తెలంగాణ

ఈ విద్యాసంవత్సరం నుంచే 250 గురుకుల పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఈ విద్యాసంవత్సరం నుంచే 250 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వీటిలో 130 ఎస్సీలకు, 50 ఎస్టీలకు, 70 మైనార్టీలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలలో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం కొత్తగా ఏర్పాటు చేయబోయే రెసిడెన్షియల్ విద్యా సంస్థలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు చూడాలని, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రదేశాలు గుర్తించాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లతో చర్చించి రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి ఆదేశించారు. మండల కేంద్రాల్లోనే విద్యాసంస్థలు ఉండాలనే నిబంధన ఏమి లేదని, విద్యార్థులకు అనువైన స్థలం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.