తెలంగాణ

వరంగల్ వాసులకు వారంలో దేవాదుల నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఏప్రిల్ 20: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఈనెల 27కల్లా వరంగల్ నగర ప్రజలకు తాగునీరు అందిస్తామని వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర మేయర్ నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. నగర ప్రజలకు తాగునీరందించేందుకు రూ.8.69 కోట్లతో మండలంలోని దేవాదుల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. బుధవారం కమిషనర్, మేయర్లు పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల వద్ద నీటి మట్టం 72 మీ. ఉంటేనే మోటార్లు రన్‌చేసే అవకావం ఉన్నందున నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పనులను చేపట్టిందన్నారు. ఈ పనులను వేగవంతంచేసి ఈనెల 27లోగా నగర ప్రజల దాహార్తి తీర్చనున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం నీటిని సంపులోకి చేర్చేందుకు 50 హార్స్ పవర్ కలిగి మోటార్లు 16, 75 హార్స్‌పవర్ కలిగిన మోటార్లు 16 వినియోగించనున్నట్లు తెలిపారు. సుమారు 10 నుండి 12 లక్షలు జనాభా కలిగిన నగరానికి 350 టిఎంసి నీటిని అందించనున్నట్లు వెల్లడించారు. గోదావరి మధ్యలో రెండు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి అందులో మోటార్లను అమర్చేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మోటార్లను రన్ చేసేందుకు అవసరమయ్యే 500 కిలోవాట్స్‌గల 4 ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తిచేసి వారం రోజుల్లో నగర ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. వారి వెంట మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ బాలమునియర్ తోపాటు దేవాదుల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.