తెలంగాణ

మంత్రి పోచారం నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 19: వెటర్నరీ వైద్యుల నియామకాలు డిపార్టుమెంట్ కమిటీ ద్వారా చేపట్టాలని రెండు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసింది. వర్శిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని నిర్బంధించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు భారీయెత్తున తరలివచ్చారు. ఆడిటోరియాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆడిటోరియంలోకి దూసుకుపోవడానికి ప్రయత్నించిన విద్యార్థుల్ని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. సహనం కోల్పోయిన పోలీసులు.. విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారం లాఠీచార్జి చేశారు. విద్యార్థులు స్పృహతప్పి పడిపోయినా కనికరించకుండా బూటుకాళ్లతో తొక్కుతూ లాఠీలతో చితకబాదారు. ఆరుగురు వెటర్నరీ విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. తోటి విద్యార్థులు అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంత్రిని పోలీసులు సురక్షితంగా అక్కడినుంచి తరలించారు.
గతంలో వెటర్నరీ డిపార్టుమెంట్ కమిటీ ద్వారా వెటర్నరీ ఉద్యోగ నియామకాలు జరిగేవి. ప్రస్తుతం ఈ నియామకాల భర్తీని జిఓ 45 ద్వారా టిఎస్‌పిఎస్‌సి చేపట్టింది. దీనికి విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన తెలుపుతూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ రైతు జెఎసి, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపడంతో ఆందోళన మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
న్యాయం చేస్తా: పోచారం
విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లుగానే వెటర్నరీ డాక్టర్ పోస్టులను డిపార్టుమెంట్ సెలక్షన్ ద్వారానే జరిగే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి న్యాయం చేస్తానని మంత్రి పోచారం హామీ ఇచ్చారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు విద్యార్థులను మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, యువనేత కార్తీక్‌రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల ఆందోళన న్యాయబద్ధమైనదేనని, ప్రభుత్వం ఉద్యోగాల నియమకాలు రాకుండా దొడ్డిదారిన జివో 45ను తీసుకువచ్చిందని మండిపడ్డారు.

చిత్రం... రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి పోచారం