తెలంగాణ

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఈస్ట్‌జోన్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అర కిలో బంగారు, కిలోన్నర వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈస్ట్‌జోన్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిసి రవీందర్ వెల్లడించిన వివరాలిలావున్నాయి. రాజస్తాన్‌కు చెందిన భరత్‌కుమార్ మోతీలాల్ (27), హక్మారామ్ చౌదరి అలియాస్ కైలాష్ (27), దినేష్ కుమార్ (39) అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఫిదా హుస్సేన్ (24), ఇక్బాల్ (31) చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరు నగరంలో మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్‌లుగా ఉన్నారు. వీరిపై నగరంలోని ఐదు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ పోలీసు స్టేషన్లలో చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి కేసులు, పలు ఇళ్లలో దోపిడీకి పాల్పడిన కేసులు ఉన్నాయి. భరత్‌కుమార్ తన ముఠా సభ్యులతో హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీలలో ఇళ్ళ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరిపై 16 కేసులు నమోదు కాగా మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. కాగా మంగళవారం ఓ ఇంట్లో జరిగిన చోరీపై దర్యాప్తు చేస్తుండగా వీరు ఈస్ట్‌జోన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. భరత్‌కుమార్, కైలాష్, దినేష్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్టు అంగీకరించారని, వారి నుంచి అర కిలో బంగారం, కిలోన్నర వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి కోటి రెడ్డి తెలిపారు. వీరిపై పిడి యాక్టు పెట్టనున్నట్టు ఆయన వివరించారు. నిందితులను పట్టుకున్న మలక్‌పేట ఎసిపి సుధాకర్, కాచిగూడ ఎసిపి లక్ష్మినారాయణ, ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్, సుధాకర్, రవికుమార్, శ్రీనివాస్, నాగేశ్వరరావులను ఆయన అభినందించారు.

ఆదాయ పన్ను కార్యాలయం
చిరునామా మార్పు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: ప్రస్తుతం నగరంలోని ఇన్‌కమ్ టాక్స్ టవర్స్, ఏసి గార్డ్స్, హైదరాబాద్ ఆదాయపు పన్నుల శాఖకు చెందిన కార్యాలయాలను సిగ్నేచర్ టవర్స్, బొటానికల్ గార్డెన్స్ ఎదురుగా, కొండాపూర్, శేరిలింగంపల్లికు మార్చినట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (హెడ్ క్వార్టర్స్, అడ్మినిస్ట్రేషన్) కిరణ్ కట్టా ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పన్ను చెల్లించే వారు ఆదాయపు పన్ను శాఖతో లావాదేవీలు జరిపే వారు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. ఈ నెల 25 నుంచి ఇక్కడి కార్యాలయాలు పనిచేస్తాయని ఆయన వివరించారు.
అమెరికాలో తెలంగాణ
సభలకు డిజిపికి ఆహ్వానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించే ప్రపంచ తెలంగాణ సమావేశాలకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మను అక్కడ పనిచేస్తున్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ సభ్యులు ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలంగాణ సమావేశాలకు రావలసిందిగా కోరుతూ డిజిపి అనురాగ్‌శర్మను ఆయన కార్యాలయంలో నిర్వాహకులు కలిశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రచురించిన వివిధ పోస్టర్లను డిజిపి ఆవిష్కరించారు.
డిజిపిని కలసిన వారిలో ఫోరం అధ్యక్షుడు కలువల విశే్వశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రజనీకాంత్, మీడియా కో-ఆర్డినేటర్ పి బసంత్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు ఉన్నారు. తాము నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు పలువురు మంత్రులు, అధికారులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. 17 సంవత్సరాలుగా తమ సంస్థ తెలంగాణకు సంబంధించిన అనేక పండుగలు, విజ్ఞాన, వినోదాత్మక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.