S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోజురోజుకీ మరింత మోజు!

తంబుచెట్టి వీధి అంత నిడివి గల రోడ్డే అయినా ‘వన్ వే రోడ్డు’ కావడంతో, నేను రోడ్డు క్రాస్ చేసి - ఆం.ప్ర.లోకి ప్రవేశిద్దామని చూస్తున్నప్పటికీ, ఆ కొస దాకా ఎడం వేపు అంతా కండచీమల బారులాగా మోటారు శకటాలు ఓ ‘కునుకు’ తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. లాగి వదిలిన బాణం లాగా నేను ఆఫీసులోకి దూసుకుపోతూనే, ఓ కన్ను టైమ్‌కీపర్ గోడ గడియారం మీద వేశాను. పైకి హాలులోకి చేరేసరికే, నా బల్ల నిండా టెలిగ్రాములు పలకరిస్తున్నాయి. చోటు యింత పిసరు లేకుండా రకరకాల బులిటెన్‌లు - విదేశీ స్వదేశీ మ్యాగజీన్లు గుట్టగా పెట్టి ఉన్నాయి. నేనే అడిగాను - వాటి కోసం. ఆంధ్రపత్రిక అగ్రశ్రేణి పత్రిక. ప్రపంచంలోని అన్ని వేపుల నుంచీ - చందాలు కట్టినవీ, కట్టనివీ కూడా ‘టపా’ వచ్చి వాలిపోతుండేది. దూర ప్రాచ్య వారా మధ్య ప్రాచ్య సర్వీసులు, ‘బ్యాక్‌గ్రౌండ’ర్లు, సోవియట్, అమెరికన్ సమాచార శాఖల బులిటెన్లు - వీటిని చూసే నాథుడు లేడు. లేదా, అంత తీరిక కూడా హాలులో ఎవ్వరికీ లేదు. (వాళ్లంతా షిఫ్టు గత ప్రాణులు) రెండు మూడు గంటల ప్రయాణ దూరంలో తప్ప ఎవ్వరికీ కొంపలు లేవు.. సంబరంగా వెలగాల్సిన నా మొహం నల్లగా అయింది. అలవాటు పోయి, ఎన్నాళ్లయిందో? సోకాల్డ్ - ‘ఆటలు’ పరుగులు అవీ చేసి, కాళ్లు గుంజేస్తున్నాయి.. కుడిభుజం సలుపుతోంది. రాయాల్సింది ఆ చెయ్యే కదా? అటు చూస్తే పెద్దలు ఏదో ‘ఘసాలా’ పడుతున్నారు. అటు నుంచి ‘ఎమ్మెస్’, ఇటు నుంచి ప్రకాశరావుల దాకా తలలు ఏకం చేసి, తీవ్ర ఆందోళనగా కనపడుతున్నారు. అర్థం అయింది. ఇంచుమించు అందరికీ జి.ఎం. రూమ్ నుంచి - అతని ప్రీతిపాత్రుడు అయిన అర్ధగుండు - పైగా నిండు నామాలు, చిన్ని కాటన్ జుబ్బా - అచ్చం పూజారిలాగా కనబడే అటెండర్ -దేవుఁడి ప్రసాదం తెచ్చినట్లు ‘లకోటాలు’ తెచ్చి యిచ్చి పోయాడన్నమాట!
‘సార్!’ అనే వుంటుంది మెమోలో సంబోధన. ‘మీరీవాళ పదకొండు నిమిషాలు లేటుగా వచ్చారు. నోట్ దిస్’ అనుంటుంది. మండిపోదా? అసలు టైమ్‌కీపర్ నోట్ చేసిందే వేదమా? నాకు మెల్లిమెల్లిగా అర్థం అవుతోంది. ‘మ్యానేజిమెంట్ అత్తగారైతే - ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ కోడలు’ అన్న మాట!
‘చిన్న నోట పెద్ద మాట అనుకోకుండా - ఈ ఎడిటోరియల్ హాలులో వో గడియారం తగలెట్టమనండి సార్!’ అన్నా. అందరూ నా భుజం తట్టారు. ‘అబ్బా’ అని మూలిగిందది. కానీ మొత్తం మీద టైమ్ కీపర్ గడియారం కాకుండా ఎడిట్ హాలులో ‘గోడ’ చూసి, అక్కడే వో బల్ల మీద పెట్టబడిన అటెండెన్స్ రిజిస్టర్‌లో పొట్టి సంతకం పొడిచి, టైమ్ నోట్ చెయ్యాలని తీర్మానించారు. ఐతే, కొన్నాళ్లు పట్టింది, ఇలా అవటానికి.
నాకు నెమ్మదిగా అర్థమయింది. మ్యానేజిమెంట్ మీద ‘చిన్న సారు’కి మోజు ఉన్నదీ, అని. అయితే ‘గప్‌చిప్!’
నాకు ఏ ‘మెమో’ అక్కరలేదు - పొమ్మనడానికి. అందుకని హాయిగా ‘వర్క్ లోడ్’ దిట్టంగా తీసుకుంటే ‘ఉభయతారకం’ అనుకున్నాను. బల్ల మీద ‘హంగేరియన్ రివ్యూ’ అన్న, చేటంత రంగురంగుల మాగజీన్ ఉంది. అది తీసుకున్నాను - తిరగేస్తూ వున్నాను. అంతలో ప్రకాశరావుగారు తీక్షణంగా చూశాడు. ఖాళీగా వున్న తన ‘ఇన్‌కమింగ్ ట్రే’ చూపించాడు - అర్థమయింది. ఆయన ‘న్యూసు’ ఆయనకి అందాలి. అంతలో త్యాగరాజు (్ఫర్మేన్) వచ్చాడు. ‘యాడ్’లు నిండా లేవు. పేజీలలో దండిగా కావాలె’ అంటూ న్యూస్ ఎడిటర్‌కి హెచ్చరిక చేశాడు. నావైపు తిరిగి - ‘ఏమి? చేస్తున్నావు? ఆదివారం పేజీలట్టా నోరు తెరచుకుని వుండాది. మేటర్ ‘తోపుమీ’ అన్నాడు.
ఈ ఫోర్మేన్ సంగతి నాకు తెల్సు. మొదట ‘విమానం ఎడిషన్’కీ ఆనక ‘డాక్’ అంటే రాత్రి మద్రాసు మెయిలు ఎడిషన్‌కీ కంపోజ్ చేయించాలి. రాత్రి 9 గంటల బొంబాయి మెయిలుకి - రాయలసీమ ఎడిషన్‌కీ -‘మేటర్’ కావాలని చెప్పి గానీ తాను వెళ్లడు. ఐతే ఇతనికన్నా ముందు పని చేసి, పదవీ విరమణ చేసిన సీనియర్ - ఆదినారాయణ నాకు ఆనందవాణిలో పరిచయం. అతనో కబుర్ల కారాకిల్లీ శాల్తీ..
న్యూస్ అంటే ‘నార్త్, ఈస్ట్ వెస్ట్ సౌత్’ల నుంచి వస్తున్న వార్తల సమాహారం మాత్రమే గానీ - ‘పత్రిక’ అంటే, అందునా ఆంధ్రపత్రిక అంటే? ఆంధ్రుల సాహితీ సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ ఉద్యమాలకు ‘బాట’, ‘బాసట’ -గా, వాసికెక్కిన ఒక సమగ్ర వేదిక.
కాశీ (వారణాసి) నుంచి ‘న్యూస్’ ఒక మామూలు టెలిగ్రామ్ (టెలీప్రింటర్ కాపీ కాదు) వచ్చింది. అది నాకు తగులుకుంది. టెలిగ్రామ్‌లో యాభై మాటలే వుండాలి. అందుకని గడుసు విలేకరి కొన్ని మాటలు కలిపి, ‘ఏకాండీ’ మాట చేస్తాడు. ‘స్వోల్’ అనీ, ‘్భ’ అనీ వున్నాయి.. తలకెక్కలేదు. ‘్భ’ అంటే ఏమిటీ అని అడగాలి! అలా అడిగితే, వి.వి.ఎన్. -‘యిహిహీ...’ అని నవ్వుతాడేమో.. నా బల్లకి ఎడమప్రక్క అద్దాల ద్వారం ప్రెస్‌లోకి - కుడి ప్రక్క సాంబశివరావుగారు చూసే ‘్భరతి’ బల్ల వగైరా వుండే ‘నడవ’ ద్వారం ఎదురుగా - టెలిప్రింటర్ ప్లస్ మా డైలీ ఆఫీస్ రూమ్. (చిన్నది). కుడి ద్వారంలోకి దూరి హారిత శివశర్మ (సాంబశివరావుగారి కలం పేరు)గారిని అడిగాను. చెప్పారు - ‘ఏజే హోల్’ ‘స్వోల్’ అవుతుంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ - ‘్భ’ అవుతుంది. ఇట్లా ఎన్నో వుంటాయి’ అని.. థాంక్యూ సర్’
గ్రామీణ వార్తలు అగస్తేశ్వరరావుగారు చూస్తారు. అసెంబ్లీ వార్తలన్నీ ఇంగ్లీషు లిపిలో - తెలుగులో - ‘ట్రాన్స్‌లిటరేషన్స్’గా సొంత టి.పి. లైన్ మీద వస్తాయి. వీటి మీద అథారిటీ జె.బి.శర్మగారిది. పిట్టంత మనిషి గానీ రాత్రి తొమ్మిది దాకా - ఎత్తిన కలం దించకుండా, మా ‘పరభాష’లో ‘బల్క్’ (రొడ్డలు రొడ్డలు) రాయగల ధీశాలి. ఇట్లా, స్పోర్ట్స్ బొమ్మకంటి, సినిమా డి.కె.ఎం, జెనరల్ రామప్రసాద్ ఒకరు తొమ్మిదికి, ఒకరు పదికి - ఇలా గంటగంట వ్యవధిలో డ్యూటీలు ఎక్కాలి. లేకపోతే మూడు ఎడిషన్‌లకీ ‘మనుషులు’ (అంటే సబ్ ఎడిటర్లు) చాలరు.. ‘అగస్తేశ్వర్రావుగారు దేవతార్చన, ఆనక భోజనం అయి సుదూర ప్రాంతం నుంచి, సైకిల్ మీద - పడుతూ, లేస్తూ గంట లేటుగా వస్తారు. అయితే ‘గంట’ మెమోలుండవు. కనుక గంట లేటుకు ఎగస్ట్రా పనిచేసి (ఒక గంట) వెళ్తారు. శ్రీరాములుగారు ఇలాంటి సదుపాయాలు ఎన్నో ఇచ్చేవారు.
పొద్దునే్న (మాది ‘డాక్’ ఎడిషన్ గనుక) లేట్ మార్నింగ్ - హిందూ ఎడిషన్ మా కోసమే లోకల్ న్యూస్ వేస్తుందన్నట్లుగా ఎదురుచూస్తాం. రాయాల్సిన వాటిని ‘అయ్యవారే’ ఒక్కోసారి ‘మార్క్’ చేసి పంపుతారు. శ్రీరాములు సార్‌కిచ్చి, శ్రీరాములు గారికి ఫస్ట్ అయ్యవారిల్లు, ఆనక ఆసు. అది ఆయన దైనందిన చర్య. నాగరాజు, ఏబీవీల వంతు హిందూ కాపీ. ఇలా అదో ‘వంటిల్లు’. అదో ‘గర్భగుడి’.. అది ఫ్యాక్టరీ..
ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్‌లో చివరి పేరు నాది. ఇప్పుడు అది పైకి ఎగబ్రాకాలి? చుక్కల పర్వతం ఎక్కాల్సిందే ననుకున్నాక ఇక నాకు ‘పని ఎక్కువ’ ‘ఒత్తిడి’ లాంటి మాటలు స్ఫురించలేదు. ‘అన్నీ నాకే పడేయండి. ‘నేనే’ నొర్లేసుకుంటాను. బుక్ రివ్యూలా? ‘వో.. చేస్తా’ - నాలుగు రోజుల్లో నాలుగు బుక్స్ లాగించేస్తా’ అంటాను. అంతర్జాతీయ సంబంధాల మీద బ్యాక్‌గ్రౌండర్లా? (వాటికి చందాలు రొటీన్‌లో పోతాయి. ఏనాటి పత్రిక ఆంధ్రపత్రిక) అవి కుప్పలు.. నాకివ్వండి సార్!.. అయ్ లవ్ టు రిరైట్ దెమ్.. సినిమాకి పొమ్మంటారా? (రివ్యూకి) ఓకే రెడీ’ - ఇలా అంటూ వుండేవాణ్ని. అయితే సినిమాలకి డి.కె.ఎమ్. (ద్రోణంరాజు కృష్ణమోహన్) (కథారచయిత) నాగరాజు కూడా రెడీ.
మధ్యాహ్నం గంట కొట్టారు. ‘నువ్వు గంట కొట్టీ, నేనింటికి పరిగెడతా’ అనే స్కూలు పిల్లాడు ‘వీరాజీ’ అని వేళాకోళంగా నవ్వే వి.వి.ఎన్.గారు, ఆనాడు నవ్వలేదు. ఏమంటే, వీరాజీకి ఇంటర్‌బెల్ గంట వినబడలేదు. ‘హంగేరియన్ రివ్యూ’లో ‘సోనార్‌టోరాక్’ అనే ఒక గొప్ప హంగేరీ రచయిత రాసిన కథ ఒకటి, ఇంగ్లీషులో నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నాడు. అది ఆదివారం సారస్వతానుబంధానికి కంపోజింగ్‌కి ఇచ్చేసింతర్వాతే ‘సాపాటు’కి లేస్తాడు వీరాజీ’ అని అతనికి తెలియదు..
అది ఆదివారం అనుబంధంలో ప్రచురించిన నాటి నా తొలి కథ. దాని టైటిల్ - ‘చచ్చికూడా సాధించలేనివాడు’. ఉత్తమ పురుషలో సాగుతుంది కథనం. అదిక్కడ చిన్న పిసరు చెబుతాను - ‘మా వాడొకడు ఆత్మహత్య చేసుకోబోయి అది కాస్తా తప్పి -ఆస్పత్రిలో వున్నాడంటేనూ, నేనక్కడికి గబగబా బయలుదేరాను.. విచారిస్తూ..
డాన్యూబ్ నదిలో ‘దూకి’ చావు తప్పి కన్నులొట్టబోయిన ‘వాడి’ని పరామర్శించడం ఎట్లా?’ అన్న దాని మీద వ్యంగ్యంగా కథ సాగుతుంది. మానవ నైజానికి అక్షరద్దాలు పట్టిన ఈ కథ అంతా ‘వ్యంగ్య బాణాలే’. చివరగా సదరు ‘మా వాడు’ - పేపర్‌లో పేరు పడటం కోసం - నానా బాధలూ పడి, చివరికి తెగించి, ‘ఆత్మహంతకుల’ పేర్లు పేపర్లో వేస్తారు కనుక - ఆ విధంగానైనా, తన పేరు పేపర్లో పడాలని - నదిలో ‘దూకాడు’. కనీ, ఎవరో రక్షించగా, ఆస్పత్రిలో చేర్చబడ్డాడు. గానీ, వాడికిప్పుడు వొళ్లు మండిపోతోంది. తన ఫ్రెండ్‌ను చూస్తూనే - ఆ, అభాగ్యుడు - అయ్ హేట్ యూ జర్నలిస్ట్స్ అండ్ పేపర్స్.. డామిట్’ అంటూ, అంత నీరసంలోనూ, తీవ్రంగా తిడతాడు. అటు తిరుగుతాడు.
‘ఎవడో మంత్రిగాడు చిన్న కారెక్కి ప్రక్కవూరు వెళ్తేనే - ఇంత పొడుగు, అంతలేసి అక్షరాలతో రాస్తారే? నేను పేపర్లో పడ్డం కోసం ‘్ఛస్తే’ కూడా, నా పేరు వో మూల పారేస్తారా?’ అంటూ వాపోతాడు. అందుకు కూడా వాడు బాధపడక సర్దుకునేవాడే గానీ, పాపం! ఆ వేసిన రెండు లైన్ల వార్తలో కూడా - అతని పేరులో రెండు అచ్చుతప్పులు పడ్డాయి. ‘్ఛ! చచ్చి కూడా సాధించలేక పోయాను’ అంటూ దుఃఖపడతాడు ఆ ‘ఫ్రెండు’..
ఈ విమర్శని నేడు కూడా మనం ఎంతోమంది నోట వింటూ వుంటాం. తప్పదు. పేపర్ల వాళ్లు అంతే. పోనీ పేపర్‌లో పడితే, అదే ‘కైవల్యం’ అనుకున్న వాడి పేరైనా సరిగ్గా వేస్తారా? లేదు.. ‘కోడి తిరుమలరావు గారు తాను అధ్యక్షత వహించిన సభలని, పేపరులో వేస్తారేమోనని, సదరు రావుగారు తెల్లార్లూ ఎదురు చూస్తే - ‘కో.తి.రావు అధ్యక్షత వహించారు’ అని వేస్తారు. ‘అకటా దయలేని వారు మీ పత్రికల వారూ..’
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com