S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/19/2016 - 12:25

హైదరాబాద్: కాసుల కోసం కక్కుర్తిపడి వైద్యులు రోగులకు అనవసరంగా సర్జరీలు చేస్తే కఠిన చర్యలు ఖాయమని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వైద్యులు అనవసరంగా శస్తచ్రికిత్సలు చేస్తున్నారని, వీరి వల్ల ఆరోగ్యశాఖకు చెడ్డపేరు వస్తోందన్నారు. ప్రభుత్వ డాక్టర్లయినా, ప్రైవేటు వైద్యులైనా నిబంధనల్ని అతిక్రమించరాదన్నారు.

04/19/2016 - 12:25

మెదక్: నాలుగేళ్ల బాలికను కన్నతల్లిదండ్రులే చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బందితో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. జిన్నారం పోచమ్మ బస్తీలో ఉంటున్న రాధిక, చక్రవర్తి దంపతులు సొంత కుమార్తెను నిత్యం హింసిస్తున్నట్లు ఓ అజ్ఞాత వ్యక్తి చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

04/19/2016 - 12:24

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం వద్ద మంగళవారం నాడు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వెటర్నరీ విద్యార్థులు అడ్డుకుని తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో 45 ప్రకారం ఉద్యోగ నియామకాలు జరపాలని విద్యార్థులు మంత్రిని డిమాండు చేశారు.

04/19/2016 - 05:15

ఖమ్మం, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై టిఆర్‌ఎస్ ప్లీనరీలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

04/19/2016 - 01:53

చేర్యాల, ఏప్రిల్ 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల పట్ల ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం కిష్టంపేట గ్రామంలో మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కొమురవెల్లిలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

04/19/2016 - 01:52

సంగారెడ్డి, ఏప్రిల్ 18: గుడిసె, పెంకుటిల్లు లేకుండా రోడ్లు, తాగునీటి వసతి, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన తరహాలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం సబబే అయినా తాత్కాలిక వసతుల కల్పనలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది.

04/19/2016 - 01:52

నల్లగొండ/కరీంనగర్/వరంగల్/ఆదిలాబాద్/మెదక్, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రతతో 14 మంది మరణించారు.

04/19/2016 - 01:51

కరీంనగర్, ఏప్రిల్ 18: కాకతీయ కాలువల ఆధునీకరణ పనులు మే నెలాఖరు వరకు పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం మంత్రి శ్రీహరి ఎల్‌ఎండి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం ఎల్‌ఎండి నుండి వరంగల్ వరకు జరుగుతున్న కాకతీయ కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు.

04/19/2016 - 01:49

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 18: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే, పిసిసి ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు.

04/19/2016 - 01:48

లీగల్ (కరీంనగర్), ఏప్రిల్ 18: వ్యవసాయ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళను వేధింపులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో అసభ్యకరమైన పదాలతో వాట్సాప్‌లో మెస్సేజ్‌లు పంపిన హైదరాబాద్ సిఐడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కట్ట దయాకర్ రెడ్డి (54)ని కరీంనగర్ రెండవ పట్టణ పోలీసులు అదనపు జూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మాధవి ఎదుట సోమవారం రాత్రి హాజరుపర్చారు.

Pages