తెలంగాణ

పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా సివి ఆనంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌ను నియమిస్తూ భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తారు. బూత్ స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణ, పార్టీ అభ్యర్థుల వ్యయం, మద్యం, డిస్టిల్లరీల కార్యకలాపాలతోపాటు పెయిడ్ న్యూస్, బ్యాంక్ లావాదేవీలపై నిఘా వేస్తారు.

ఆర్కిటెక్చర్ వర్శిటీకి జూన్‌లోగా విసి
హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 20: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీని ఇన్‌చార్జీ విసితో ఎక్కువ కాలం నడపవద్దని, తక్షణమే విసిని నియమించాలని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఈ ఏడాది 30వ తేదీలోపల కొత్త విసిని ఈ వర్శిటీకి నియమిస్తామని తెలిపారు. అంతకు ముందు ఈ వర్శిటీకి పూర్తి కాలం విసిని నియమించాలని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ పిల్‌ను దాఖలు చేయగా హైకోర్టు స్వీకరించి విచారించింది. కాగా ప్రభుత్వం ఇచ్చిన హామీతో పిల్‌ను మూసివేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

తెలంగాణ గిరిజన సంఘం
అధ్యక్షుడిగా ధర్మానాయక్
హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం తెలిపింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.్ధర్మానాయక్, ఎం.శోభన్ నాయక్‌లు ఎన్నికైనట్లు సంఘం పేర్కొంది. ఈ నెల 17, 18 తేదీల్లో అచ్చంపేటలో జరిగిన రాష్ట్ర తొలి మహాసభలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని తెలిపిం ది. సంఘం ఉపాధ్యక్షులుగా గుగులోత్ ధర్మా, పి.సోమ య్య, ధీరావత్ రవినాయక్, అంగోత్ వెంకన్న నాయక్ ఎన్నికయ్యారు. మహాసభలో 18 తీర్మానాలను ఆమోదించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుధవారం వెల్లడించా రు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

వండర్లా పార్కును
ప్రారంభించిన చందూలాల్
హైదరాబాద్, ఏప్రిల్ 20: వండర్లా హాలిడేస్ లిమిటెడ్ తన 3వ థీమ్ పార్కును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ 13వ దారి వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన థీమ్ పార్కును తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి ఎ.చందూలాల్ ప్రారంభించారు. వాటర్, ల్యాండ్ రైడ్స్‌ను రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వండర్లా సంస్థ ఎండి అరుణ్ కె.చిట్టిపల్లి మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ పార్కులోకి సందర్శకులను అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అమ్యూజ్‌మెంట్ పార్కు ఏర్పాటుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు తెలిపారు. దీనిలో 43 ఆకర్షణలు ఉం డగా వాటిలో భూమి మీద 25, నీటి ఆధారంగా 18 ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వండర్లా కొచ్చిలో 35 ఎకరాల్లో, బెంగళూరులో 82 ఎకరాల్లో థీమ్ పార్కులను ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో 3వ పార్కు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

పొంగులేటి రాజీనామా
చేయలేదు: షబ్బీర్
హైదరాబాద్, ఏప్రిల్ 20: ఎఐసిసి మాజీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, పదవులకు పొంగులేటి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని పొంగులేటి అన్నారని షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిజర్వేషన్ల కోసం ఉద్యమం: విహెచ్
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో దేశ వ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశాన్ని లేవదీయనున్నట్లు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ చేశారు.

కరవు సమయంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ?
రాష్ట్రంలో తీవ్రమైన కరవుతో ప్రజలు అల్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీగా ఉన్నదని కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి విమర్శించారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన సబ్సిడీలు అర్హులైన రైతులకు అందడం లేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా స్పందించడం లేదని ఆయన విమర్శించారు.

డ్యాం గ్యాలరీలను
పరిశీలించిన నిపుణుల బృందం

నాగార్జునసాగర్, ఏప్రిల్ 20: నాగార్జునసాగర్ డ్యాం అంతర్భాగంలోని గ్యాలరీలను డ్యాం సేఫ్టి రివ్యూ ప్యానెల్ కమిటీ బుధవారం సందర్శించి పరిశీలించింది. గత రెండురోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో డ్యాం సేఫ్టీ రివ్యూప్యానెల్ చైర్మన్ ఎం.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. బుధవారం డ్యాం అంతర్భాగంలో ఉన్న గ్యాలరీలను చేరుకోని అక్కడ సీకేజి వాటర్‌ను పరిశీలించారు. అనంతరం గేట్ల విభాగాన్ని పరిశీలించారు. అనంతరం డ్యాం అధికారులతో స్థానిక విజయవిహార్‌లో సమావేశమయ్యారు. వీరిలో చైర్మన్ ఎంఎస్.రెడ్డితోపాటు ప్రధాన్, శర్మ, పోలె, చౌదరి, డ్యాం ఎస్‌ఇ రమేశ్, ఇఇ విష్ణుప్రసాద్‌లు ఉన్నారు. కాగా, గురువారం కుడి, ఎడమ ఎర్త్‌డ్యాంలను, హెడ్‌రెగ్యులేటర్లను సందర్శించిన అనంతరం డ్యాం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.