S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెర మీద - తెర వెనుక..

స్పెషల్ ఇష్యూకి రాత్రి ఫదిన్నర దాకా వర్కర్లు పనిచేస్తూ వుంటే వారితోపాటే నేనూ వుండి పోయేవాన్ని - నాన్న గారికి ముందే చెప్పేవాణ్ణి . ఓ కేరేజీ గినె్నలో సాంబారు సాదాం మరో దానిలో మోర్ సాదమ్ (మజ్జిగఅన్నం) రూములో అట్టేపెట్టమని- మా వాళ్లల్లో-నటులుకూడా వుండేవారు, గోపాల్- అచ్చం నంబియార్ని మరిపిస్తాడు, సారంగపాణి మహా కమెడియన్, ఓ బీడీ దమ్ము కొట్టి వచ్చాడంటే -హాస్యనటుల దుమ్ములేపేసేవాడు. రామయ్య డైలాగులు రాస్తాడు. అందరికి సినిమా ఇచ్చి(దుర) వుంది. టీలు తెచ్చుకోండి- నాది పణం -అంటే’’ నీ సంబలమే ( జీతం) తక్కువ కదా సారు.. మాకు ఓటీ వస్తుందిగా .. అనే వాళ్ళు - ‘‘పోయేనాడు వెంబడి రాదు -వెంట్రుక ముక్క అయినా ... ఇల శాశ్వతమా ? నీ జీతం? .. అందుకని ఖర్చుపెట్టేసేయ్..‘ అని పాడేవాణ్ణి- చిన్నప్పుడు చెప్పానుగా, గ్రామఫోనురికార్డుల మధ్య పెరిగానని, ఓ కూనిరాగం తీసేవాన్ని ...పోయేనాడు వెంబడి రాదు పూచిక పుల్లయినా... అన్న పాట నాగయ్య గారు పాడాడుట- ఎ సిన్మావో తెలియదు- దీనికి కొంచెం మార్పు పూచిక పుల్లకి బదులుచేశా ... ఈ పాట అలాగే, పెదాల మధ్య (నోట్లో ) పెన్సిలు -ఇవి నా ట్రేడ్ మార్కులు... పేజీలు ఎక్కువపెట్టాలి స్పెషల్ సంచికకి. ఆ రోజుల్లో ఆ వరకు సాఫ్టవేర్ కాదు హార్డ్వేర్ -మొరటుపని.. ఇనుపచేట లోని, మ్యాటర్ని ఇలాఎత్తి ‘‘పేజి’’ ‘‘చేట’’లలోకి పెట్టడం ఒక ఒడుపు - ఒకకళ.. మా వెంకటేశ్వరులు బుగ్గంమీసాలు దువ్వుతూ- ఒక్క చేతిమీద పదహారు పేజీలు పెట్టేసేవాడు-అతని కాకి డ్రెస్సు తడిసిపోయేది-మోకాళళు దాకా నరాలు ఉబ్బి ఆకుపచ్చరంగులో మెరిసేవి. అతను ఎర్రగా వుండేవాడు. అసిస్టెంట్ ఫోర్మేన్ -మేస్ర్తి అనేవాన్నికాడు.. అయ్ ..లీడర్ అనేవాణ్ని -మురిసిపోయేవాడు .
‘లోహపు- అక్షరకూలీలం.. మనం అనేవాణ్ణి- చెయ్యి మండేది -దిమ్మలు ఎత్తి పెట్టి హుషారులో-బ్లాకులు ఎక్కించి అవీ లాగించేసేవాన్ని సరదా. ‘‘ కాని ఈడ కబుర్లు మాని-‘‘ పటం ‘‘లోకి పోమీ’’ -అనేవాడు త్యాగరాజు- ఫోర్మాన్ అతను.
ఆ మధ్యాహ్నం -ఇంటర్వెల్ లో వర్కర్లంతా లైట్ హవుస్-వేపు పరుగులు తీసేరు...బువ్వ అదరబదరా మ్రింగి. .. ఏదో సినిమా షూటింగు అవుట్ డోర్.. పరుగున వచ్చారు- ‘‘సామీ.. ఆ హీరో అచ్చం నీలా గానే వుండాడు ...సినిమాల్లోకి పోరాదే.. ఆ షర్టు - మూతి (మొహం) రింగుల్ క్రాపింగు.. అంటూ సినిమా షూటింగు గురించి మురిసిపోతూ చెప్పేరు- అది డైరెక్టర్ శ్రీధర్ తీస్తున్న సినిమా: కాదల్లికినేరమిల్లై’’ ..దాని పేరు. సరికొత్త కుర్రాడు. పాత రాజశ్రీ జంటగా కాబోలు.. షూటింగు.. కాదల్ అంటే ప్రేమ ‘నేరం’ అంటే టైము -ప్రేమకి సమయం లేదు అని టైటిల్ .. నేను నవ్వేను.. (ఆ నవ్వులో ఫిలాసఫీ వుంది)-నాకు ప్రేమకి నేరమిల్లె అప్పా! ..అది ఒరు నేరం.. (తెల్గులో ఒక తప్పుఅని అర్థం) అన్నాను- కానీ ఈ లోపల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.
ప్రేమకుపగ్గాలు -సంసారంలో సొసైటీలో ఎలా కనబడకుండా ఉంటాయో ?-నేను నా సీరియల్ నవల ద్వారా చెబుతున్నాను.. యువ హీరో వేషం చినవయసు వాళ్లే వెయ్యాలి అన్నది -శ్రీధర్ ప్రత్యేకత -ఇదే చిత్రం తెలుగులో ప్రేమించి చూడు అంటూ తీస్తే ముదురు కేసులు జగ్గయ్య అక్కినేని -నటించారు...’ అది ఒక ఇదిలే.. ఇది ఒక అదిలే ‘ అని పాట కూడా వుంది- ప్రేమ ఒక నేరం అని క్యాంపస్లో ఫిజిక్స్ చె’’ప్ప’’ని గుణపాఠం...సరే, దూరాభారం నుంచి వచ్చే వాళళు వర్కర్లు-వాళ్ళకి కేరేజీలు గంపలవాళ్ళు తెచ్చేవాళ్ళు. ఆదివారాలు తప్ప.
వీక్లీ సెట్ ఓకే చేసి ఇచ్చేసే నేను వెళ్ళిపోయాక , రాత్రి లేటుగా మెషీన్ ఎక్కిస్తే.. దానికి ముందు-స్ట్రైక్ ఆర్డరు మీద సంతకం పెట్టాలి నేను (ఎడిటర్) దానికోసం -వర్కర్లు రోటరీ ప్రూఫ్ తీసుకొని రాత్రి పదితరువాత -మూడంతస్తులు ఎక్కి రూముకి వచ్చి-సంతకం తీసుకొనేవారు... ఆ స్టేజీ లో కూడా ఏవైనా తప్పులు పొరపాట్లు వుంటే ‘‘రౌట్’’ ‘‘చేయమనేవాణ్ని ..‘ అంటే ..అంత జాగ్రత్తలు -అవసరం... ఆషామాషీ కాదు.
మరుసటి వారమే -నవ్వితే నవరత్నాలు ‘ఫేం’ -అందాల తార’’ కేకే’’ -తెరమీద -తెరవెనుక -కోసం ఇంటర్వ్యూ కై వాళ్ళ ఇంటికి. చాల సందడిగా వుంది వాళ్ళ ఇల్లు . వాళ్ళ అమ్మగారు అన్నదమ్ములూ అప్పచెల్లెళ్లు అయినవాళ్ళ పిల్లలూ అంతా హడావుడి గా వుంది. ఇంటికి ముస్తాబు దాని మీద శ్రద్ధా ఏమీ లేనట్లుగా - మామూలు మిడిల్ క్లాసు బ్రాహ్మణ ఇంటిలాగ వుంది. ప్రభాకర్ క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు.. కృష్ణకుమారి చెప్పింది.. పోయిన సంవత్సరమే కొత్త అందాల ఇల్లు -గృహ ప్రవేశం చేసాము .. కాని ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాము .. అంటే ఈ ఇరుకు ఇంటి మీద సెంటిమెంటు అన్నమాట. ఔనండీ బాగా కల్సి వచ్చింది..
నాకేమో -కుదరటం లేదు... నిజమే అప్పుడే -1963- ఆమె బిజీ అవుతోంది. చూడగానే ఏపుగా -చాలా పొడుగ్గా, సంప్రదాయము సంస్కారము పుణికి పుచ్చుకున్న పక్కింటి బుద్ధిశాలి అమ్మాయి అన్నట్లు వుంటున్నదామె - వాళ్ళ నాన్నగారు టేకుమళ్ళవెంకోజి- ఉద్యోగరీత్యా పశ్చిమ బెంగాల్ నేహాతిలో ఉండగా ఆమె పుట్టింది- డాక్టరమ్మ -ఈ పిల్ల అందమైన పొడవాటి వ్రేళ్ళను చూస్తూ -ఏమండోయ్ ! పెద్దైనాక మీ పాప -గొప్ప ‘‘కళాకారిణి’’ అవుతుంది సుమండీ ’’ అని భవిష్యద్వాణి పలికిందిట .. మనకి నర్గీస్, నూతన్లు. టాల్ గాళ్స్ గా వెండితెర మీద బంగారుపంటలు పొందిన వాళ్ళున్నారు.. కేకే కి పొడగరి అని గర్వం కూడా -నా ప్రక్కన క్లోజప్స్ లో హీరోలు స్టూలు మీద నిలబడి నటిస్తారు అంటూ గలగలా నవ్వింది. థాంక్ గాడ్ అన్నాను- నేనూ పొడుగ్గా వున్నాను (నీకంటే అన్నది లోపలి భావం)
‘మరేం -కొలుచుకుందామా? .. తను పొడుగేకాని నేను పొట్టి కాదు అప్పుడు అయిదు ఎనిమిది వున్నాను. - ఆ క్రాపింగుని మైనస్ చెయ్యాలి అన్నది నవ్వుతూ -అమ్మో అందులోనే మంత్రం శక్తులున్నాయ్-నవ్వులమధ్య- ప్రభాకర్ అన్నాడు ఎనిమిది స్నాప్స్ -అంటే.. అన్నాడు.. చెల్లెలు కాబోలు -రేవతియా? పేరు -అవుట్ (బయటికి వ్రేలు సంకేతిమిచ్చి).. ఆర్ ఇన్? అన్నది -బయట వున్నా కారు మీద పడ్డది నా కన్ను.. పదమన్నాను.. బోయ్నేట్ మీద నిండుగా వుంది..చోటు లేదు ముందు-గోడ వుంది.. దానిమీడకి ‘‘ఎక్కిచూడు’- ఓ కుర్చీ వేసుకుని గోడెక్కి-ఎండా నీడా చూస్తున్నాడు .. అయ్యబాబోయ్ (రాజమండ్రి టచ్) .. ‘ఇక్కడ చుఱ్ఱుమని కాల్తోంది .. నో రీటెక్స్ ... అంటుందామె- లోపలకిపోయి చూశాను- కాస్ట్యూమ్ ఛేంజ్ అన్నాను- వీణ ఉందా? -తబలాకూడా లేదు.. అన్నది చెల్లెలు. మెట్లు ఎక్కుతూ లాండింగు ముందు గిరుక్కున తిరిగి గోడమీద నుంచి క్రిందకి చూడాలి- ఓకే .. తలనిండా సౌత్ హీరోయిన్ లాగ పూలచెండ్లు ఇలా భుజం మీదుగా వ్రేలాడుతూ వుండగా - కూల్‌డ్రింకు త్రాగుతూ .. ఇవన్నీ ఓపికగా రెండు మూడు చేరులు నగలు మార్చి మార్చి ధరించి.. ఆమె కనులు మాట్లాడే కనులు- చక్రాలే సి.. భానుమతి లాగ నిలువు బొట్టు పెట్టుకుని ఇల క్రిందకి చూసేసరికి (ఆ సీనులన్నీ నా కనులముందు తిరుగుతున్నాయ్) భానుమతి ఎక్స్‌ప్రెషన్ వచ్చింది.. నాకు చిన్నప్పుడు కూడా భానుమతి ఇష్టం - నర్గీసు సరేసరి- టైమ్స్ వాల్ ధర్మయుగ్ హిందీ పత్రిక భానుమతి ఇంటర్‌వ్యూ వేస్తూ -ఓ ఫొటో వేసింది- భిబూతి మయి భానుమతి అంటూ వ్యాఖ్య. అట్లాగా, కృష్ణ కుమారికి -గుడినుంచి వస్తూ వున్నట్లు ఫొటో తియ్యాలి .. ఈలోగా ప్రక్కింటి నుంచి క్యారం బోర్డు , కాయన్స్ వచ్చాయి.. కే కే కి తీరిక దొరికిందా? క్యారమ్స్ ఆడటం ఇష్టం (?) -పిక్కని ఇలా గురి చూసి రిలీజ్ చేస్తున్నప్పుడు- అవయవసౌష్టవం, అందం, వాల్జెడ నిండా.. అందుకే ఆ ఫోటోలు తీసుకున్నా.. వ్యాఖ్యలు -పేజీలో బొమ్మ ప్లేసుమెంటు కూడా ఊహించుకుని -్ఫటోలు తీశాము. అమ్మమ్మా .. ఈ చీరలు యిప్పీకట్టలేక చస్తున్నాను బాబూ- పైగా , నో మేకప్,.. అమ్మ వంటింట్లో.. వుంది.. అన్నది విసుగ్గా మొహం పెట్టి.. ఓకే .. పంజాబీ వేషం వేద్దామా?.. ఈలోగా గుడికి పోయి అయ్యవారికో అమ్మవారికో కొబ్బరికాయ కొట్టి , ప్రసాదం పట్టుకొని -పట్టు చీరెలో ‘’’ దిగితే. చెప్పాను -‘‘ఓ సబ్ నాయి జాన్తా సారు.. బయటికి వెళ్తే... వెంటాడుతారు జనాలు..అన్నది నవ్వుతూ..
‘‘పల్లెరం పూలు కొబ్బరికాయ- ఇంకా భక్తిరసభరిత శీను రెడీ.. కొబ్బరికాయకొట్టి హారతిపట్టి ‘‘ఎవరికి కొట్టను?’’- ఆమె కొబ్బరికాయ చేత ధరించి ...అడిగింది..
‘‘మీ ఇష్టం.. పోజు వరకే ఇస్తాము పాఠకులకి.. దేసడి పేరు గుడి చిరునామా ఇవ్వము’’.
అంతలో ఐడియా ..ఇంకెవరికి? .. మీకే కొట్టేస్తాను ..’’ అంటూ నా తల చుట్టూత్రిప్పి (కో.క. నేలమీద కొట్టేసింది- ఆనక నాతో ప్రసాదము అందిస్తూన్నట్లు ఫోటో దిగింది.. ‘‘ఇదొక్క టేకు నా డైరెక్షన్’’ అంటూ నవ్వింది-... కట్ అనేదాకా... సైలెనే్స... అంటూ నవ్వింది. నాటి ఇంటర్వ్యూలో ఇలాంటి చిత్రాలు ఎన్నో బుక్‌లో ఇవ్వలేదు..’’
‘‘వీక్లీ నా ఫేవరిట్ మేగజీను అన్న ఫోటో నేను మరీ క్లోజ్ గా కూర్చుని’ ప్రాంప్ట్ ‘చేస్తున్నట్లుగా వుంది.. కట్..-అదీ .. ఇవ్వలేదు.. కాని ‘‘స్టార్’’ పడుక్కోని బోర్లా -చదువుతున్న మామూలు రొటీను పోజు ఫోటో -వేశాము.. ఫోటోలోని కవరు మీద అంజలీదేవి బొమ్మ వుంది.. సరిగ్గా కృష్ణకుమారి తెరమీద - తెర వెనుక ఫీచర్ పడ్డ సంచిక అట్ట .. కూడా అంజలీదేవియే.. దీనిమీద మా ఎస్ ఆర్ గారు మనలోమాట రాశాడు (5-4-1963) సంచిక .. ఇక, నాటి చదువరులకు అందిన కొన్ని విషయాలు నేటి మీకు -కోట్ చేస్తాను (యతాతథంగా.) 1951 -1963 - మధ్య కాలంలో అనేక చిత్రాలు మూడు భాషలలో నటించి - కన్నడంలో ఉత్తమ నటిగా అవార్డు- పొందినా, భార్యాభర్తలుతో మహానటుల కోవలోకి వెళ్ళిపోయింది. మద్రాసులో అప్పుడు రాజకుమారి అనే థియేటర్‌లో స్వప్నసుందరి సినిమా ఝామ్మని ఆడుతోంది.. కృష్ణకుమారి అనే సినడేరేల్లా ..సన్నంగా పొడుగ్గా అందంగా తాజా పువ్వులా -ఆ బయస్కోపు చూడ్డానికి వెళ్లింది ... సరే కొంతసేపెనాక ఈమెకి ఓ మంచి ప్రొడ్యూసర్‌గారి అమ్మాయితో పరిచయం అయింది...ఆ నిర్మాత ఇలాంటి అమ్మాయి కోసం వెదుకుతున్నాడు .. అంచేత ఆ మర్నాడే కేకే ఒకే అయి వెండితెరకెక్కింది. 1954 లో - ఆమె బియన్ రెడ్డి గారి ‘‘బంగారుపాప’’ అయింది-ఇలా ఈ సంభాషణం కథనం రెండు వారాలపాటు రీడర్స్‌కి అందాయి.. ఆనక , మా వర్కర్స్ యూనియాన్ వార్షికోత్సవానికి నా మాట మీద వచ్చి వాళ్ళందర్నీ సంతోష (64) పెట్టింది. అదే ఉత్సవాలకు ఎప్పుడో మళ్ళీ -గుంటూరులో దసరాబుల్లోడు యాభై రోజుల మహోత్సవంలో కలుసుకోడం జరిగింది -(1971) లో ఈలోగా ఎన్నో ఘట్టాలు జరిగిపోయాయి..గుంటూరు నుంచి తిరిగివస్తూ -మంగళగిరి లెవెల్ క్రాస్సింగు దగ్గర -ఆగిపోయాం (అప్పటికి ఫ్లై ఓవర్ లేదు) తను కారు దిగింది.. నేనూ ఇంకో కారు దిగాను- ఏనాటి ఫ్రెండ్సో లక్కీగా కలుసుకున్నట్లు -తెగ మాట్లాడుకున్నాము..జీవితం వెలుగునీడల జలతారు పందిరి. విడీవిడని చిక్కుల ’వల’ -కృష్ణకుమారి మాత్రం అభిమానులకు సదా ఒక మధురస్వప్నం.. అందాలనటి గానే తెర దిగిపోయింది.. నేను మరువలేని ఇంటర్వ్యూ అది..
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com