స్మృతి లయలు

జీవితమే అంతులేని పోరాటం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనరల్ మేనేజర్ గదిలోంచి... నా కుర్చీ దగ్గరికి వచ్చి కూలబడాలనుకున్నాను.. 1962 ఆగస్టు పదో తారీఖు అది. అంతలో లేచి నిలబడ్డాను. అది నా కుర్చీ కాదిక.. అనుకుంటూన్నాను. ఎదురుగ్గా మల్లయ్య శాస్ర్తీ వచ్చాడు. అతను క్యాంప్‌లో నా సమకాలీనుడు. ఫార్మసీ ఎమ్‌ఎస్సీ చేశాడు. గోల్డ్‌మెడలిస్ట్.. చాలా ఇష్టం నేనంటే. నా ‘తొలి మలుపు’ నవల అంటే చాలా చాలా ప్రాణం.
మనలోపల తెలియకుండానే ఓ మహానటుడు దాక్కుని ఉంటాడు. గొప్పగా పెట్టాను మొహం- షేక్‌హ్యాండ్స్ మొదట, ఆనక వాటేసుకున్నాను. ‘అమెరికా పోతున్నా’ అన్నాడు.
కనుబొమ్మలెగరేశా. నా కనుకొలకులు చెమర్చాయి. అది దాచేశాను. మల్లయ్యశాస్ర్తీ సంతోషంగా అందంగా, సన్నంగా, నుదుట నామం ధరించివుంటాడు. అయ్యంగార్లు వాళ్లు. తాతలనాడే వైజాగ్‌లో సెటిల్ అయ్యారు.
నాకెంతో హ్యాపీగా ఉంది. ‘‘మా ఫ్రెండ్ పేపర్‌కి ఎడిటర్ అవుతాడు’’ అన్నాడు.
నా ఎదురుగా బల్లమీద వున్నమ వి.వి.ఎన్. యిటే గ్రుచ్చి గ్రుచ్చి చూస్తున్నాడు. ‘‘నీ డిజిగ్నేషన్ ఏమిటి? అప్పటిదాకా సబ్ ఎడిటర్. గాని అప్పుడు కాదు. అదే జి.ఎమ్. నాకిచ్చిన కాగితం. ‘గుడ్‌బై’ తాఖీదు’’! అయినా చెప్పాను. సబ్ ఎడిటర్- ‘‘ఆ బాల్డ్ హెడ్ ఎవరు?’’ అసహనంగా అడిగాడు. హి ఈజ్ మై అసిస్టెంట్ ఎడిటర్ అంటూ శాస్ర్తీని నరసింహారావుగారికి పరిచయం చేశాను. వి.వి.ఎన్‌గారిది చక్కని బాల్డ్ హెడ్.
‘‘అదేమిటి? సబ్ ఎడిటర్‌కి యింత చిన్నబల్ల? అసిస్టెంట్ ఎడిటర్‌కి అంత పెద్ద బల్లా?’’, ‘‘కాదులే పద భోజనం చేద్దాం’’ అంటూ హాలు బయటికి నడిచాను. వి.వి.ఎన్. గ్రీట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ యంగ్ మాన్, మల్లయశాస్ర్తీ- బాన్‌వాయిజ్. ‘‘అమ్మయ్యా! బయటపడ్డాను’’ అన్నాను. ట్రాఫిక్‌ని తప్పించుకుంటూ- అదే మా డాడీ రూమ్.. సాపాటు కొట్టేశాక వద్దాం. మట్టేదాం.. పద’’
‘మట్టేదాం’ అన్నది పూర్వాశ్రమంలో కాంపస్ లైఫ్‌లో మేము మెస్‌కు పోతూ అనుకునే ‘స్లాంగ్’ కోడ్. ‘ఓ.కె.. కుమ్మేద్దాం’ అన్నది జవాబు.
‘‘దేవుడా నన్ను మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి తోసేయ్..’’అంటూ మనసు గొణిగింది. మల్లయ్య శాస్ర్తీ మేనమామ, పినతండ్రి వగైరా అంతా స్టేట్స్‌లోవున్నారు. తండ్రి ఇక్కడ లీడింగ్ అడ్వకేట్ విశాఖపట్నంలో. ‘‘అమెరికా నుంచి ఎప్పుడు వస్తానో? గొప్ప స్కాలర్‌షిప్ వచ్చింది. మమీ డాడీలకి గర్వంగా ఉంది’’ బేలగా అన్నాడు.
విజయ లాడ్జిలోకి దూరిపోయాం. క్యాషియర్ కమ్ మేనేజరు సుబ్బారామయ్య ‘‘ఏందయ్యోవ్? బండి బిఫోర్ టైము వచ్చిపడినాది రుూనాడు’’ అన్నాడు నెల్లూరు యాసలో.
‘‘తిరుపతికి వెళ్లిన ప్రతి తెలుగువాడు. మద్రాసు వోసారి వచ్చి గుండు తడుముకుంటూ, రుూ విజయ లాడ్జిలో (అవి రెండున్నాయి.. బ్రదర్స్‌వి కాబోలు) సాపాటు చేసిపోతారు. రష్‌గా వున్న సెంట్రల్ స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌లా వుంటుందది.
‘‘నీకేమివ్వనురా? వీరమల్లయ్య?’’ అతని పూర్తి వీర మల్లయ్య శాస్ర్తీ అనుకుంటాను.
సర్వర్ ఆర్ముగం ‘ఇహీ’అన్నాడు. సాంబారు బకెట్‌లో గరిట ముంచుతూ... ‘కాయెన్నా?’ అంటే ముక్కలు ఏమిటి? అని అర్థం.
ఫ్రెండ్ అరిటాకులో మరి నాలుగు చామదుంప ముక్కలు వడ్డించేసి- అపుడు ‘ఇంకా తెస్తానుండు’ అంటూ వెళ్లాడు. శాస్ర్తీ అన్నాడు. ‘‘నీ బుక్.. సారీ.. మన బుక్... తొలి మలుపు తీసుకుపోతున్నాను. కృష్ణమూర్తీ- గివ్ మీ యువర్ గుడ్‌విల్ దట్సాల్’’ అన్నాడు.
‘‘అవును జీవితమంతా పొట్లం కట్టి ‘తొలిమలుపు’ లో యిచ్చేస్తున్నాను కదా మిత్రుడికి?’’ నవ్వేశాను.
అసలు మా శాస్ర్తీ లాంటి ఇరవై నాలుగ్గంటలు ‘రుబ్బే’, ‘నూకప్ప’కి నేను ఫ్రెండ్ అవటం కూడా విధి చిత్రం.
‘నూకప్ప’ అంటే రేయింబవళ్ళు క్లాసు పుస్తకాలని చదువుతూ ఉండేవాడు. నూకడు, నూకరాజు, నూకప్ప- గ్రేడ్స్.. అట్లుండనిండు అది.
మల్లయశాస్ర్తీ మహాబలిపురం వెళ్దాము అన్నాడు. ‘‘ఓకె. లెటజ్ సెలబ్రేట్ ఫేర్‌వెల్ పార్టీ దేర్’’అన్నాడు.
‘‘మల్లయ్యా! నీ కృష్ణమూర్తి ఓ పెద్ద రచయిత, జర్నలిస్టు అంటూ అమెరికాలో గర్వంగా చెప్పుకోవాలి. సరే! శలవంటే ఛస్తారు మావాళ్ళు. అయినా ఐ డోంట్ కేర్ రుూవెన్ దట్ ఫర్ యూ- ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ మై ఫ్రెండ్.
సాంబారులో చామదుంపలు, కాకరకాయలు వేస్తారు హోటల్స్‌లో యిక్కడ- అందుకనేనా? తినలేక పోతున్నావు అన్నాడు- నా అవస్థచూసి మిత్రుడు. తల వూపాను. అటు సుబ్బరామయ్య వేపు తిరిగాను. అతనో ‘కామిక్ ఫిగర్’.
సాంబారు ఉప్పగా ఉంది. దాచినా దాగని నా కన్నీళ్ళు అదృశ్యంగా ఆ సాంబారులో కలిశాయేమో? కాబోలు.. ఉప్పుగా ఉప్పగా.. చేదుగా.. వుంది అంతా.
నెం.337 బిల్డింగ్‌లో (మా రూమ్‌కి) మేం లిఫ్ట్ ఎక్కుతుండగా గుడ్‌బై ‘సిక్స్ అండ్ సెవెన్’ (ఆంధ్ర పత్రిక డోర్ నెంబర్‌లు) అన్నది నా మనసు. కాని మల్లయ్యశాస్ర్తీ దగ్గర ‘డల్’ కొట్టకూడదు- అతను ఆనందంగా విమానం ఎక్కాలి. నాకేం బాధగా భారంగా లేదు అన్నట్లు అని నటిస్నున్నాను.
కానీ ‘కుర్రవాడా? ఎక్కడికి నీ ఉరుకులు? పరుగులు? అయిందా? పడ్డదా? కాళ్ళకి అడ్డంకి అంటున్నాది. తంబుచెట్టి స్ట్రీట్- జాలిగా నా వేపు చూస్తూ..
ఆంధ్రపత్రిక సంస్థ వర్కర్స్‌కి యిరవై శాతం బోనస్ ఇచ్చే స్థితినుంచి.. ఇరవై రోజుల బోనస్ ఇచ్చే దశకి వచ్చేసినా, కొత్త కుర్రాళ్ళకి (నాకు) ఎక్స్‌గ్రేషియా కూడా డిక్లేర్ చేసింది. కాని మా ఉద్యోగాలు ఊడాయి!
అరవై రెండులో వర్కింగ్ జర్నలిస్టుల వేజ్‌బోర్డుని, కొత్త స్కేళ్లని అమలుపరచక తప్పలేదు. రూల్సు ప్రకారం జీతనాతాలు అంటే ఎక్స్‌స్ట్రా బజట్’’ అని వరే చెప్పనక్కరలేదు.
పర్మనెంట్ వర్కింగ్ జర్నలిస్టులు పదిమంది ఉంటే ఒక ట్రెయినీని వేసుకోవచ్చును. మిగతావాళ్ళకి ఉద్వాసన తప్పదు. పైగా.. ఆంధ్ర పత్రిక యాజమాన్యం ఓ కొత్త ట్రిక్కు అమలు చేసింది. ఆదాయం ప్లస్ సర్క్యులేషన్ వగైరాలమీద ఏర్పడే న్యూస్‌పేపర్‌ల క్లాసులుంటాయి, పత్రికలకి ఇకమీదట.
ఆంధ్రపత్రికను ‘డి’క్లాసులో పెడితే జీతాలు భత్యాలు తగ్గుతాయి. బజెట్ సర్దుబాటుగా వుంటుంది. అందుచేత ఆంధ్రపత్రికని ‘దిన’ ‘వార’ పత్రికలుగా రెండుగా విడదీశారు. ‘బైఫర్‌కేషన్’అంటారు. దాంతో పత్రికలో చివర టెంపరరీ కుర్రాళ్ళు, ఒక్క మందరపు లలిత తప్ప. పార్కు రోడ్డుమీదుగా హార్బర్ రోడ్ మీదుగా పోయి సంద్రంలో కలిశారు. ‘తొలిమలుపు’ నవలలో శేఖరం (కథలో నాయకుడు) గోడమీద రాసుకున్న ‘కొటేషన్’ గుర్తుకు వచ్చింది. ‘ఇట్స్ డెడ్ ఈజీ టు డై యిట్స్ లివింగ్ ఆన్ దట్స్ హార్డ్(చావడం సులువు.. బ్రతకడమే గురుతర భారము) అన్న సూక్తి జ్ఞాపకానికి వచ్చింది.
వాళ్లే ‘పిలిచారు’ వచ్చాను కాని? నా జేబులో తడిసిపోయిన కాగితం వుంది. ‘కుంచితపాదం’గారి సంతకంతోసహా అది చెమటకి నాని పోతోంది.. ప్చ్...
‘‘ఖే సరాసరా’’ అంటూ లిఫ్ట్ ఎక్కుతున్నాం. అంతలో కన్నన్ వచ్చాడు చెయ్యి వూపుతూ. సిటీబస్ ఆపడానికే చెయ్యి అంత ఇదిగా వూపుతారు. అట్లా వచ్చాడు జియమ్ కూపురారు, అర్జంటా వాంగో అప్పా’’అంటున్నాడు, రొప్పుతూ.
అదే జీవితం! ‘అనుకున్నది ఒక్కటీ అయ్యేది మరి ఒక్కటీ!-
మల్లయ్యను మా రూమ్‌లో లైట్‌హవుస్ కిటికీలోనుంచి అలా చూస్తూ ఉండమని ఆఫీసుకి పరిగెత్తాను వెనక్కు.. ఏమైనా కలం, సిరాబుడ్డీ, కాగితాలు వగైరా అప్పజెప్పి ‘నోడ్యూస్’ సర్ట్ఫికెట్ తీసుకోవడానికా? అనుకుంటున్నాను.
జి.యమ్ రూమ్‌లోకి బిక్కుబిక్కు బిక్కుమని దూరేను. అతని ఎదురుగా బుక్‌షెల్ఫ్ మీద పెద్ద ‘నటరాజ్’విగ్రహం నృత్య భంగిమలో వుంటుంది. అదే ఆ విగ్రహం య్కొ పాదం ఒకటి నృత్యభంగిమలో ‘వంగి’ వుంటుందే.. అదే కుచింత (వంపబడిన)పాదం. అదే నా పేరు కుంచి‘ద’పాదం కాదు కాని అయన నాకు ఓసారి విడమర్చి చెప్పాడు. నవ్వుతూ వెత్తలపాకు తమ్మితీసి వాష్‌బేసిన్ దాకా వెళ్లి వచ్చాడు.
‘సిట్ డవున్’ కృష్ణమూర్తి అయ్యర్... ‘ఉక్కారు’ కుర్చీ చూపెట్టాడు.
క్రోధంగా, దుఃఖంగా వున్నది నామొహం. ‘‘పీకేశావు. ఓ గంట క్రితం ఇంకా ఎందుకీ మర్యాదలు? అంటున్నాయి నా కనులు.
రేపు టెన్ థర్టీ ఆన్ ద డాట్- యు బెటర్ కమ్ యంగ్‌మ్యాన్-
నా మొహం అంతా క్వశ్చన్ మార్కు అయింది.
లైఫ్ అంటే అదే! స్విచ్ ఆఫ్ చేస్తే లైటు వెలుగుతుంది ఒక్కోసారి...
‘వారపత్రిక’లో మన అయ్యర్ (అనగా శంభుప్రసాద్) వాంట్స్ యూ... అండ్ రాధాకృష్ణ లైక్స్ యూ.. నోవ్ దట్. ‘సార్!’ అని అనబోగా గాద్గదికం అయింది గొంతు- రేపు రాను సార్! (ఐ డోంట్ కమ్ టుమారో) అన్నాను. మొండివాణ్ణి కదా!
నవ్వేశాడాయన. ‘కారాకిల్లీ’ నవ్వే అయినా ‘బ్రైట్’గా వుంది. వాత్సల్యం, కరుణ వున్నాయా చూపులో.
ఇరవై నాలుగ్గంటల్లో అపాయింట్‌మెంట్ ఆర్డర్. టెక్నికల్‌గా సరి పాత కొత్త ‘వీక్లీ’లో. మంచివాడు జి. ఎముడు (తెలుగురాదు కానీ).. నీకు జాబ్ కావాలి. సంస్థకి వీరాజీ కావాలి.
నా కనుకొలకులలో కన్నీటి బిందువులు రెండు నిలవలేక రాలిపోయాయి.
‘‘ఫ్రెండ్ వెయిటింగ్ సార్!’’ అన్నాను. ఈ సెంటిమెంట్.. నా జీవితం అంతా దెబ్బతీసింది.
‘‘నవ్వేశాడాయన. ఫోరోక్లాక్‌కి రా! సైన్ ది ఆర్డర్స్- గోటు మహాబలిపురం దెన్ టుమారో జాలీలీ’’ అన్నాడు.
తాంబూలం పెట్టె తెరచి జర్దా (పొడి గాబోలు) తీసి ఆకులో పెట్టుకుంటూ ‘బిట్వీన్ ది కప్ అండ్ లిప్ దేర్ మే బి ఏ స్లిప్! యంగ్‌మాన్’’ అంటూ హెచ్చరించాడు.
నేను తరచూ అనే ఈ ‘మాటలు’ నా వీపుమీద ఛెళ్ళున చరిచాయి. ఎపాయింట్‌మెంట్ కావాలి నాకు. ఈ కథ అంతా నాన్నగారికి తెలియకూడదు.
మల్లయ్య, నేను మహాబలిపురం బస్‌లోనే వెళ్ళాం, కాని పరిగెత్తి వెళ్లాం అనిపించింది. ‘దునే్నశాం’శాస్ర్తీ అన్నాను నేను.
‘‘యూ నోవ్? అయామ్ గోయింగ్ టు బి బిలౌడ్ ఆంధ్రపత్రిక వీక్లీ ఇన్‌ఛార్జి’’ అన్నాను.
‘పాండవుల రాతి రథం’ (మా మల్లపురంలో) మీదకి లంఘిస్తూ- ‘రియల్లీ?’ శాస్ర్తీ నా చొక్కా పట్టుకుని క్రిందకి లాగి వీపుమీద ఛళ్ళున ఒక్కటి చరిచాడు. ‘‘నేను నీకు ఫారిన్ చందా కడతాను కృష్ణమూర్తి’అన్నాడు టెల్ మీ హవ్ మచ్?
ఎంత గుమాయింపు ఉక్కపోత ఎక్కువైనాయి. కాని ఆ ఎండ నెత్తిమీద ‘వెనె్నల్లా’ కురిసింది.
ఒక్కరోజు ఆలస్యంగా రిపోర్టు చేశాను. అంతేకానీ రెండు యింక్రిమెంట్లతో ఆంధ్రపత్రిక వారపత్రికలో అపాయింట్‌మెంట్ ఆర్డరు తీసుకుని మరీ ఆ పని చేశానరు. ఇపుడు కూడా చచ్చి స్వర్గాన వున్న ఆ మహానుభావుడు శ్రీ కుంచిత పాదంగారికి వేవేల దండాలు అంటోంది నా మనసు.
ఆగస్టు 13న ఉదయానే హాల్లోకివచ్చి శ్రీరాములుగారికి నమస్కరించి ‘పైకి’ పోతున్నాను సార్ అన్నాను. ‘పైకి’ అనకూడదు. మేడమీదికి అనాలి.
శుభం.. నేనూ కొంతకాలం వీక్లీచేశాను. తెలుసా?’’ అంటూ ఆయన లేచి యిలా భుజం తట్టారు. హాలు హాలంతా లేచి వచ్చి వీపుమీద ఛెళ్ళు చెళ్ళున చరిచేశారు.
‘‘వారకాంత వలలో పడ్డాడు మన బుల్లోడు’’ అంటూ వి.వి.ఎన్.గారు హాస్యమాడారు.
‘‘నేను నీ సీటు దగ్గరికి వచ్చి చూస్తాలే అయ్యా?’’ అన్నాడు ప్రసాదు సిగరెట్ దమ్ము పడుతూ..
స్వీట్ - హాట్ రెడీ చెయ్యి అంటూ వాక్యం పూర్తిచేశాడు.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com