S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/21/2016 - 10:46

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20: తమకు విధులు, నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అధికార టిఆర్‌ఎస్ పార్టీ జడ్పీటిసిలు మహబూబ్‌నగర్ జిల్లాలో తిరగబడ్డారు. బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా జడ్పీటిసిలు సమావేశాన్ని బహిష్కరించడంతో సమావేశం వాయిదా పడింది.

04/21/2016 - 10:44

ఏటూరునాగారం, ఏప్రిల్ 20: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఈనెల 27కల్లా వరంగల్ నగర ప్రజలకు తాగునీరు అందిస్తామని వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర మేయర్ నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. నగర ప్రజలకు తాగునీరందించేందుకు రూ.8.69 కోట్లతో మండలంలోని దేవాదుల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.

04/21/2016 - 10:43

నాగార్జునసాగర్, ఏప్రిల్ 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత విధులు నిర్వహించే ఎస్‌పిఎఫ్ సిబ్బంది సాగర్ ప్రాజెక్టు ఉద్యోగులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, దానికి నిరసనగా బుధవారం డిఇ స్థాయి ఉద్యోగుల నుండి అటెండర్ స్థాయి వరకు విధులు బహిష్కరించారు.

04/21/2016 - 10:40

హైదరాబాద్, ఏప్రిల్ 20: తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌ను నియమిస్తూ భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తారు. బూత్ స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణ, పార్టీ అభ్యర్థుల వ్యయం, మద్యం, డిస్టిల్లరీల కార్యకలాపాలతోపాటు పెయిడ్ న్యూస్, బ్యాంక్ లావాదేవీలపై నిఘా వేస్తారు.

04/21/2016 - 10:39

నిజామాబాద్, ఏప్రిల్ 20: స్థానికంగా పరిస్థితులు అనుకూలించక కుటుంబ పోషణ కోసం ఎడారి దేశాల బాట పడుతున్న యువకులకు పుట్టెడు దుఃఖమే మిగులుతోంది. లక్షల రూపాయల అప్పులు చేసి కాసుల వేటలో పరాయి దేశాలకు వెళ్తున్న వారికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూ నరకయాతన అనుభవిస్తున్నారు.

04/21/2016 - 10:35

ఖమ్మం, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 15 సంవత్సరాల తర్వాత ఖమ్మం నగరంలో ఆ పార్టీ ప్లీనరీ ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నారు. పార్టీ పరంగా అతి పెద్ద కార్యక్రమం కావడంతో నేతలంతా హడావుడిగా కమిటీలు వేసుకొని పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

04/20/2016 - 18:00

మెదక్: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనుల తీరుపై అధికారులతో సమీక్షించారు. గ్రామాభివృద్ధి కమిటీ కోరిక మేరకు ఆయన ఎర్రవల్లిలోని గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖను సందర్శించి అక్కడ పూజలు చేశారు.

04/20/2016 - 17:58

హైదరాబాద్: తమ కళాశాలల్లో తనిఖీలు చేయాలని పోలీసులొస్తే ప్రతిఘటిస్తామని తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జెఎసి హెచ్చరించింది. ఈ నెల 22న జరిగే తమ సంఘం సర్వసభ్య సమావేశంలో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని, అంతవరకూ తమ ఆందోళన సాగుతుందన్నారు. ప్రభుత్వం నిర్వహించే పలు ప్రవేశపరీక్షలకు సహకరించాలా? వద్దా? అనే విషయమై తుది నిర్ణయం ప్రకటిస్తామని జెఎసి నేతలు తెలిపారు.

04/20/2016 - 17:57

హైదరాబాద్: తెలంగాణలో గురువారం జరిగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 288 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు విద్యాసంస్థలు సుముఖత తెలపడంతో యథాప్రకారం ఎంట్రన్స్ జరుగుతుంది.

04/20/2016 - 17:06

హైదరాబాద్: గురువారం జరిగే పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్) కు సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జెఎసి ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలకు తాము వ్యతిరేకం కాదని అయితే పోలీసులను పంపడాన్ని తాము సహించేది లేదని జెఎసి అధ్యక్షుడు రమణారెడ్డి బుధవారం తెలిపారు. పాలిసెట్‌కు తప్ప మిగతా ఎంట్రన్స్‌లను తమ సంస్థల్లో నిర్వహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Pages