తెలంగాణ

కెసిఆర్ పాలనపైనే ప్రపంచ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనవైపే ప్రపంచం యావత్తు దృష్టిసారించిందనీ, ఆయన ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రజాసంక్షేమం కోసమేనని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. రానున్న విద్యాసంవత్సరం నుండి స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరిక మేరకు డోర్నకల్ నియోజకవర్గంలో మరో మూడు గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా కురవి మండలంలోని చింతపల్లి లక్కరాజు కుంట మిషన్‌కాకతీయ పనులను కడియం శ్రీహరి ప్రారంభించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ కాకతీయులు వరంగల్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలించారని, నాడు సాగునీరుపై దృష్టి కేంద్రీకరించిన దానికి నిదర్శనంగానే జిల్లాలో ఐదువేలకు పైగా కుంటలు, చెరువుల్ని తవ్వించారన్నారు. ఆంధ్రా వలస పాలకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలలో అణచివేతకు గురైందన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకువచ్చే పథకాలన్ని ప్రజల సంక్షేమానికి రూపొందించనవేనని, దేశం గర్వించదగ్గ నాయకుడని ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కొనియాడారు. ఎందరో నాయకులను దగ్గరనుండి చూసానని, తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సాగునీరు విషయాలను క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు మాత్రం ముఖ్యమంత్రేనన్నారు. మూడు గురుకులాలకు అవకాశం కల్పించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రెడ్యానాయక్ నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఫుట్‌పాత్‌పై ప్రసవం
సహకరించిన మహిళా కానిస్టేబుళ్లు
ప్రశంసించిన కమిషనర్ మహేందర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదనతో ఉన్న ఓ మహిళకు మహిళా కానిస్టేబుళ్లు అండగా నిలిచారు. ప్రసవం తరువాత తల్లి, బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. నారాయణగూడ శాంతి థియేటర్ సమీపంలో ఓ మహిళ ప్రసవ వేదన పడుతోంది. సమాచారం తెలుసుకున్న నారాయణగూడ మహిళా పోలీసులు స్పందించి ప్రసవానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసి సహకరించారు. అనంతరం తల్లి, బిడ్డను కోఠిలోని మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు. ప్రసవం కోసం మహిళా పోలీసులు చూపిన చొరవను స్థానికులు అభినందించారు. ప్రసవించిన మహిళ ఓ యాచకురాలని తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మహిళా పోలీసులను ఫోన్ ద్వారా ప్రశంసించారు.

కానిస్టేబుల్ బైక్‌పైనే
చైన్‌స్నాచర్ పరారీ
వెంబడించి బైక్‌ను పోగొట్టుకున్న
ఎల్‌బినగర్ కానిస్టేబుల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 19: చైన్ స్నాచర్లు తమ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో ఏకంగా ఓ కానిస్టేబుల్ బైక్‌నే అపహరించి పారిపోయిన సంఘటన మంగళవారం ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఎల్‌బినగర్-సరూర్‌నగర్ మధ్య ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. అయితే పారిపోతున్న చైన్ స్నాచర్లను పోలీసులు వెంబడించారు. సరూర్‌నగర్ సమీపంలోని చైతన్య కాలనీలోకి బైక్ మళ్లించిన చైన్ స్నాచర్లను పట్టుకునే సమయంలో చైన్ స్నాచర్ల బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. కానిస్టేబుల్ ఒక్కరే ఉన్నందున ఎదిరించలేకపోయారు. దీంతో చైన్ స్నాచర్లు ఏకంగా కానిస్టేబుల్ బైక్‌నే లాక్కుని పారిపోయారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ సమ్మయ్య ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా చైన్ స్నాచర్లు వదిలివెళ్లిన బైక్‌ను స్వాధీనం చేసుకున్న ఎల్‌బినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.