S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/21/2016 - 12:21

హైదరాబాద్: అక్షయగోల్డ్ కేసులో నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల ఆచూకీ దొరకడం లేదని సిఐడి అధికారులు చెప్పడంతో, నిందితుల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించాలని, వారి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఈనెల 26కి వాయిదా పడింది.

04/21/2016 - 12:19

నల్గొండ: యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం గర్భగుడిని మూసివేశారు. త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో భక్తుల దర్శనార్థం విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించారు. నరసింహస్వామి కవచ మూర్తులతో పాటు ఆండాళ్ అమ్మవారు, ఆళ్వార్ స్వామి, క్షేత్రపాలకుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించి హోమం జరిపారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

04/21/2016 - 12:18

వరంగల్: ఆకస్మికంగా మంటలు రావడంతో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారం ఉదయం కేసముద్రం స్టేషన్ వద్ద నిలిపివేశారు. వెంటనే రైల్వే సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేసి, ప్రమాదానికి కారణాలను ఆరా తీస్తున్నారు.

04/21/2016 - 12:17

ఖమ్మం: పాల్వంచలోని కెటిపిఎస్‌లో గురువారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మరమ్మతులు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

04/21/2016 - 11:05

హైదరాబాద్, ఏప్రిల్ 20: అక్రమ వడ్డీవ్యారి కరీంనగర్ ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి పేషీ ముందు ఆత్మహత్య చేసుకుంటామని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం హెచ్చరించింది. వడ్డీ వ్యాపారం ముసుగులో అమాయక ప్రజల వేలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్న మోహన్‌రెడ్డిపై సిబిఐచే దర్యాప్తు జరపాలని సంఘం డిమాండ్ చేసింది.

04/21/2016 - 11:02

హైదరాబాద్, ఏప్రిల్ 20: పాఠశాలల్లో ఫీజులను పెంచితే తాము తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్కూల్ ఫీజుల రెగ్యులేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు హెచ్చరించారు.

04/21/2016 - 11:02

హైదరాబాద్, ఏప్రిల్ 20: రంగారెడ్డి జిల్లా భోగారం హోలీమేరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి దినేశ్‌రెడ్డి కళాశాలకు సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దినేశ్ కాలేజి హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం ఘట్‌కేసర్‌కు వెళ్తున్నట్టు తన స్నేహితులకు మెస్సేజ్ పెట్టాడు. బుధవారం కళాశాల సమీపంలో శవమై కనిపించాడు.

04/21/2016 - 11:01

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఈ విద్యాసంవత్సరం నుంచే 250 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వీటిలో 130 ఎస్సీలకు, 50 ఎస్టీలకు, 70 మైనార్టీలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలలో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

04/21/2016 - 11:00

హైదరాబాద్, ఏప్రిల్ 20: మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫార్టెస్ట్ కాలేజీకి 118 పోస్టులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే కాలేజీ ప్రారంభం కావాలన్నారు. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలన్నారు.

04/21/2016 - 10:48

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 20: అభివృద్ధిలో ఎర్రవల్లి రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో నూతనంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడారు. రైతులకు సేవలు అందించేందుకు ఎర్రవల్లిలో ఎపిజివిబిని ఏర్పాటు చేసినందుకు బ్యాంకు అధికారులను అభినందించారు.

Pages