S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/17/2016 - 21:14

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి, వలసలు నివారించడానికి ఆ పార్టీ అధిష్టానం రెండేళ్ళ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ నిద్రాణమైన పరిస్థితుల్లో ఉందని భావించిన అధిష్టానం శనివారం జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది.

04/17/2016 - 21:13

హైదరాబాద్, ఏప్రిల్ 16: న్యాయ వ్యవస్థ (జ్యుడిష్యరీ)లో, ప్రైవేటు, పబ్లిక్ రంగాల్లో ఉద్యోగ నియమాకాల్లో ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు శనివారం దీక్ష నిర్వహించారు. ఇందిరా పార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విహెచ్ దీక్ష చేశారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

04/17/2016 - 21:10

హైదరాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్రంలో కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు తెలుగు దేశం పార్టీ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు పర్యటించాలని నిర్ణయించింది. జిల్లాల్లో 18 నుంచి 25వ తేదీ వరకు 10 బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు.

04/17/2016 - 21:09

హైదరాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ‘జూ’లో ఉన్న పిల్లిలాంటి వాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. మంత్రి జూపల్లికి తనను విమర్శించే స్థాయి లేదని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పందిస్తే దానికి తాను సమాధానం చెబుతానని ఆమె శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

04/17/2016 - 21:07

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ సొసైటీ ఉపాధ్యక్షుడు జె రవీందరెడ్డి, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సొసైటీలో దాదాపు రూ. 419 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని వారు పిటిషన్‌లో ఆరోపించారు.

04/17/2016 - 21:06

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా మండలాల్లో క్యాట్ ఫిష్ పెంపకం సాగుతోందని, దీనిని నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందంటూ ఆ జిల్లాకు చెందిన ఎంపిటీసీలు రాధా కృష్ణారెడ్డి, రాఘవేందర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

04/17/2016 - 16:42

హైదరాబాద్:అత్యధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న భాగ్యనగరంలో ఆదివారం మధ్యాహ్నం పలుచోట్ల కురిసన వానతో నగరవాసులకు కాస్తంత ఉపశమనం లభించింది. కొన్ని రోజులుగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో అల్లల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త తెరిపి దొరికింది. బోడుప్పల్, ఇసిఐఎల్, అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లుండి మబ్బులు కమ్మి చల్లనిగాలులు వీచి వర్షం కురియడంతో నగరం చల్లబడింది.

04/17/2016 - 06:15

నల్లగొండ/ఆదిలాబాద్/మహబూబ్‌నగర్/కరీంనగర్/వరంగల్, ఏప్రిల్ 16: ఎండల తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వడదెబ్బతో 11 మంది మృతి చెందారు.

04/17/2016 - 06:15

ఆదిలాబాద్, ఏప్రిల్ 16: ఆదిలాబాద్ జిల్లాలో నిప్పుల కుంపటి రాజేస్తోంది. పదేళ్ల రికార్డును తిరగరాసి ఏప్రిల్ మాసంలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

04/17/2016 - 06:15

గజ్వేల్, ఏప్రిల్ 16 : పోలవరం ముంపు భూముల వ్యవహారంలో తెలంగాణ సిఎం కెసిఅర్, ఎపి సిఎం చంద్రబాబు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. 16 వందల టిఎంసి గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుండగా వాటిని తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం అంశంపై దృష్టి సారించాలని సూచించారు.

Pages