తెలంగాణ

సిఎం పేషీ ముందు ఆత్మహత్య చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: అక్రమ వడ్డీవ్యారి కరీంనగర్ ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి పేషీ ముందు ఆత్మహత్య చేసుకుంటామని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం హెచ్చరించింది. వడ్డీ వ్యాపారం ముసుగులో అమాయక ప్రజల వేలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్న మోహన్‌రెడ్డిపై సిబిఐచే దర్యాప్తు జరపాలని సంఘం డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద మోహన్‌రెడ్డి బాధితులు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగింది. లోక్‌సత్తా నేత శ్రీనివాసరావు, ప్రజాసంఘాల నాయకులు సంజీవరెడ్డి, హమీద్ ఖాద్రి, సజ్జ్భుయ్ తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు. ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి వడ్డీవ్యాపారంలో అమాయకులను మోసగించి రూ. 500 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్న కేసులో ఇటీవల ఆయన జైలుకు వెళ్లారు. మోహన్‌రెడ్డి అక్రమవ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న ఏడుగురు పోలీసు ఉన్నతాధికారుల్లో ఇద్దరు డిఎస్పీలు బదిలీ అయిన విషయం విధితమే. 11నవంబర్, 2015లో ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అమాయకుల భూములు లాక్కున్నట్టు కరీంనగర్‌లో 36 కేసులు నమోదయ్యాయి. జుడిషియరీ రిమాండ్‌లో ఉన్న మోహన్‌రెడ్డి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో మోహన్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని, అమాయకుల నుంచి లాక్కున్న భూములను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తిరిగి తమకు ఇప్పించాలని కోరుతూ బాధితులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వడ్డీవ్యాపారి మోహన్‌రెడ్డి నుంచి తమకు ప్రాణ హాని ఉందని, ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మోహన్‌రెడ్డి అరాచకాలపై కరీంనగర్‌లో వంద రోజులు నిరశన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వడ్డీవ్యాపారి మోహన్‌రెడ్డి వేధింపులు తాళలేక ఓ విద్యా సంస్థ చైర్మన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని, మోహన్‌రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు అన్నారు. మోహన్‌రెడ్డి కేసులను సిబిఐకి అప్పగించి బాధితులను న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

చిత్రం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిరాహార చేస్తున్న మోహన్‌రెడ్డి బాధితులు