తెలంగాణ

ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 15 సంవత్సరాల తర్వాత ఖమ్మం నగరంలో ఆ పార్టీ ప్లీనరీ ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నారు. పార్టీ పరంగా అతి పెద్ద కార్యక్రమం కావడంతో నేతలంతా హడావుడిగా కమిటీలు వేసుకొని పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సుమారు 3వేల మంది ప్రతినిధులు హాజరవుతుండటం, ఆ పార్టీకి చెందిన ప్రధాన నేతలంతా ముందురోజే ఖమ్మంకు చేరుకొని ప్లీనరీలో పాల్గొనే అవకాశం ఉండటంతో జిల్లా నేతలు పనులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదే సమయంలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా వచ్చిన నేపథ్యంలో రెండు పనులను ఒకేసారి చేయాల్సి రావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. గత 15 ఏళ్ళుగా టిఆర్‌ఎస్ ప్లీనరీ ఏ జిల్లాలో ఎవ్వరూ నిర్వహించని విధంగా నిర్వహించాలని ప్లీనరీ కమిటీ గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పది కమిటీలు ఏర్పాటై పనులను కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా ప్లీనరీని భారీగా నిర్వహించాలని అనుకోవడం సంతోషమే అయినా ప్లీనరీ ప్రచారాన్ని నిర్వహించడంలో జిల్లా నాయకత్వం విఫలమైంది. నియోజకవర్గాల వారిగా పూర్తిస్థాయిలో సమావేశాలను కూడా ఇంకా నిర్వహించలేదు. ప్లీనరీ ఆవశ్యకత, ప్రాముఖ్యతను గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళలేకపోయారు. గ్రామీణ స్థాయిలో అనేక మంది నేతలకు ఇంకా ప్లీనరీ విషయమే తెలియలేదంటే ప్రచారంలో ఎంత వెనుకబడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందించాయి. దీంతో ఆయన పార్టీ నేతలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్లీనరీ కమిటీల్లో ఉన్న నేతల్లో కొందరికి కూడా సమాచారం పూర్తిగా అందకపోవడం గమనార్హం. కాగా ప్లీనరీకి మరో ఐదురోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేయాలని మండల, గ్రామీణ స్థాయిలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధినాయకత్వం ఆదేశాలు జారీచేసినా తుమ్మల నాగేశ్వరరావు మినహా జిల్లా నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుని హోదాలో బేగ్ అటు సమావేశాలు, ఇటు ఏర్పాట్లు పరిశీలిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవి జరగడంలేదని అనేక మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు కేవలం మంత్రి తుమ్మలతో మాత్రమే పర్యటిస్తూ మిగిలిన సమయాల్లో దూరంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి.