నీ మించిన ‘‘్ఫటోజెనిక్’’స్టార్ ఆమె. ఆమె యింటర్వ్యూ-చేయడం, రాయడం రెండూ కూడా నాకు ఒక ‘్ఛలెంజ్’ అయింది. సత్తువ కూడా చాలా ఖర్చు అయింది.
‘64 టైములైన్ దాటి నేను ఇక్కడ ప్రస్తావించను.
అప్పటికే తమిళంలో ‘‘పాశుమలార్’’ ‘‘పాపమన్నిప్పు’’ ‘కప్పలాట్టియ తమిళన్’లాంటి హిట్స్‌లో అలాగే తెలుగు వెలుగునీడలులో రికార్డులు బ్రద్దలుకొట్టిందామె. దొంగరాముడు, భలే రాముడు- ఏ రాముడైనా హీరోయిన్ ‘‘సావిత్రి’’అదరగొట్టేసిందన్నారు జనం. మాయాబజార్ అలాగే కన్యాశుల్కానికి అంటే ‘శశిరేఖ’కీ- ‘మధురవాణి’కి ప్రాణంపోసిన సావిత్రి అఖిల భారత ఖ్యాతి సంపాదించిందినాడే.
రక్తసంబంధం చిత్రం రెండు భాషల్లోను ప్రశంసాపత్రాలు అందుకుంది. ఇల్లు కట్టుకుంది. ఇల్లాలైంది. తల్లి అయింది. నేనెరిగిన నాటి సావిత్రి కథ ‘‘కీర్తికాంతులు’’ సుఖదీప్తిగలవే. ‘‘నా తమిళ చిత్రాలు హిందీలో తీస్తే నేనే వాటిల్లోను నటిస్తానన్నది’’ మహానటి సావిత్రి. టాలెంట్, అప్పీలు రెండూవున్న ఆమె నటన భావితరాలకు ఒక ట్రిటైజ్ నటనలో ఆమెదో ‘‘స్కూలు’’.
న్యూస్‌ప్రింట్ కొరత!
‘‘మాంచి ఊపు’’ అందుకుంటున్నది వారపత్రిక ప్రాచుర్యం. ఆ ‘‘టైము’’లోనే న్యూస్‌ప్రింట్ కొరత తగులుకున్నది. ఛాన్సు దొరికితే చాలు రాధాకృష్ణగారు న్యూస్‌ప్రింటు ఇక్కట్లు పాఠకులకు మనలో మాటగా వేరే నోటీసుగా అందిస్తున్న దశలో ‘‘ప్రకటనలు’’మాత్రం జోరందుకున్నాయి.
ఒక్కసారి 56 పేజీలే వేస్తున్నాం అని విన్నపాలు కూడా వేస్తున్నాము. ఇరవై ఎనిమిది పేజీలు ‘‘దాటకూడదు ప్రకటనలు’’అన్నారు. సరే, రుూలోగా పేజీలు నింపడం మరో సమస్య. బొమ్మలకోసం ఆర్టిస్టులకు పంపిన కథలు తిరిగి రావాలి. సెలక్షను అయిన కథలు రాధాకృష్ణగారి దగ్గరకుపోయి రావాలి. మధ్యలో పేజీలు ‘తెల్లముఖం’వేసుకొని కూర్చొనేవి. అప్పటికప్పుడు మేటర్ రాస్తూ కూర్చొనేవాణ్ణి- ‘‘అన్నీ దయ్యాల కబుర్లే.’’
కథ సీరియల్‌గా అలారాసిన కథయే- రాసి వెంటనే స్టాఫ్ ఆర్టిస్టు దశిక రామలింగేశ్వరరావుని పిలిచి బొమ్మవేయించి, కంపోజింగ్‌కి యిచ్చేసే వాణ్ణి. ‘‘ప్రకటనలు యిచ్చే ఆదాయమే’’- అసలు రాబడి కనుక ఆ డిపార్టుమెంట్‌లో పనిచేసే అటెండరు కూడా ‘‘మీ జీతాలు కూడా మేమే యిస్తున్నాం’’అండీ అని మాట్లాడేవాడు. చివరి క్షణంలో ప్రకటనలు వస్తే ఇక ఏదో ఒక శీర్షిక లాగిపడేయాలి.
పైగా ఆడవాళ్ళ శీర్షికలలో ప్రకటనలు పెట్టాలి అనేవాడు మా ‘నందకుమారుడు’ అన్నయ్యగారు. అసలు అడ్వర్‌టైజుమెంటు మానేజరు రామచంద్రయ్య డైలీకి అంకితం. వారపత్రికకి ప్రకటనలు కాపీలు తెచ్చేది,యిచ్చేది.. అంతా యంగ్‌మ్యాన్ నందకుమార్- అతణ్ణి చూస్తూనే-
‘‘నందకుమార్ రావయ్యా! మా భాగ్యంకొద్దీ దొరికావయ్యా... ఆ... ఆ?’’అని మాయాబజార్‌లో లక్షణకుమార్ (రేలంగి) పాత్రను పొగిడే స్టయిల్లో పాడే వాణ్ని గాని లోపల మండిపోయేది. వాళ్లు కావాలన్న ‘‘చోటు’’యివ్వాల్సిందేనంటారు ‘‘యాడ్స్’’వాళ్ళు-
‘‘ఇస్యూ’’క్లోజ్‌డ్ అనేవాణ్ని. పాఠకుడు వీళ్ళకన్నా కఠినాత్ముడు. నా ‘‘పౌండ్ ఆఫ్ ఫ్లెష్ నాకిచ్చీ అంటాడు. అంతా ప్రకటనలేనా? మాకు ‘సొడ్డు’’పెడుతున్నారు అంటూ ‘యాగీ’చేసే ‘లెటర్స్’సంఖ్య పెరిగింది... హాయ్! అల్లాహీ!
ఒక్కోసారి సర్కస్‌లో ‘దండెం’మీద గడకర్ర పట్టుకుని ‘‘్ఫట్స్’’చేసే దొమ్మరి సానిలాగా నాకు నేను కనపడేవాణ్ణి. ఆ టైములో నా ఫ్రెండ్ వాకాటి పాండురంగారావ్ గారొచ్చాడు. ఆయనకి ఆంధ్రపత్రిక అన్నా నా కథలన్నా చాలా యిష్టం. దానితో కారణం వుంది. వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తిగారు సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారుట.
నావైపు చూస్తూ గంభీరంగా మొహంపెట్టి ‘‘నో రిప్లయి’’ మీ దగ్గరనుంచి నా ఉత్తరాలు అందకుండా వుండవుగాని... డోన్ట్‌కేర్ (యిలా నోరు పూరించి) అంతా ఆ సీటు మహిమ..అన్నాడు (వాత్సల్య భరిత) కోపంగా-
ఒకరి అంపశయ్య మరొకరి తూగుటుయ్యాల ‘‘స్వామీ’’అన్నాను నవ్వుతూ. ఆ టైములోనే మేము పాఠకులకి ఇంకా ఎక్కువ మ్యాటర్ యివ్వడంకోసం వీక్లీ ‘‘కాలమ్’’ వెడల్పు ఎక్కువ చేశాం. అంతేనా? నా బొమ్మలు, శీర్షికల పేర్లు చిన్నవిచేయాలి. అనుకున్నాం...

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com