తెలంగాణ

విదేశీ యంత్రాలతో వ్యర్థాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు మరో అడుగు పడింది. హుస్సేన్ సాగర్‌లో పేరుకు పోయిన వ్యర్థాలను ఏరి వేసేందుకు ఆంఫిబియస్ ఎక్స్‌కెవేటర్ అనే భారీ యంత్రాన్ని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్‌కు ప్రమాదకరమైన రసాయనాలను తీసుకు వస్తున్న మురి కి నీటి కాలువల మళ్లింపు పను లు 90 శాతం వరకు పూర్తయ్యాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌లో ఇప్పటి వరకు ఉన్న కాలుష్యమే తప్ప కొత్తగా కాలుష్యం చేరే అవకాశం లేదు. ఇక హుస్సేన్ సాగర్‌లో ఇప్పటికే చేరుకుని ఉన్న విషపూరిత వ్యర్థాలను తీసివేయడం ప్రారంభం అయింది. దీనికోసం విదేశాల నుంచి తెచ్చిన ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం కెటిఆర్ ప్రారంభించారు. హుస్సేన్ సాగర్‌ను మంచినీటి సరస్సుగా తీర్చిదిద్దుతామని కెటిఆర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. నాలాల మళ్లింపు పనులు 90శాతం వరకు పూర్తయినట్టు చెప్పారు. ప్రధాన నాలాల పూడికతీతకు 29 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినట్టు, వర్షాకాలం లోపే పూడిక తీత పనులు పూర్తి చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. జైకా నిధులు 370 కోట్ల రూపాయలతో హుస్సేన్ సాగర్ అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. దాదాపురెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆంపిబియోస్ యంత్రం రోజుకు ఎనిమిది గంటల పాటు పని చేస్తుంది. నీటిలో, భూమిపై పని చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. లోతు నీళ్లలో ఉంటూ దూరంగా ఉన్న పూడికను సైతం తొలగించగలదు. విగ్రహాల నిమజ్జనం వల్ల సాగర్‌లో చేరిన వ్యర్థాలను తొలగిస్తుంది. పికెట్, కూకట్‌పల్లి, యూసఫ్ గూడ, బల్కాపూర్ నాలాల నుంచి వచ్చి చేరుతున్న బురద మట్టిని, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ వెంబడి పేరుకుపోయిన ఒండ్రును ఈ యంత్రం ద్వారా తొలుత తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలను తొలగించి ఆక్సిజన్ లెవల్ పెంచడంలో ఈ యంత్రం ఉపయోగపడుతుంది.

చిత్రం... హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలను ఏరి వేసేందుకు ఆంఫిబియస్ ఎక్స్‌కెవేటర్ అనే భారీ యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్