S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/26/2016 - 06:30

నల్లగొండ, మే 25: మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి శ్రీకాంత్‌చారి, వేణుగోపాల్‌రెడ్డిల బలిదానాలతో ఊపిరులూదిన నల్లగొండ గడ్డ నుండే సిఎం కెసిఆర్‌ను గద్దె దించే పోరాటాన్ని మినీ మహానాడు వేదికగా ఆరంభించామని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో జరిగిన టిడిపి జిల్లా మినీ మహానాడు సభలో ఆయన ఆవేశంగా ప్రసంగిస్తూ కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.

05/26/2016 - 06:29

హైదరాబాద్, మే 25: షిర్డీ సాయిబాబా దేవుడా? కాదా? అనే అంశంపై చర్చ అవసరం లేదని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. పరిపూర్ణానంద తన శిష్యులతో కలిసి షిర్డీ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సాయిని కొంత మంది భగవంతుడిగా భావించి పూజిస్తే, మరికొంత మంది గురువుగా భావించి ఆరాధిస్తున్నారని పరిపూర్ణానంద గుర్తు చేశారు.

05/26/2016 - 06:28

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకుంటున్న చర్యలను శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య భారతీ తీర్థ మహాస్వామి అభినందించారు.

05/26/2016 - 05:14

కామారెడ్డి, మే 25: టెన్త్, ఇంటర్ చదువులు పూర్తిచేసుకున్న పిల్లలను ఇంటర్, బిటెక్‌లలో చేర్పించేందుకు వెళ్తూ రెండు కుటుంబాల్లోని ఐదుగురు రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఉదయం 8.45కు ఈ ప్రమాదం సంభవించింది.

05/26/2016 - 05:30

హైదరాబాద్/ గచ్చిబౌలి, మే 25: ఆంధ్రప్రదేశ్ సిపిఎం నేత మధు మేనల్లుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హాష్మి దారుణ హత్యకు గురయ్యాడు. నగర శివారులోని లింగంపల్లి రైల్వే ట్రాక్ వద్ద పడివున్న మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

05/26/2016 - 04:59

మహబూబ్‌నగర్, మే 25: గత మూడేళ్లుగా గుంపు మేస్ర్తీ చెరలో నరకాన్ని చవి చూసిన పాలమూరు కూలీలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కాంట్రాక్టర్ నిర్బంధం నుంచి తప్పించుకున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డొంకంతా కదిలింది. మూడేళ్ల పాటు ఆడ, మగా, గర్భిణులన్న తేడా లేకుండా రాక్షసంగా ప్రవర్తించిన గుంపు మేస్ర్తీ కూడా అరెస్టయ్యాడు.

05/26/2016 - 04:56

హైదరాబాద్, మే 25: గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే ప్రాజెక్టులపై ఇరవై రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాల్సిందిగా ‘వ్యాప్కోస్’ను నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు కోరారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను జలసౌధలో బుధవారం వ్యాప్కోస్ ప్రతినిధులు, చీఫ్ ఇంజనీర్లతో మంత్రి సమీక్షించారు.

05/26/2016 - 04:56

హైదరాబాద్, మే 25: రాజ్యసభకు ఎంపికచేసే అభ్యర్థులపై పాలకపక్షం తెరాసలో కసరత్తు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. మంగళవారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న సిఎం కె చంద్రశేఖర్‌రావు బుధవారం అక్కడి నుంచే పార్టీ ముఖ్యులు కొందరితో ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం. ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే పార్టీ ముఖ్యులు కొందరితో చర్చించిన తర్వాత సిఎం ప్రకటించడానికి రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.

05/26/2016 - 00:30

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో స్కూల్ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎన్‌జిఓల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం వద్ద బుధవారం నాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

05/26/2016 - 00:26

హైదరాబాద్, మే 25: అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల, మున్సిపల్‌శాఖల మంత్రి కె తారకరామారావుతన రెండవ రోజు పర్యటనలో బుధవారం కార్మెల్, ఇండియానా పోలిస్ నగరాలను సందర్శించారు.ఈ సందర్భంగా కార్మెల్ నగర మేయర్ జెమ్స్ బ్రెనార్డ్‌తో మంఅతి కెటిఆర్ సమావేశమయ్యారు. అక్కడ జరుగుతున్న నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు.

Pages