S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/19/2016 - 01:47

నల్లగొండ, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్రం కరవు బారిన పడి ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఓట్ల మత్తులో ఫామ్‌హౌస్‌లో పడుకుంటూ కరవు తీవ్రతను పట్టించుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.

04/19/2016 - 01:45

నాగార్జునసాగర్, ఏప్రిల్ 18: నాగార్జునసాగర్‌కు సోమవారం రాత్రి సాగర్ డ్యాం సేఫ్టీ రివ్యూప్యానెల్ చేరుకుంది. కమిటీ చైర్మన్ ఎం.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల ప్రత్యేక ఇంజనీరింగ్ నిపుణులు పోలె, ప్రదాన్, శర్మ, చౌదరి ఉన్నారు. సాగర్‌కు చేరుకున్న వీరికి డ్యాం ఎస్‌ఇ రమేశ్, ఇఇ విష్ణుప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం మూడురోజులపాటు సాగర్‌లో సేఫ్టీ రివ్యూప్యానెల్ నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.

04/19/2016 - 01:40

కొండపాక, ఏప్రిల్ 18: మిషన్ భగీరథ పనులు ఈనెల 30లోగాపూర్తి చేసి ప్రజలకు నీరందించాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేస్తు పనులు పూర్తి చేయకపోవడం పట్ల డిప్యూటి సిఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా కొండపాక మండలం వెలికట్ట శివారులో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు.

04/19/2016 - 01:36

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు రాష్ట్ర హైకోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావును మార్చాలని దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్‌ను సోమవారం హైకోర్టు విచారణ జరుపుతున్నపుడు విహెచ్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

04/19/2016 - 01:17

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావుకు కోపం వచ్చింది. సోమవారం గాంధీ భవన్‌లో టి.పిసిసి బిసి విభాగం చైర్మన్ చిత్త రంజన్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వి. హనుమంత రావుకు ఆహ్వానం రాలేదు. సోమవారం విహెచ్ కోర్టుకు హాజరై, అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్‌కు వచ్చారు. అయితే అప్పటికే బిసి కమిటీ సమావేశం ముగిసింది.

04/19/2016 - 01:09

హైదరాబాద్, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులపై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నది.

04/18/2016 - 18:18

హైదరాబాద్: ఆకస్మిక వర్షానికి ముందు పిడుగులు పడడంతో రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఇద్దరు మరణించారు. యాచారం మండలం మేడిపల్లిలో ఒకరు, గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలో మరొకరు పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు.

04/18/2016 - 18:17

నల్గొండ: బొమ్మల రామారంలో గట్టుమైసమ్మ ఉత్సవాల్లో సోమవారం విద్యుత్ షాక్‌తో ఇద్దరు మరణించారు. దీంతో ఉత్సవాలను రద్దు చేశారు.

04/18/2016 - 18:17

సికిందరాబాద్: ఇక్కడి తిరుమలగిరి ప్రాంతంలో సోమవారం వేగంగా వస్తున్న వస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మరణించారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

04/18/2016 - 18:16

హైదరాబాద్: మంత్రి చందూలాల్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేశారన్న విషయమై తెలంగాణ సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని ఎసిబిని ఆదేశించారు. కొన్ని ఫైళ్లపై మంత్రి సంతకాలను ఫోర్జరీ చేసిన వారిని వెంటనే గుర్తించాలని సిఎం ఉత్తర్వులు జారీ చేశారు.

Pages