S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/20/2016 - 04:21

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో కరవు తాండవిస్తోందని, కేంద్రం చేయూతనిచ్చి ఆదుకోవాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కెటిఆర్ అభ్యర్ధించారు. రాష్ట్రం లో కరవు పరిస్థితులు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల పనితీరుపై కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్ చౌదరి, రామ్‌కృపాల్‌యాదవ్ మంగళవారం నగరంలో సమీక్ష నిర్వహించారు.

04/20/2016 - 04:17

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇళ్లులేని నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇంటి నిర్మాణ దశలకు అనుగుణంగా ప్రభుత్వం వీటికి ఆర్థిక సహాయం చేయడం ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం. అయితే గత ప్రభుత్వ హయాంలో సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల ఇవీ పూర్తికాకుండా అసంపూర్తిగా మిగిలిపోయా యి.

04/19/2016 - 18:05

నిజామాబాద్: తెలంగాణ విద్యాసంస్థల్లో పోలీసులు చొరబడి తనిఖీలు చేయడం పట్ల తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్యామండలి అధికారులు మాత్రమే విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలన్నారు.

04/19/2016 - 17:06

హైదరాబాద్: అక్రమాలు జరుగుతున్నాయన్న నెపంతో తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల చేత తనిఖీలు చేయించడం సరికాదని సిపిఐ నేత నారాయణ అన్నారు. విద్యాసంస్థల్లోకి పోలీసులు రావడంతో పిల్లలు భయపడుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంలో లొసుగులు జరిగితే పోలీసులకు బదులు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయవచ్చన్నారు.

04/19/2016 - 17:05

హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నప్పటికీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష యథాప్రకారం జరుగుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భారీగా నిధులు దుర్వినియోగం కావడంతో ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయని, దీన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. ఇకపై తెలంగాణలో అన్ని వర్సిటీల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ ఉంటుందన్నారు.

04/19/2016 - 17:05

హైదరాబాద్: నగరంలో మరో పది మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ చెప్పారు. ఆయన మంగళవారం హుస్సేన్‌సాగర్ వద్ద ఆధునిక మురుగుశుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్, మూసీ నది ప్రక్షాళనకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలోగా పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు.

04/19/2016 - 17:07

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల16 న ఉపఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ ఉపఎన్నిక అవసరమైంది. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మే 2ను గడువుగా నిర్ణయించారు.

04/19/2016 - 17:00

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఓ మహిళ ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవించింది. నారాయణగూడలో శాంతి థియేటర్ వద్ద మంగళవారం ఓ మహిళకు పురిటినొప్పులు ప్రారంభం కావడంతో సమీపంలో ఉన్న మహిళా పోలీసులుప్రసవానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత తల్లి, బిడ్డను కోటిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. పుట్‌పాత్‌పై ప్రసవించిన మహిళ యాచకురాలని తెలిసింది.

04/19/2016 - 15:24

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మే3న చలో దిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పిస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. దళితుల పట్ల అన్నివిధాలుగా వివక్ష చూపుతున్న తెలంగాణ సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడం కేవలం ప్రచారం కోసమేనని ఆయన విమర్శించారు.

04/19/2016 - 12:26

హైదరాబాద్: ఓ మహిళ మెడలోనుంచి గొలుసును లాక్కున్న చైన్ స్నాచర్లు ఓ కానిస్టేబుల్‌కు చెందిన బైక్‌పై పలాయనం చిత్తగించారు. సరూర్‌నగర్ వద్ద మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా ఓ కానిస్టేబుల్ వెంబడించాడు.

Pages