S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/21/2016 - 16:48

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ సీటుకు జరిగే ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును బరిలో నిలపాలని టిడిపి నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇక్కడ గురువారం పాలేరు నియోజకవర్గం ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

04/21/2016 - 16:47

హైదరాబాద్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఒకేరోజు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సన్నాహాలను పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యామంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు. రెండు రోజుల క్రితం ఎపిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకే రోజున విడుదల చేసిన సంగతి తెలిసిందే.

04/21/2016 - 16:45

ఖమ్మం: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో సిఆర్‌పిఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయిన ఘటన దుమ్ముగూడెం మండలం పైడిగూడెం అటవీ ప్రాంతంలో గురువారం జరిగింది. మావోయిస్టుల కదలికలకు సంబంధించి సమాచారం తెలియడంతో పైడిగూడెం ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. మావోలు అమర్చిన మందుపాతర పేలడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడని జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

04/21/2016 - 16:44

నిజామాబాద్: పెళ్లి విందులో భోజనం చేశాక 170 మంది అస్వస్థకు లోనైన ఘటన మాచారెడ్డి మండలం సర్దార్‌పూర్ తండాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. అనారోగ్యం పాలైన వారిని వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

04/21/2016 - 14:56

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తెరాస పార్టీ గెలుపు కేవలం లాంఛనమేనని, ఏ ఎన్నికల్లోనైనా తమకు తిరుగులేదని మంత్రి కెటిఆర్ అన్నారు. పార్టీ నిర్వహించిన సర్వేలో ప్రజాభిప్రాయం మేరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పాలేరులో తమ అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. పాలేరు ఓటర్లు అభివృద్ధికే పట్టం కడతారని, విపక్ష నేతలను తరిమికొడతారన్నారు.

04/21/2016 - 14:56

హైదరాబాద్: వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం మంచిదేనని, అలాగే పేదింటి పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ఉచిత భోజన పథాకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. కరవు ప్రాంతాల్లో రైతలను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

04/21/2016 - 14:55

నల్గొండ: ప్రైవేటు కళాశాలల్లో పోలీసులు, సిఐడి అధికారులు దాడులు జరపడాన్ని నిరసిస్తూ ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు గురువారం కోదాడలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యాసంస్థలపై దాడులను తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

04/21/2016 - 14:53

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసే ముందు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని టిడిపి నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం జరిగిన పాలేరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఎన్నికల్లోనూ తెరాస నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

04/21/2016 - 14:52

కరీంనగర్: తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నాడు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కరవు మండలాలను తక్షణం ప్రకటించాలని, అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు నినాదాలు చేశారు. ఎప్పుడూ ఎన్నికలపై తప్ప రైతు సంక్షేమాన్ని సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

04/21/2016 - 14:50

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో జరిగే శోభాయాత్రకు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన రెడ్డి గురువారం తాడ్‌బంద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. శోభయాత్రలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్త వహించాలని వారు అధికారులను ఆదేశించారు.

Pages