S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/20/2016 - 07:19

హైదరాబాద్, ఏప్రిల్ 19: మిషన్ కాకతీయను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఐదు లక్షల చిన్న తరహా నీటి కుంటలు( వాటర్ పాండ్) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

04/20/2016 - 07:19

హైదరాబాద్, ఏప్రిల్ 19: రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇక నుంచి పగలు 6 గంటలు, రాత్రి 3 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్ కార్యాలయంలో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/20/2016 - 07:13

హైదరాబాద్, ఏప్రిల్ 19: నగర పోలీసులు నిన్నటి వరకు నగరంలో వాహనదారులు హెల్మెట్, లైసెన్స్‌లు కలిగివుండాలనే నిబంధనపై కఠినంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. తాజాగా రవాణా శాఖ, నగర పోలీసులు కలసి మరో అడుగు ముందుకు వేసి ఆటోల క్రమబద్దీకరణపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఆటోరిక్షాల క్రమబద్ధీకరణపై రెండు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

04/20/2016 - 07:13

చిలుకూరు, ఏప్రిల్ 19: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామపంచాయతీ ఆవాసం మాధవగూడెం గ్రామంలో దళితుల ఆలయ ప్రవేశం నిషేధం ఘటనపై మంగళవారం జిల్లా అధికారులు విచారణ జరిపారు.

04/20/2016 - 07:12

కురవి, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనవైపే ప్రపంచం యావత్తు దృష్టిసారించిందనీ, ఆయన ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రజాసంక్షేమం కోసమేనని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. రానున్న విద్యాసంవత్సరం నుండి స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరిక మేరకు డోర్నకల్ నియోజకవర్గంలో మరో మూడు గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

04/20/2016 - 07:11

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఈస్ట్‌జోన్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అర కిలో బంగారు, కిలోన్నర వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

04/20/2016 - 07:10

నాగార్జునసాగర్, ఏప్రిల్ 19: నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మంగళవారం సాగర్ డ్యాం భద్రత అధ్యయన సమీక్ష కమిటీ సందర్శించి పరిశీలించింది. కమిటీ చైర్మన్ ఎం.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో పలు రంగాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులు సోమవారం రాత్రి సాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్నారు.

04/20/2016 - 04:30

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు మెస్ బకాయిలు 3,061 కోట్ల 69లక్షల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌సి సంక్షేమ శాఖకు 517.35 కోట్లు, గిరిజన సంక్షేమం 288.92 కోట్ల రూపాయలు, బిసి సంక్షేమం 1954.25 కోట్ల రూపాయలు, వికలాంగుల సంక్షేమం 0.68 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 3061.69 కోట్లు విడుదల చేశారు.

04/20/2016 - 04:28

హైదరాబాద్, ఏప్రిల్ 19: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు మరో అడుగు పడింది. హుస్సేన్ సాగర్‌లో పేరుకు పోయిన వ్యర్థాలను ఏరి వేసేందుకు ఆంఫిబియస్ ఎక్స్‌కెవేటర్ అనే భారీ యంత్రాన్ని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్‌కు ప్రమాదకరమైన రసాయనాలను తీసుకు వస్తున్న మురి కి నీటి కాలువల మళ్లింపు పను లు 90 శాతం వరకు పూర్తయ్యాయి.

04/20/2016 - 04:24

రాజేంద్రనగర్, ఏప్రిల్ 19: వెటర్నరీ వైద్యుల నియామకాలు డిపార్టుమెంట్ కమిటీ ద్వారా చేపట్టాలని రెండు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది. వర్శిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని నిర్బంధించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు భారీయెత్తున తరలివచ్చారు. ఆడిటోరియాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.

Pages