S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/22/2016 - 14:28

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం పాతబస్తీలోని గౌలిగూడ వద్ద శోభాయాత్ర కోలాహలంగా మొదలైంది. ఈ యాత్ర సికిందరాబాద్ వద్ద తాడ్‌బంద్ వరకూ కొనసాగుతుంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు దారిపొడవునా యాత్రలో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

04/22/2016 - 11:57

హైదరాబాద్: పౌరాణిక పాత్రలతో అలరించిన తన తండ్రి ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తన 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెరకెక్కుతోందని, ఇది తన నటజీవితంలోనే మైలురాయిగా నిలుస్తుందని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

04/22/2016 - 11:57

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే అధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో తొలిసారిగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం.

04/22/2016 - 11:55

హైదరాబాద్: తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగువాళ్ల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. నటుడు బాలకృష్ణ నూరవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తపు సన్నివేశం ప్రారంభం సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ చెక్కుచెదరకుండా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.

04/22/2016 - 11:54

హైదరాబాద్: భర్త, అత్త నిత్యం వేధిస్తున్నందున జీవితంపై విరక్తి చెందిన జ్యోతిశ్రీ అనే 23 ఏళ్ల గృహిణి గురువారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త ఇంట్లోలేని సమయంలో ఆమె ప్రాణాలు తీసుకుంది. తెనాలికి చెందిన రమేష్‌బాబుతో జ్యోతిశ్రీకి 11 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచే ఆమెను భర్త, అత్త వేధించడం ప్రారంభించారు. తన ఆత్మహత్యకు వీరిద్దరే కారణమని జ్యోతిశ్రీ సూసైడ్ నోట్‌లో రాసింది.

04/22/2016 - 11:53

హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తామని యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి పరారైన దంపతుల కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రసన్న, రాజలింగం దంపతులు బంజారాహిల్స్‌లో ఓ కార్యాలయం తెరిచి కోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని పలువురు యువకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు.

04/22/2016 - 11:53

హైదరాబాద్: ఇక్కడి ఉప్పల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయకుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది. కట్నం వేధింపుల పేరిట భార్య కేసు పెట్టడంతో మానసికంగా కుంగిపోయి విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు వరంగల్ జిల్లాకు చెందినవాడని చుట్టుపక్కలవారు తెలిపారు.

04/22/2016 - 08:45

నల్లగొండ, ఏప్రిల్ 21: తెలంగాణ తిరుపతి యాదాద్రి పుణ్యక్షేత్రంలోని గుట్టపై నూతనంగా నిర్మించిన బాల ఆలయాన్ని గురువారం లక్ష్మీనరసింహుల కవచమూర్తుల ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలను ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ప్రధాన ఆలయంలో స్వయంభూ లక్ష్మీనరసింహులకు పూజలు నిర్వహించి పూర్ణకుంభంలోకి స్వామివారలను ఆవాహన చేశారు.

04/22/2016 - 08:43

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఇంటర్నేషనల్ యూత్ ఎంపవర్‌మెంట్ సెంటర్ (ఐవైఇసి)-తెలంగాణ ప్రభుత్వం మధ్య గురువారం ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.

04/22/2016 - 08:42

హైదరాబాద్, ఏప్రిల్ 21: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా మార్చుతామని మున్సిపల్, పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే చూస్తుందన్నారు.

Pages