S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/22/2016 - 08:41

కరీంనగర్, ఏప్రిల్ 21: నేను ఎలాంటి తప్పు చేయలేదని, వడ్డీ వ్యాపారం అసలే చేయలేదని అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో అరెస్టయి సస్పెన్షన్‌కు గురైన ఎఎస్‌ఐ బొబ్బల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన వందల ఎకరాల భూమితో ఆస్తులు సంపాదించానని తెలిపారు. తనకు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయనడం నిజం కాదన్నారు.

04/22/2016 - 08:39

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలంగాణ ప్రభుత్వం వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, విద్యార్థుల నుండి పెద్దగా స్పందన రాలేదు. ఈ కార్యక్రమం గురువారమే తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రారంభమైంది. సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది.

04/22/2016 - 08:32

కరీంనగర్, ఏప్రిల్ 19: ఇద్దరు మంత్రులు, ఒక ఎంపి దత్తత తీసుకున్న జిల్లాలోని పలు గ్రామాల్లో వారి ‘దయ’ కరువైంది. ఆరంభంలో కాస్త హడావుడి చేసినా..ఆ తరువాత మొక్కుబడిగానే చర్యలు ఉండటంతో ఇటు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోగా, అటు కనీస వౌలిక వసతులు సైతం ప్రజల దరి చేరలేకపోయాయి. ఒకట్రెండు గ్రామాల్లో తాగునీటి సమస్యను కొంతమేర తీర్చినా...మిగతా గ్రామాల్లోని జనం దాహార్తితో అలమటిస్తోంది.

04/22/2016 - 08:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: క్రీమీలేయర్ పేరుతో తన కుమార్తెకు ఒబిసి సర్ట్ఫికెట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించటం చూస్తుంటే రాష్ట్రంలోని బిసిలకు ఏ స్థాయిలో అన్యాయం జరుగుతోందనేది స్పష్టమవుతోందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. హనుమంతరావు గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడి కుమార్తెకు ఒబిసి సర్ట్ఫికెట్ ఇవ్వకపోవటం ఏమిటి?

04/22/2016 - 08:27

సంగారెడ్డి, ఏప్రిల్ 18: గుడిసె, పెంకుటిల్లు లేకుండా రోడ్లు, తాగునీటి వసతి, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన తరహాలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం సబబే అయినా తాత్కాలిక వసతుల కల్పనలో అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడటంతో జనం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

04/22/2016 - 08:25

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంలో జరుగుతున్న అవినీతి డొంకను ఎసిబి అధికారులు ఎట్టకేలకు బయట పెట్టారు. అంతేకాకుండా అక్రమార్కులను జాబితాను జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ కూడా అందజేయడంతో అక్రమార్కులను జైలుకు పంపేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.

04/22/2016 - 08:24

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 21: ఇంత జరిగినా కుక్కతోక వంకరే అన్నట్లుగా మారింది జిల్లాకేంద్రంలోని శిశుగృహ సిబ్బంది తీరు. ఓవైపు ఆయాల అనుచిత ప్రవర్తన యావత్ జిల్లాయంత్రాంగానికే తలవంపులు తేగా, అధికారులు తలలు పట్టుకుంటుంటే, తమ నడవడిని మార్చుకుని విధులపట్ల అంకితభావం ప్రదర్శించాల్సిన సంరక్షకురాలు అనాథబాలలపట్ల అదే తీరును ప్రదర్శించింది. శిశుగృహలోని చిన్నారుల చేతులపై వాతల వైనం బుధవారం వెలుగులోకి వచ్చింది.

04/22/2016 - 08:24

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీర్ చందూలాల్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, గత అరవై ఏళ్లనుండి తెలంగాణలోని గిరిజనులకు న్యాయం జరగలేదని వాపోయారు.

04/21/2016 - 18:04

హైదరాబాద్: గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే వేలాది ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు ఇకనైనా అధికారులు భూ వివాదాలను సత్వరంగా పరిష్కరించేలా కృషి చేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి ఆయన గురువారం అధికారులతో సమీక్ష జరిపారు. కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

04/21/2016 - 18:03

హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసినందున ఖమ్మంలో తెరాస పార్టీ ప్లీనరీ నిర్వహణకు అనుమతి ఇవ్వరాదంటూ టి.కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఉప ఎన్నిక ఖమ్మం జిల్లాలో ఉంటే ప్లీనరీకి అనుమతించడం సరికాదన్నారు. పోలింగ్‌లో బ్యాలెట్ పేపర్లు వాడాలని, ఇవిఎంలు వాడితే ప్రింటర్లు పెట్టాలని వారు కోరారు.

Pages