తెలంగాణ

ఆలయంలోకి దళితుల నిషేధంపై ఆర్డీవో విచారణ ( ఆంధ్రభూమి వార్తకు స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరు, ఏప్రిల్ 19: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామపంచాయతీ ఆవాసం మాధవగూడెం గ్రామంలో దళితుల ఆలయ ప్రవేశం నిషేధం ఘటనపై మంగళవారం జిల్లా అధికారులు విచారణ జరిపారు. ఈనెల 15న జరిగిన శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రామంలోని దళితులను రామాలయంలోకి రానివ్వకుండా దేవాలయ కమిటీ నిర్ణయించడంతో దళితులు రాముని కళ్యాణానికి దూరమైన సంఘటనపై ‘ఆలయంలోకి దళితుల నిషేధం’ శీర్షికన ఆంధ్రభూమిలో కథనం ప్రచురితమైంది.. ఈ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమాధికారి దయానందరాణి, తహశీల్దార్ కె.దామోదర్, సిఐ మధుసూదన్‌రెడ్డి గ్రామంలో దేవాలయ కమిటీ సభ్యులు, దళితులను సమావేశపర్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. గ్రామంలో బిసి సామాజికవర్గం మాత్రమే దేవాలయ నిర్మాణానికి చందాలు వేసుకుని నిర్మించుకున్నటు,్ల దళితులు ఎవరూ చందాలు ఇవ్వలేదని, చండీయాగానికి డబ్బులు చెల్లించిన వారినే శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన స్వామివారి కల్యాణం పీటలపై కూర్చోబెడతామని కమిటీ వారు ఆర్డీవోకు వివరించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎవరి కులాచారం ప్రకారం వారు నడుచుకోవాలని, ఏనాడూ దళితులు రాముని కళ్యాణం పీటలపై కూర్చోలేదని, అందుకే ఆలయ ప్రవేశాన్ని నిషేధించినట్లు విచారణలో తేలింది.
కులవివక్ష వాస్తవమే: ఆర్డీవో
మాధవగూడెంలోని రామాలయంలో దళితుల ప్రవేశ నిషేధం వాస్తవమేనని ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కులాచారం ప్రకారం దళితులు ఏనాడూ రాముడి పెళ్లిపీటలపై కూర్చోలేదని గ్రామపెద్దలు నిర్ణయించి దళితులను ఆలయ ప్రవేశానికి దూరం చేసినట్లు తమ విచారణలో వెల్లడైందనిఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ క్రాంతికుమార్, సోషల్ వె ల్ఫేర్ అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.