తెలంగాణ

ప్రవాహాన్ని తట్టుకునేలా క్రస్ట్‌గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 19: నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మంగళవారం సాగర్ డ్యాం భద్రత అధ్యయన సమీక్ష కమిటీ సందర్శించి పరిశీలించింది. కమిటీ చైర్మన్ ఎం.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో పలు రంగాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులు సోమవారం రాత్రి సాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఉదయం, సాయంత్రం సమయంలో మాత్రమే ఈ కమిటీ సాగర్‌కు సంబంధించిన పలు ప్రదేశాలను సందర్శించనుంది. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఈ కమిటీ సాగర్ మెయిన్ డ్యాంను డ్యాం ఉన్నతాధికారులతో కలిసి సందర్శించింది. ఈ సందర్భంగా ఎం.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో ప్రదాన్, పోలె, చౌదరి, శర్మ, మాజీ చీఫ్ ఇంజనీర్ శరత్‌చంద్రారెడ్డి, చంద్రమోహన్‌లు సందర్శించారు. దీనిలో భాగంగా మొదటగా లెఫ్ట్ ఎర్త్ డ్యాంను ప్రత్యేక నిపుణులైన ప్రధాన్ ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. అనంతరం పోలె ఆధ్వర్యంలో డ్యాం సీకేజ్ వాటర్‌ను పరిశీలించారు. అనంతరం ప్రధాన డ్యాంపై ఉన్న క్రస్ట్ గేట్లను చేరుకుని సుమారు గంటన్నర సేపు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం క్రస్ట్‌గేట్ల పనితీరును కమిటీ అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా 26 క్రస్ట్‌గేట్లలో 9వ నెంబర్ గేటుతోపాటు మరో 4 గేట్లను పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచి వాటి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. దీనిలో భాగంగా గేట్లు ఎత్తి దించేటప్పుడు పెద్దపెద్ద శబ్దాలు వస్తుండడం చూసి వాటి నివారణకై చర్యలు తీసుకోనున్నారు. ఆపై రైట్ ఎర్త్‌డ్యాంకు చేరుకుని అక్కడ మట్టికట్టలను పరిశీలించారు.
అనంతరం విజయవిహార్‌లోని సమావేశ మందిరంలో డ్యాం ఉన్నతాధికారులైన చీఫ్ ఇంజనీర్ పురుషోత్తంరాజు, ఎస్‌ఇ రమేశ్, ఇఇ విష్ణుప్రసాద్, సిఇలు విజయ్‌కుమార్, సాల్మాన్, సురేందర్, సుదర్శన్, ఎఇలు రామారావు, జైల్‌సింగ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాయంత్రం నాగార్జునసాగర్ డ్యాంలోని ప్రధాన భాగమైన స్పిల్‌వేను సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న స్పిల్‌వే పరిస్థితిపై మరమ్మతులు చేసే విధానంపై సమీక్షించారు. అనంతరం కమిటీ చైర్మన్ ఎం.ఎస్.రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత విషయంలో ప్రతి ఆరు నెలలకొకసారి ప్రాజెక్టును సందర్శించి అధ్యయనం చేస్తామని, గతంలో ఇచ్చిన నివేదికలను ఎంతవరకు అమలు చేస్తున్నారనే దానిని పరిశీలించడంతోపాటు ప్రస్తుతం ఇచ్చే నివేదికను డ్యాంకు ఎంతవరకు ఉపయోగపడతాయని సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందచేస్తామన్నారు. కాగా, మంగళవారం జరిపిన పరిశీలనలో డ్యాం క్రస్ట్‌గేట్ల పనితీరు మరమ్మతులకు గురైనట్టు గుర్తించామని, వాటిని వెంటనే పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలిపారు. దీంతోపాటు సాగర్ జలాశయంలో అంతర్భాగంగా ఉన్న డైవర్షన్ టన్నల్‌ను ఉంచాలా తీసివేయాలా అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 12 లక్షల క్యూసెక్కుల నీరు క్రస్ట్‌గేట్ల పైనుండి వెళ్ళే విధంగా ఆధునికీకరణ జరిగిందని, కానీ రెట్టింపుస్థాయిలో నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా డ్యాం భద్రతను పెంచే విధంగా తమ కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని తెలిపారు. బుధ, గురువారాలు కూడా కుడి, ఎడమకాల్వల ప్రధాన ద్వారాలను, విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయిలో సందర్శించి అనంతరం ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందచేయనున్నట్లు వారు తెలిపారు.

సాగర్ డ్యాం క్రస్ట్‌గేట్లను పరిశీలిస్తున్న
నిపుణుల బృందం. డ్యాం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న అధ్యయన కమిటీ