తెలంగాణ

ప్రాజెక్టుల వేగంపెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే ప్రాజెక్టులపై ఇరవై రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాల్సిందిగా ‘వ్యాప్కోస్’ను నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు కోరారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను జలసౌధలో బుధవారం వ్యాప్కోస్ ప్రతినిధులు, చీఫ్ ఇంజనీర్లతో మంత్రి సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట పరిధిలో రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టుపై త్వరిగతిన సర్వే పూర్తి చేయాలని వ్యాప్కోస్‌ను మంత్రి ఆదేశించారు. అలాగే జూన్ మొదటి వారంలోగా ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. కినె్నరసాని, రోళ్లపాడు ఆలైన్‌మెంట్ సర్వే పూర్తి చేసి జూన్ నెలాఖరుకల్లా టెండర్లు పిలవాలని మంత్రి సూచించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రాజెక్టుల సర్వేలన్నింటినీ భద్రాచలం జిటిఎస్‌ను బెంచ్ మార్క్‌గా తీసుకోవాలన్నారు. తుమ్మిడిహట్టి, సీతారామ ప్రాజెక్టు, మల్లన్న సాగర్ నుంచి సింగూరు, మల్లన్నసాగర్ నుంచి నిజామాబాద్ జిల్లా భూంపల్లి వరకు సర్వేలు, సుందిళ్ల, అన్నారం, పత్తిపాక రిజర్వాయర్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని నార్లాపూర్, డిండి సర్వే పనులు, వరంగల్ జిల్లాలోని దేవాదుల పనుల పురోగతిని కూడా మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి పాకాల, రామప్ప, ఘనపురం చెరువులకు అనుసంధానం చేసే చర్యలపై దృష్టి సారించాలని, దీనివల్ల ఆయా చెరువల కింద ఆయకట్టు పెరుగుతుందని, రెండవ పంటకు కూడా నీరు అందించే అవకాశం కలుగుతుందన్నారు. వ్యాప్కోస్ సంస్థ నిర్వహిస్తున్న సర్వే నివేదికలను డాటాబేస్‌ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే లైడార్ సర్వే వివరాలను విశే్లషించడానికి ఇంజనీర్లకు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు తలపెట్టిన లింక్ కాలువలకు ప్రత్యామ్నాయాలపై సర్వే చేయాలని మంత్రి వ్యాప్కోస్‌ను ఆదేశించారు. సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్లపై మూడు నాలుగు రోజుల్లో సర్వే నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి జైన బ్యారేజీ సర్వే నివేదికను త్వరగా సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావు, చీఫ్ ఇంజనీర్లు భగవంతరావు, వెంకటేశ్లర్లు, ఓఎస్‌డి శ్రీ్ధరరావు దేశ్‌పాండే తదితర అధికారులు పాల్గొన్నారు.