తెలంగాణ

కరవు ఉరుముతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో కరవు తాండవిస్తోందని, కేంద్రం చేయూతనిచ్చి ఆదుకోవాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కెటిఆర్ అభ్యర్ధించారు. రాష్ట్రం లో కరవు పరిస్థితులు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల పనితీరుపై కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్ చౌదరి, రామ్‌కృపాల్‌యాదవ్ మంగళవారం నగరంలో సమీక్ష నిర్వహించారు. 231 కరవు మండలాల్లో సహాయ కార్యక్రమాలకు 3064 కోట్ల రూపాయల కేంద్ర సహాయం కోరితే కేవలం 791 కోట్ల రూపాయలు మంజూ రు చేశారని కెటిఆర్ తెలిపారు. మంచినీటి అవసరాల కోసం 555 కోట్లు అడిగితే కేవలం 72 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఈ రెండు అంశాల్లో కేంద్రం తెలంగాణకు మరింత సహాయం చేయాలని కోరారు. కాగా మిషన్ భగీరథతో తెలంగాణ చరిత్ర సృష్టించిందని, కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి కష్టాలను సమూలంగా దూరం చేసే ఈ ప్రాజెక్టు దేశానికే మార్గదర్శనం చేస్తోందని అన్నారు. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి రాం కృపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తాగునీటి సమస్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ గొప్ప ప్రయత్నమన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టాల్సిందిగా ఇతర రాష్ట్రాలకు తాము సూచిస్తున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం, నిధుల సేకరణ ఎలా చేస్తున్నారో అడిగారు. ప్రాజెక్టు పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. త్వరలోనే రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించి మిషన్ భగీరథ పనులు చూస్తామని బీరేంద్రసింగ్ తెలిపారు. భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరం అయిన నిధుల సమీకరణలో తమ వంతు సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. జైకా, నాబార్డ్ వంటి సంస్థలతో స్వయంగా మాట్లాడతానని బీరేంద్ర తెలిపారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్‌తో పాటు శాఖాధిపతులు పాల్గొన్నారు.

చిత్రం... తాగునీటి సరఫరాపై కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్ర సింగ్, రామ్‌కృపాల్‌యాదవ్‌ల సమీక్ష సమావేశం