తెలంగాణ

ఆలయాల అభివృద్ధికి కెసిఆర్ చర్యలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకుంటున్న చర్యలను శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య భారతీ తీర్థ మహాస్వామి అభినందించారు.
శృంగేరీ పీఠంలో భారతీ తీర్థను తెలంగాణ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం కలిశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆలయాల అభివృద్ధికి కెసిఆర్ కృషి చేస్తున్నారంటూ భారతీతీర్థ మహాస్వామి ప్రశంసించారని మంత్రి తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి రూపొందించిన నమూనాలను త్వరలోనే శృంగేరి పీఠానికి తీసుకువస్తామని భారతీ తీర్థకు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మాస్టర్‌ప్లాన్ పూర్తికాగానే శృంగేరి పీఠం ఆమో దం కోసం తీసుకుని వస్తామన్నారు. ఆమోదం తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఆలయాల అభివృద్ధి పనులు కొనసాగిస్తామని వెల్లడించారు. వేములవాడ ఆలయాన్ని ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు.
బాసరలోని సరస్వతీదేవి ఆలయం రాజగోపురంపై పిడుగుపడ్డ విషయాన్ని శృంగేరి పీఠాధిపతి దృష్టికి మంత్రి తీసుకువచ్చారు. ఆలయ పరిసరాలతో పాటు గర్భగుడిలో సంప్రోక్షణ చేసి శాంతి పూ జలు చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా శృంగేరి పీఠానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో మంచి వర్షాలు కురిసి, పంటలు పండాలని, రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ శృంగేరిపీఠంలోని రుష్య శృంగేశ్వర ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని తన స్వగృహంలో శత చండీయాగం నిర్వహిస్తున్న నేపథ్యంలో జగద్గురు శంకరాచార్య ఆశీస్సులు మంత్రి తీసుకున్నారు.

శృంగేరిలో పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి
ఆశీస్సులు తీసుకుంటున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి