తెలంగాణ

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రంగారెడ్డి జిల్లా భోగారం హోలీమేరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి దినేశ్‌రెడ్డి కళాశాలకు సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దినేశ్ కాలేజి హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం ఘట్‌కేసర్‌కు వెళ్తున్నట్టు తన స్నేహితులకు మెస్సేజ్ పెట్టాడు. బుధవారం కళాశాల సమీపంలో శవమై కనిపించాడు. దినేశ్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా సుందరశాల వాసి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

బిటి కాటన్ రాయల్టీపై
స్టేను సస్పెండ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ ప్రభుత్వం బిటి కాటన్ విత్తనాల ప్యాకెట్‌పై రూ. 50 రాయల్టీని విధించే విషయమై సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన స్టేను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మోనోశాంటో బయోటెక్ సంస్ద ప్రభుత్వ నిర్ణయాన్ని, జీవోను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌నుపరిగణనలోకి తీసుకున్న సింగిల్ జడ్జి కోర్టు గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టేను తొలగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్టే ఇస్తూ బిటి కాటన్ అమ్మకం ధరలు వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్లను లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.