తెలంగాణ

షిర్డీ సాయిపై చర్చ ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: షిర్డీ సాయిబాబా దేవుడా? కాదా? అనే అంశంపై చర్చ అవసరం లేదని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. పరిపూర్ణానంద తన శిష్యులతో కలిసి షిర్డీ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సాయిని కొంత మంది భగవంతుడిగా భావించి పూజిస్తే, మరికొంత మంది గురువుగా భావించి ఆరాధిస్తున్నారని పరిపూర్ణానంద గుర్తు చేశారు. సాయిని పూజించడం, ఆరాధించడం అన్న అంశాలు భక్తుల మనోభావాలకు సంబంధించిందన్నారు. ఎదుటివారి విశ్వాసాన్ని గౌరవించడం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగమని, అందువల్ల షిర్డీ సాయిని ఏ రూపంలో కొలిచేవారి మనోభావాలనైనా గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. భారత రాజ్యాంగం కూడా ఇతరుల మనోభావాలను కించపరచవద్దని చెబుతోందన్నారు. షిర్డీలో బాబాకు హిందూ సాంప్రదాయాల ప్రకారమే పూజలు జరుగుతున్నాయని పరిపూర్ణానంద గుర్తు చేశారు. మసీదును మందిరంగా మార్చిన షిర్డీసాయి నిరాడంబరంగా జీవిస్తూ, ధర్మప్రచారం చేసిన మహానుభావుడని కొనియాడారు. కొంత మంది స్వార్థబుద్దితో మరికొంత మంది ప్రచారం కోసం సాయి దేవుడా, కాదా అంటూ రచ్చ చేయడం సాయిభక్తులనే కాకుండా కోట్లాది మంది హిందువుల మనోభావాలను కూడా గాయపరిచిందన్నారు. అందువల్ల ఈ అంశంపై చర్చను ఇకనైనా ఆపివేయాలని ఆయన సూచించారు. సున్నితమైన విషయాల్లో, మతపరమైన విశ్వాసాల విషయంలో అందరూ సంయమనం పాటించాలని పిలుపు ఇచ్చారు. షిర్డీసాయికి పరిపూర్ణానంద వస్త్రాలను సమర్పించి, బాబా పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందకు సాయి సంస్థాన్ అపూర్వ స్వాగతం పలికింది. సాయి సమాధితో పాటు ధుని, చావడి, ద్వారకామయిని ఆయన సందర్శించారు. షిర్డీలోని పంచముఖ గణపతికి విశేషపూజలు నిర్వహించారు.

షిర్డీలో సాయబాబాను దర్శించుకున్న స్వామి పరిపూర్ణానంద