తెలంగాణ

సాగర్‌లో ఎన్‌ఎస్‌పి వర్సెస్ ఎస్‌పిఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత విధులు నిర్వహించే ఎస్‌పిఎఫ్ సిబ్బంది సాగర్ ప్రాజెక్టు ఉద్యోగులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, దానికి నిరసనగా బుధవారం డిఇ స్థాయి ఉద్యోగుల నుండి అటెండర్ స్థాయి వరకు విధులు బహిష్కరించారు. గత నాలుగు రోజుల క్రితం డ్యాంకు సంబంధించిన సిఇ సాల్మాల్‌రాజుపై ఎస్‌పిఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ దాడి దిగడం దాంతోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డిఇపై ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో డ్యాం ఉద్యోగులు, డిఇలు, డ్యాం ఉన్నతాధికారులైన ఎస్‌ఇ, ఇఇలకు తెలియచేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం పైలాన్ కాలనీలోని సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద సాగర్‌లోని ఎన్‌ఎస్‌పి ఉద్యోగులంతా విధులను బహిష్కరించి నిరసన సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఎస్‌పిఎఫ్ దౌర్జన్యాలు నశించాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఆపై హిల్‌కాలనీలోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి చేరుకుని దౌర్జన్యాలకు దిగుతున్న ఎస్‌పిఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎస్‌ఇ కార్యాలయం వద్ద వందలాది మంది ఉద్యోగులు, ఇంజనీర్లు ఆందోళన నిర్వహిం చి బైఠాయించారు. కార్యాలయానికి వచ్చిన ఎస్‌ఇ రమేశ్‌ను, ఇఇ విష్ణుప్రసాద్‌ను నిలదీశారు. కాగా, ఈ సంఘటనపై హైదరాబాద్ నుండి విచారణకు వచ్చిన ఎస్‌పిఎఫ్ కమాండెంట్ మాధవరావు బుధవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం 7 గంటల వరకు డ్యాం అధికారులతో చర్చ లు జరిపినా పరిష్కారం కాలేదు. చివరకు దౌర్జన్యాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే డ్యాం భద్రత వ్యవహారాలు చూసే ఎస్‌పిఎఫ్ సిబ్బంది కొందరు డ్యాం ఉన్నతాధికారులపై దాడులకు దిగడం ఇది మూడవసారి. ఈసారి ఉద్యోగ సంఘాలు దౌర్జన్యాలకు దిగుతున్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని బైఠాయించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకానొక సమయంలో డ్యాం ఉన్నతాధికారులు, ఎస్‌పిఎఫ్ కమాండెంట్ సమావేశం జరుగుతున్న సమయంలో ఉద్యోగులు అధికారులను గదిలో వేసి గొళ్లెం పెట్టారు. కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టును డ్యాం సేఫ్టి రివ్యూ ప్యానెల్ సందర్శిస్తున్న నేపధ్యంలో ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ఆందోళన చేయడం గమనార్హం.