తెలంగాణ

స్కూళ్ల ఫీజులు పెంచితే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: పాఠశాలల్లో ఫీజులను పెంచితే తాము తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్కూల్ ఫీజుల రెగ్యులేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు హెచ్చరించారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటనలు చేసిందని, హైకోర్టుకు హామీ ఇచ్చిందని, వారం రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన గడువు కూడా దాటిపోయిందని, అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం వల్ల ప్రైవేటు స్కూళ్లు ఫీజులు విపరీతంగా పెంచుతూనే ఉన్నాయని జాక్ నేతలు అరవింద జాటా, నాగటి నారాయణ, ఆశీస్ నరేడి పేర్కొన్నారు.
ఫీజులు చెల్లించకపోతే విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేస్తామని కొన్ని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని, తల్లిదండ్రుల అభ్యర్థనలను కూడా అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు, ప్రజలకు తెలియజేయడం కోసమే బహిరంగ విచారణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు, బాలల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, విద్యారంగం శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్టు వారు చెప్పారు. 22వ తేదీన నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకుమార్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి మాజీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం బుల్లయ్య తదితరులు పాల్గొంటారని వారు చెప్పారు.