తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇళ్లులేని నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇంటి నిర్మాణ దశలకు అనుగుణంగా ప్రభుత్వం వీటికి ఆర్థిక సహాయం చేయడం ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం. అయితే గత ప్రభుత్వ హయాంలో సకాలంలో నిధులు విడుదల కాకపోవడం వల్ల ఇవీ పూర్తికాకుండా అసంపూర్తిగా మిగిలిపోయా యి. ఈ క్రమంలోనే ప్రభుత్వం మారిపోయి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అసలైన లబ్ధిదారుల కంటే అప్పటి అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బినామీలుగా ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించి, సిఐడికి అప్పగించింది. ప్రాథమిక విచారణలోనే భారీగా అవకతవకలు జరిగినట్టు సిఐడి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందు కు బాధ్యులైన 250 మంది ఉద్యోగులపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసింది కూడా. అలాగని ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని లబ్ధిదారులంతా బోగస్సు కాకపోయినా సిఐడి విచారణ పేరుతో లబ్ధిదారులందరికీ నిధులు నిలిపివేసింది. ఇది సరికాదంటూ అప్పట్లో విపక్షాలు ధ్వజమెత్తాయి కూడా. దీంతో ఇప్పటికే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన 57 వేల మందికి మొక్కుబడిగా నిధులు విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రెండు లక్షల మందికి బిల్లులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు అర్థంతరంగా నిలిచిపోయాయి. సిఐడి విచారణ కారణంగా వీరికి బిల్లులు చెల్లించలేకపోయామని ప్రభుత్వం గత రెండేళ్లుగా చెబుతూ వస్తుంది. అయితే ఇంకెంత కాలం సిఐడి విచారణ జరుగుతుంది, తమకు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అలాగని తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి దరఖాస్తు చేసుకుందామనుకున్నా, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్థిపొందిన వారు ఈ పథకానికి అర్హులు కాదని గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. దీంతో పాత వాటికి బిల్లులు రాక, కొత్తవాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేక తమ పరిస్థితి రెంటికి చెడ్డా రేవడిలా తయారైందని వారు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణం చేపట్టిన ఇంటిపై పెట్టిన పెట్టుబడిని వదిలేసుకొని కొత్త ఇంటికి దరఖాస్తు చేసుకుందామన్నా ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్థిదారుల నుంచి ఆధార్ కార్డులను సేకరించింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఆధార్ కార్డులను అనుసంధానం చేయనున్నట్టు ప్రకటించడంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్నా బయటిపడిపోతుంది. అదే జరిగితే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా క్రిమినల్ కేసులను ఎదుర్కొవాల్సి వస్తుందేమోనని వారు భయపడిపోతున్నారు. మొత్తంగా ఇందిరమ్మ లబ్దిదారుల పరిస్థితి గందరగోళంగా మారింది.