తెలంగాణ

అభివృద్ధిలో ఎర్రవల్లి నంబర్‌వన్‌గా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 20: అభివృద్ధిలో ఎర్రవల్లి రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో నూతనంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడారు. రైతులకు సేవలు అందించేందుకు ఎర్రవల్లిలో ఎపిజివిబిని ఏర్పాటు చేసినందుకు బ్యాంకు అధికారులను అభినందించారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా జరుగనున్నట్లు చెప్పారు. దత్తత గ్రామాలను విత్తన కంపెనీలు దత్తత తీసుకున్నందున రైతుల లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారా జరుగనున్న దృష్ట్యా ఈ బ్రాంచి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవనున్నట్లు సిఎం అన్నారు. ప్రప్రథమంగా బ్యాంకులో ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు డిపాజిట్ చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. తాగునీటి సమస్య తీవ్రత దృష్ట్యా నాలుగు రోజుల్లో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు గోదావరి జలాలను ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా సరాఫరా చేసి ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు సరాపరా చేయాలని ఆధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో అధికారులకు గ్రామస్థులు తోడ్పాటు అందిస్తే మరింత ముందుకు సాగుతుందని సిఎం కెసిఆర్ సూచించారు. అంతా కలిసికట్టుగా ఉండి అంకాపూర్‌కు ధీటుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తికానందున మరోపది రోజుల్లో మల్లి ఎర్రవల్లిలో గ్రామసభ నిర్వహించుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ఎపిజివిబి బ్యాంకు చైర్మన్ నర్సిరెడ్డి, సర్పంచ్ భాగ్య బాలరాజు, ఎంపిటిసి భాగ్యమ్మ, విడిసి అధ్యక్షుడు కిష్టారెడ్డి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం ఎర్రవల్లి సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్